Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Chocolate Day: ఈరోజు తియ్యటి వేడుక చేసుకుందాం.. ఈ చాక్లెట్స్‏తో మనసులోని మాటలను వ్యక్తపరచండిలా..

వాలెంటైన్ వీక్ ప్రారంభమయ్యింది. వరుసగా రోజ్ డే, ప్రపోజ్ డేలు గడిచిపోయాయి. ఇప్పటికీ తమ ప్రేమను చెప్పనివారు. చెప్పడానికి సంకోచించేవారు ఉండే ఉంటారు.

Chocolate Day: ఈరోజు తియ్యటి వేడుక చేసుకుందాం.. ఈ చాక్లెట్స్‏తో మనసులోని మాటలను వ్యక్తపరచండిలా..
Follow us
Rajitha Chanti

| Edited By: Team Veegam

Updated on: Feb 09, 2021 | 11:12 AM

Valentine Week: వాలెంటైన్ వీక్ ప్రారంభమయ్యింది. వరుసగా రోజ్ డే, ప్రపోజ్ డేలు గడిచిపోయాయి. ఇప్పటికీ తమ ప్రేమను చెప్పనివారు. చెప్పడానికి సంకోచించేవారు ఉండే ఉంటారు. ఎలా చెప్పాలి. ఏదైనా గిఫ్ట్ ఇవ్వాలా అని తికమకపడుతుంటారు. ఒక వేళ చెప్పితే వాళ్లు ఒప్పుకుంటారా ? ఎలాంటి సమాధానం వస్తోందో అని సందేహపడుతుంటారు. మీ ప్రియమైన వారి పట్ల మీలో ఉన్న భావాలను చెప్పడానికి ఈ చాక్లెట్ డేను సరైన సమయంగా ఉపయోగించుకోవచ్చు. వాలెంటైన్ వీక్‏లో మూడవ రోజు అంటే ఫిబ్రవరి 9న చాక్లెట్ డేగా జరుపుకుంటారు ప్రేమికులు. ఈ రోజున రకారకాల చాక్లెట్లను ఇచ్చి తమవారి పట్ల ఎంత ప్రేమ ఉందో తెలియజేస్తుంటారు. ఆల్రెడీ ప్రేమలో ఉన్నవారు తమవారికి ఇష్టమైన చాక్లెట్లను ఇచ్చి వారిని సంతోషపెడుతుంటారు.

“చాక్లెట్స్”..వీటిని ఇష్టపడని వారెవరుంటారు. చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ల వరకు అందరు ఎంతో ఇష్టంగా తినేది. ఒక శుభకార్యం చేసే ముందు నోరు తీపి చేసుకోవాలి అంటుంటారు… ఇక ఇదే మాటను మీరు ఫాలో అయిపోండి. సాధారణంగా వాలంటైన్స్ డే వస్తుందంటే రకరకాల ప్రేమ చాక్లెట్స్ మార్కెట్లోకి అందుబాటులోకి వస్తాయి. వాటిలో రకరకాల డార్క్ చాకోలెట్లను ఎంచుకొని మీ ఆత్మీయులకు అందివ్వండి. మీకు ఇష్టమైనవారి కోసం కొన్ని రకాల చాక్లెట్ల గురించి ముందుగా తెలుసుకోండి.

డార్క్ చాక్లెట్… 

ఆరోగ్యం ప్రకారం చూస్తే, డార్క్ చాక్లెట్ బరువు తగ్గడానికి మంచిదిగా చెప్పబడుతుంది. అవేకాకుండా మానసిక సమస్యలతో డిప్రెషన్ బారిన పడేవారికి కూడా డార్క్ చాక్లెట్ ఉపశమనాన్ని అందిస్తుంది. ఈ డార్క్ చాక్లెట్లలో కోకో ఎక్కువగా, పాలపదార్ధాలు తక్కువగా ఉంటాయి. క్రమంగా.. ఇందులో ఉండే కోకో ఆధారంగా డార్క్ చాక్లెట్ రుచి మారుతుంది.

మిల్క్ చాక్లెట్…

యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ఎఫ్ డీఏ మార్గదర్శకాల ప్రకారం, ఒక మిల్క్ చాక్లెట్‌లో కనీసం 10% చాక్లెట్ లిక్కర్, 3.39% బటర్‌ ఫాట్, 12% పాల పదార్థాలు ఉండాలి. మిల్క్ చాక్లెట్లలో క్యాడ్‌బరీ ప్రస్తావన లేకుండా ఉండదు. క్యాడ్‌బరీ భారతదేశంలోని చాక్లెట్‌లకు దాదాపుగా పర్యాయపదంగా ఉంటుంది.

