- Telugu News Photo Gallery Business photos Neft service on stae bank of india internet banking yono and yono lite to be unavailable for 14 hours
SBI Customer Alert: ఎస్‌బీఐ కస్టమర్లకు అలర్ట్.. ఆదివారం డిజిటల్ సేవలకు అంతరాయం.. ఎందుకంటే..!
భారతదేశంలో అతిపెద్ద వాణిజ్య బ్యాంక్ అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) తన ఖాతాదారులకు అలర్ట్ చేసింది. ఆదివారం 14 గంటల పాటు ఇంటర్నెట్ బ్యాంకింగ్, ..
Updated on: May 22, 2021 | 8:20 PM

ఎస్‌బీఐలో జీరో బ్యాలెన్స్ అకౌంట్ హోల్డర్లకు బేసిక్ రూపే ఏటీఎం కమ్ డెబిట్ కార్డు వస్తుంది. నెలలో నాలుగు సార్లు ఉచితంగా బ్యాంక్ బ్రాంచ్‌లో, ఏటీఎంలో డబ్బులు డ్రా చేయొచ్చు. అంతకన్నా ఎక్కువసార్లు డ్రా చేస్తే సర్వీస్ ఛార్జీ చెల్లించాల్సి ఉంటుంది. ఈ ఛార్జీలు జూలై 1 నుంచి మారనున్నాయి. ఫస్ట్ నుంచి కొత్త సర్వీస్ ఛార్జీ రూ. 15తో పాటు జీఎస్టీ వర్తిస్తుంది.

ఇంటర్నెట్ బ్యాంకింగ్, యోనో, యోనో లైట్ వంటి వాటిల్లో నెఫ్ట్ సర్వీసులకు అంతరాయం ఏర్పడనుందని బ్యాంక్ తెలిపింది. మే 23న 00.01 నుంచి 14.00 గంటల వరకు నెఫ్ట్ సర్వీసులు అందుబాటులో ఉండవు. అయితే ఆర్‌టీజీఎస్ సర్వీసులు మాత్రం అందుబాటులోనే ఉంటాయని బ్యాంక్ తెలిపింది.

దీని వల్ల బ్యాంకు కస్టమర్లు ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. నెఫ్ట్ లావాదేవీలు నిర్వహించే వారు బ్యాంకు అలర్ట్‌ను పరిగణలోకి తీసుకొని, ఈ అంతరాయాన్ని గమనించి లావాదేవీలను నిర్వహించుకోవడం ఉత్తమం. కాగా ఇప్పటికే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ఈ విషయాన్ని వెల్లడించింది.





























