Covid Effect: కరోనా మహమ్మారి కాటుతో తల్లిదండ్రులను కోల్పోయి తెలుగు రాష్ట్రాల్లో అనాధలౌతున్న పిల్లలు

Children orphaned : కరోనా మహమ్మారి అనేక కుటుంబాలను, అనేక మంది అభాగ్యుల జీవితాలను తల్లకిందులు చేస్తోంది..

Covid Effect: కరోనా మహమ్మారి కాటుతో తల్లిదండ్రులను కోల్పోయి తెలుగు రాష్ట్రాల్లో అనాధలౌతున్న పిల్లలు
Corona Deaths
Follow us
Venkata Narayana

| Edited By: Team Veegam

Updated on: May 22, 2021 | 8:50 PM

Children orphaned : కరోనా మహమ్మారి అనేక కుటుంబాలను, అనేక మంది అభాగ్యుల జీవితాలను తల్లకిందులు చేస్తోంది. కుటుంబ పెద్ద మరణంతో ఎన్నో కుటుంబాలు వీధిపాలౌతున్నాయి. తల్లిదండ్రులు ఇద్దరూ కరోనాకు బలైపోతే వాళ్ల పిల్లలు అనాధలుగా మిగులుతున్నారు. చదువులు, బతుకు భరోసా లేక దిక్కుతోచని స్థితిలో చిన్నారుల పరిస్థితి అగమ్య గోచరంగా ఉంది. ఈ దిక్కులేని కుటుంబాలలో ఆడపిల్లల భద్రత మరింత ప్రశ్నార్ధకంగా ఉంది. ఏ కుటుంబంలోనైనా పిల్లలకు తల్లిదండ్రులే కొండంత అండ. పేదలైనా, ధనికులైనా సరే, అమ్మా నాన్న పక్కనుంటే ఆ ధీమా వేరు. పెరిగి పెద్దయ్యి కనీసం జీవితంలో స్థిరపడే వరకూ ఎవరికైనా తల్లిదండ్రుల ఆసరా ఉండాల్సిందే. కానీ కనికరం లేని కరోనా అనేక కుటుంబాల్లో పెద్దలను బలిగొంటుండటంతో దీన స్థితిలో బాలలు తల్లడిల్లిపోతున్నారు. తల్లిదండ్రులను కోల్పోయిన విషాదంలో ఉన్న పిల్లలపై కొన్ని కుటుంబాలలో ఇంట్లోని వృద్దుల పోషణ భారం పడుతోంది. చిన్నపిల్లలను మానవత్వంతో కొంతమంది చేరదీస్తుండగా, యుక్త వయస్సు పిల్లల పరిస్థితి మరింత అగమ్యగోచరంగా తయారైంది. కరోనాతో ఇటీవల తల్లిదండ్రులను కోల్పోయిన కుటుంబాల, పిల్లల దీనగాథలు.. విషాదకర ఉదంతాలు తెలుగురాష్ట్రాల్లో లెక్కకు మిక్కిలిగా ఉన్నాయి.

Read also : Low pressure : తూర్పు, మధ్య బంగాళాఖాతం ప్రాంతాలలో అల్పపీడనం.. రేపటికి బలపడి వాయుగుండంగా మారే అవకాశం

గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!