Car Coated With Cow Dung: వాట్‌ ఏ ఐడియా..! దంచికొడుతోన్న ఎండల నుంచి తన కారును ఎలా కాపాడుకుంటున్నాడో చూడండి..

|

Mar 30, 2021 | 5:09 PM

Car Coated With Cow Dung: ఎండలు మండిపోతున్నాయి. మార్చి నెలలోనే ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలు దాటిపోతున్నాయి. దీంతో ఇంటిని వదిలి రోడ్లపైకి రావాలంటే భయపడాల్సిన పరిస్థితి వచ్చింది. ఎండలు తీవ్రంగా మండిపోతుండడంతో కారు..

Car Coated With Cow Dung: వాట్‌ ఏ ఐడియా..! దంచికొడుతోన్న ఎండల నుంచి తన కారును ఎలా కాపాడుకుంటున్నాడో చూడండి..
Car With Coe Dung
Follow us on

Car Coated With Cow Dung: ఎండలు మండిపోతున్నాయి. మార్చి నెలలోనే ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలు దాటిపోతున్నాయి. దీంతో ఇంటిని వదిలి రోడ్లపైకి రావాలంటే భయపడాల్సిన పరిస్థితి వచ్చింది. ఎండలు తీవ్రంగా మండిపోతుండడంతో కారు ఉన్న వారు ఎంచక్కా ఏసీ వేసుకొని వెళుతున్నారు. అయితే కారులో కూర్చున్న వారికి ఏసీ ఉండడం వల్ల ఎలాంటి ఇబ్బంది ఉండట్లేదు. మరి ఎండలో ప్రయాణిస్తున్న కారు పరిస్థితి ఏంటి.?
ఈ విధంగా ఎప్పుడైనా ఆలోచించారా.? సహజంగానే ఎండలు ఈ స్థాయిలో మండిపోతుంటే కారు పెయింటింగ్‌ పాడవుతుంటుంది. అలా.. అనీ కారుకు ఎండ తగలకుండా కూడా ఏం చేయలేం కదూ.! కానీ కర్నాటకకు చెందిన ఓ వ్యక్తి మాత్రం తన బుర్రకు పదునుపెట్టాడు. ఎండలో తన కారు మండి పోకుండా ఓ వినూత్న ఆలోచన చేశాడు. ఆవు పేడ, బంక మట్టిని బాగా కలిపి అద్దాలు మినహా కారుకు పూర్తిగా పూశాడు. తాజాగా ఈ కారు యజమాని తిరుపతి శ్రీవారి దర్శనం కోసం కర్నాటక నుంచి తిరుమల వచ్చాడు. అయితే ఎండలు మండిపోతుండడంతో ఆ ప్లాన్‌ వేసి ఆవుపేడ పూసి కారు తీసుకొచ్చాడు. దీంతో తిరుమల నందరకం కార్ల పార్కింగ్‌ కంప్లెక్స్‌ దగ్గర పార్క్‌ చేసిన ఈ కారును అక్కడున్న వారు విచిత్రంగా చూడడం మొదలుపెట్టారు. తీరా అసలేంటిదని ఆ కారు యజమానిని ప్రశ్నించడంతో పూర్తి వివరాలను చెప్పుకొచ్చాడు. ఇక ఈ కారును అక్కడే ఉన్న కొందరు భక్తులు ఫొటో తీసి సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేశారు. దీంతో ప్రస్తుతం ఈ కారుకు సంబంధించిన ఫొటోలు నెట్టింట్లో వైరల్‌గా మారాయి.

Also Read: KFC India News : కేఎఫ్‌సీ చికెన్ అంటే యమ క్రేజీ..! కొత్తగా మరో 30 ఔట్‌లెట్లు ప్రారంభం.. ఎక్కడెక్కడో తెలుసా..?

వర్క్ చేస్తున్నప్పుడు బ్యాక్ పెయిన్‏తో ఇబ్బంది పడుతున్నారా ? ఈ చిన్న చిన్న ట్రిక్స్ ఫాలో అయితే నొప్పి మాయం..

World Idli Day 2021: ఇడ్లీ నే కదా అని లైట్ తీసుకోకండి.. ఈ ఐదు రకాల ఇడ్లీలు టేస్ట్ చేశారంటే వాహ్ అనాల్సిందే..