Low pressure : తూర్పు, మధ్య బంగాళాఖాతం ప్రాంతాలలో అల్పపీడనం.. రేపటికి బలపడి వాయుగుండంగా మారే అవకాశం
Bay Of Bengal : నైరుతి రుతుపవనాలు ఈరోజు (22.05.2021) నైరుతి బంగాళాఖాతము యొక్క మరికొన్ని ప్రాంతాలు, వాయువ్య బంగాళాఖాతంలోని చాలా ప్రాంతాలు,..
Bay Of Bengal : నైరుతి రుతుపవనాలు ఈరోజు (22.05.2021) నైరుతి బంగాళాఖాతము యొక్క మరికొన్ని ప్రాంతాలు, వాయువ్య బంగాళాఖాతంలోని చాలా ప్రాంతాలు, తూర్పు మధ్య బంగాళాఖాతంలోని కొన్ని ప్రాంతాలు, అండమాన్ సముద్రం, అండమాన్ నికోబార్ దీవులు యొక్క అన్ని ప్రాంతాలలో విస్తరించాయి. ఆగ్నేయ బంగాళాఖాతం ఇంకా దానిని అనుకుని ఉన్న మధ్య బంగాళాఖాతం ప్రాంతాలలో కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం ప్రభావం వలన తూర్పు మధ్య బంగాళాఖాతం ప్రాంతాలలో ఈరోజు (22.05.2021) అల్పపీడనం ఏర్పడింది, అనుబంధంగా మధ్యస్థ ట్రోపోస్పిరిక్ స్థాయిల వరకు ఉపరితల ఆవర్తనం విస్తరించి కొనసాగుతుంది. ఇది బలపడి రేపటికి (23.05.2021) అదే ప్రాంతములో వాయుగుండంగా మారే అవకాశం ఉంది. ఇది ఉత్తర-వాయువ్య దిశగా ప్రయాణించి బలపడి 24.05.2021 తేదీకి తుఫానుగా మారే అవకాశం ఉంది. తదుపరి 24 గంటల్లో ఇది మరింత బలపడి అతి తీవ్ర తుఫానుగా మారే అవకాశం ఉంది. తదుపరి ఇది ఉత్తర-వాయువ్య దిశగా ప్రయాణిస్తూ సుమారుగా 26వ తేదీ ఉదయంనకు ఒడిస్సా-పశ్చిమబెంగాల్ తీరాలకు దగ్గరలోని ఉత్తర బంగాళాఖాతము ప్రాంతమునకు చేరుకుంటుంది. 26.05.2021 తేదీ సాయంత్రమునకు ఇది పశ్చిమ బెంగాల్, దానిని ఆనుకుని ఉన్న ఒడిస్సా, బంగ్లాదేశ్ తీరాల వెంబడి తీరం దాటే అవకాశం ఉంది. ఈ మేరకు అమరావతిలోని వాతావరణ కేంద్రం సంచాలకులు వివరించారు.
Read also : Wealther update : ఉత్తర, దక్షిణ కోస్తాంధ్రా, యానాం ప్రాంత ప్రజలకు రాగల మూడు రోజుల వరకూ వాతావరణ సూచనలు :