500 ఏనుగులతో ఆఫ్ఘనిస్తాన్‌ని గెలిచిన భారత రాజు..! అప్పటి నుంచే రెండు దేశాల మధ్య దౌత్య సంబంధాలు
Chandragupta Maurya: అమెరికా నుంచి బ్రిటన్, రష్యా వరకు అనేక దశాబ్దాలుగా ఆఫ్ఘనిస్తాన్‌ను ఆక్రమించడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి.
Chandragupta Maurya: అమెరికా నుంచి బ్రిటన్, రష్యా వరకు అనేక దశాబ్దాలుగా ఆఫ్ఘనిస్తాన్‌ను ఆక్రమించడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇప్పటివరకు ఎవరూ విజయవంతం కాలేదు. ఇప్పుడు తాలిబాన్లు మళ్లీ ఈ దేశంలో ఆధిపత్యం చెలాయిస్తున్నారు. దీంతో దేశమంతటా భయాందోళనలు నెలకొన్నాయి. అయితే చరిత్రలో రక్తం చిందించకుండా ఆఫ్ఘనిస్తాన్‌ను జయించిన భారత రాజు గురించి ఎవరికి తెలిసి ఉండదు. అతడు కేవలం 500 ఏనుగుల సహాయంతో అప్పటి ఆప్ఘనిస్తాన్ గెలిచి చూపించాడు.
ఆఫ్ఘనిస్తాన్‌ను జయించడంలో ఇప్పటివరకు ఎవరూ విజయవంతం కాలేదని అందరికీ తెలుసు. కానీ భారతదేశ రాజు చంద్రగుప్త మౌర్య ఎటువంటి యుద్ధ వ్యూహాలను ఉపయోగించకుండా ఆఫ్ఘనిస్తాన్‌ను జయించి భారత సరిహద్దులో విలీనం చేశాడు. చరిత్రకారులు ఈ సంఘటనను ఒక భారతీయ రాజు సాధించిన మొదటి ప్రధాన దౌత్య విజయంగా పరిగణిస్తారు. భారతదేశం, ఆఫ్ఘనిస్తాన్ మధ్య సంబంధాలు ఈనాటివి కావు అనేక శతాబ్దాల నాటివి. ఈ రెండు దేశాలు సింధులోయ నాగరికతతో సంబంధం కలిగి ఉన్నాయి. ఉత్తర ఆఫ్ఘనిస్తాన్‌లో ప్రవహించే అముదర్య నదిలో సింధు కాలనీ ఉంటుంది దీనిని వాణిజ్యం కోసం ఉపయోగించేవారు.
జస్టిన్, గ్రీకో-రోమన్ చరిత్రకారుడు ప్లూటార్క్, భారత పాలకుడు చంద్రగుప్త మౌర్య, అలెగ్జాండర్ మధ్య సంబంధం గురించి వివరించారు. అలెగ్జాండర్ జనరల్ సెల్యూకస్ ఒకప్పుడు ప్రస్తుత ఆఫ్ఘనిస్తాన్‌లో కాందహార్‌ను జయించి, పశ్చిమ భారతదేశ శివార్లలోకి చేరుకుంటానని బెదిరించాడు. అటువంటి పరిస్థితిలో దేశ సరిహద్దును రక్షించడానికి చంద్రగుప్త మౌర్య కూడా సరిహద్దుకు చేరుకున్నాడు. ఈ సమయంలో ఇద్దరి మధ్య యుద్ధం జరిగింది. ఈ యుద్ధం ఒక ఒప్పందంతో ముగుస్తుంది. దీని ప్రకారం సెల్యూకస్ ఆఫ్ఘనిస్తాన్‌ను 305 BC లో చంద్రగుప్త మౌర్యకు అప్పగించాడు. ఈ యుద్ధం తరువాత మౌర్య రాజవంశం, ప్రాచీన గ్రీకు సామ్రాజ్యం మధ్య దౌత్య సంబంధాలు ఏర్పడ్డాయి.
చరిత్రకారుల ప్రకారం.. గ్రీకు సామ్రాజ్యం కాందహార్, ఆఫ్ఘనిస్తాన్, చంద్రగుప్త పాలనను అంగీకరించింది. ఈ స్నేహానికి బదులుగా చంద్రగుప్తుడు పావులతో పాటు 500 ఏనుగులు, సేవకులు, కొన్ని వస్తువుల, ధాన్యాన్ని గ్రీస్‌కు అందించాడు. గ్రీస్ రాయబారి మెగాస్తనీస్ మౌర్య ఆస్థానానికి నియమించబడ్డాడు. మెగాస్టనీస్ చంద్రగుప్తుని కాలంలో ‘ఇండికా’ అనే పుస్తకాన్ని రాశారు. అది బాగా ప్రాచుర్యం పొందింది. ఆనాటి సమాచారమంతా ఈ పుస్తకంలోనే ఉంది. చంద్రగుప్త మౌర్య మనవడు అశోకుడు గొప్ప చక్రవర్తి ఇతడు కూడా ఆఫ్ఘనిస్తాన్‌ను పాలించాడు. అశోక చక్రవర్తి కారణంగా ఆఫ్ఘనిస్తాన్‌లో బౌద్ధమతం వ్యాపించింది.