వైట్ చాక్లెట్…

చక్కెర, పాలు, కోకో, కోకో బట్టర్ నుండి ఈ వైట్ చాక్లెట్ తయారు చేస్తారు. వైట్ చాక్లెట్లు పూర్తి తెలుపు రంగులో కాకుండా కాస్త పసులు రంగును పోలీ ఉంటాయి. ఈ చాక్లెట్లు సాధారణ చాక్లెట్లకు భిన్నంగా వెనీలా ఫ్లేవర్ కలిగి ఉంటాయి.

సెమీ-స్వీట్ చాక్లెట్…

సెమీ స్వీట్ చాక్లెట్ కూడా ఒక రకమైన డార్క్ చాక్లెట్. ఈ చాక్లెట్‌లో కోకో కేవలం 35% మాత్రమే ఉంటుంది. ఇది బిట్టర్ చాక్లెట్స్ కన్నా తీయగా ఉంటాయి. కావున ఈ చాక్లెట్ డే నాడు, మీ భాగస్వామికి మీరు ఏ రకం చాక్లెట్స్ బహుమతిగా ఇవ్వాలనుకుంటున్నారనేది ఇప్పుడే నిర్ణయించుకోండి.

చాక్లెట్స్ తోపాటు మీ ప్రేమను వ్యక్తం చేసి.. బంధాన్ని బలపరచుకోవడానికి మీ కోసం కొన్ని కోట్స్..

♥నిజమైన ప్రేమ.. మౌనంలో కూడా అర్థమవుతుందంటారు.. నీ కళ్ళలోకి చూసినప్పుడు నా ప్రేమ నీకర్థమవుతుంది అనుకుంటాను.. ఆగని నా గుండె చప్పుడు నీ చెవిన పడుతుందనుకుంటాను.. కానీ అదెంటో తెలియడం లేదు.. నా పెదవి తెరచి… నీన్ను ప్రేమిస్తున్నాను అనే చెప్పనిదే నీకు అర్థం కాదంట.. అందుకే ఈరోజు నా మౌనాన్ని వీడి నీతో చెప్పే తొలి మాట.. ‘నువ్వంటే నాకిష్టం’.. ఐ లవ్ యూ ప్రియతమా..

♥నువ్వు ఎవరికి అర్థం కాకపోవచ్చు.. కానీ నా జీవితానికి అర్థం నువ్వే.. నీ ప్రపంచమే.. నా ప్రపంచం.. నీ ప్రాణమే.. నా ప్రాణం.. రెప్పవాలనంత వరకు… కనురెప్పలా కాపాడుకుంటాను… లవ్ యూ..

♥చాక్లెట్స్ ఎలాంటి ప్రశ్నలు వేయవు.. కేవలం భావాన్ని అర్థం చేసుకుంటాయి. అందుకే నీకోసం ఈ చాక్లెట్ ప్రియతమా.. హ్యాప్పీ చాక్లెట్ డే. ♥చాలా షాప్స్ తిరిగాను నీకంటూ ప్రత్యేకమైన చాక్లెట్ ఇవ్వడానికని.. కానీ నేను కనుగోనలేకపోయాను నీ నవ్వు కంటే తియ్యనైనా చాక్లెట్ ఎక్కడ ఉంటుందని.. హ్యాప్పీ చాక్లెట్ డే స్వీట్ హార్ట్.. ♥నీకెప్పుడూ ప్రేమను మాత్రమే ఇస్తాను.. కానీ ఈసారి కొంచెం కొత్తగా నీకోసం ఈ తియ్యటి చాక్లెట్ ఇస్తున్నాను.. హ్యాప్పీ చాక్లెట్ డే.. ♥ఆరోగ్యంగా ఉండటానికి చాక్లెట్లు అవసరం, అలాగే సంతోషమైన జీవితానికి నిజమైన ప్రేమ అవసరం కాబట్టి, మై స్వీట్ హార్ట్ నీకు ఈరోజు తియ్యటి రోజు కావాలని మనసారా కోరుకుంటూ.. హ్యాప్పీ చాక్లెట్ డే.. ♥జీవితంలోని సంఘర్షణలు మరిచిపోయి.. క్షణమైన నీ మనస్సు ప్రశాంతంగా ఉండాలని కోరుకుంటూ.. నీకోసం ఈ చాక్లెట్స్.. హ్యాప్పీ చాక్లెట్ డే.

Also Read:

Valentine Week: భావాలను వ్యక్తం చేసి బంధాలను కలుపుకునే మధురమైన రోజు..