
Corona Vaccine: దేశంలో ప్రస్తుతం పరిస్థితులను చూస్తుంటే.. టీకా పట్ల పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుత పరిస్తితుల్లో టీకా వేసుకోవచ్చా ? ఒకవేళ టీకా వేసుకున్నాక కూడా కరోనా వస్తే ఏం చేయాలి.. రెండు డోసు వేసుకోవచ్చా అనే అనుమానాలు చాలామందిలో వ్యక్తమవుతున్నాయి.. అయితే టీకా వేసుకున్న కూడా ఇన్ ఫెక్షన్ వచ్చే అవకాశం ఉందని.. నిజానికి రెండో డోసు తీసుకున్న 15 రోజుల తర్వాత పూర్తి స్థాయి ఇమ్యూనిటీ సమకూరుతుందని నిపుణులు సూచిస్తున్నారు. వీరిలో ఇన్ఫెక్షన్ వచ్చే ఛాన్స్ తక్కువగా ఉంటుందని.. ఒకవేళ ఇన్ఫెక్షన్ వచ్చినా చాలా స్వల్పంగా లక్షణాలు ఉంటాయని సూచిస్తున్నారు. అయితే దీంతో ఎలాంటి ప్రాణహాని ఉండదు. ఆసుపత్రిలో అడ్మిట్ కావాల్సిన అవసరం కూడా ఉండదు. 9 నుంచి 12 నెలల పాటు రక్షణ ఉంటుంది. ఆ తర్వాత మళ్ళీ టీకా వేయించుకోవాల్సిందే. టీకా వేసుకున్న తర్వాత సైడ్ ఎఫెక్ట్స్ (జ్వరం, తలనొప్పి, నీరసం, కండరాల నొప్పులు) వస్తాయి. అవి సర్వసాధారణమే అని నిపుణులు సూచిస్తున్నారు.
ఇలాంటి లక్షణాలు కనిపించడం మంచి లక్షణమే. ఇమ్యూనిటీ సిస్టం పనిచేస్తున్నట్లు లెక్క. భయపడాల్సిన అవసరం లేదు. ఈ లక్షణాలు ఒకట్రెండు రోజుల్లోనే తగ్గిపోతాయి. ఎవరైనా మొదటి డోస్ వ్యాక్సిన్ తీసుకున్నాక రెండో డోసు వ్యాక్సిన్ తీసుకునేలోగా పాజిటివ్ వస్తే.. అది తగ్గేంతవరకు ఆగాలి అప్పటికే వారు తీసుకున్న మొదటి డోస్ వ్యాక్సిన్ వృథా కాదు. కాబట్టి నేరుగా రెండో డోస్ తీసుకోవచ్చు. పైగా కరోనా వచ్చిపోయినవారిలో యాంటీబాడీలు ఉంటాయి. అందువల్ల డోసుల మధ్య విరామం ఎక్కువగా వచ్చిందన్న భావనతో మళ్లీ మొదటి డోస్ వేసుకోవాల్సిన అవసరం లేదు. టీకా వేసుకున్నాక ఎండలో తిరగొద్దనే నియమాలేమీ లేవు. మద్యపానం అలవాటున్న వారు వారం పది రోజుల పాటు దానికి దూరంగా ఉండటం ఉత్తమం. అలాగే వ్యాక్సిన్ వేసుకున్నాక పాటించాల్సిన ఆహార నియమాలు అంటూ ఏమి లేవని నిపుణులు తెలిపారు.
Corona Vaccine: కరోనా వ్యాక్సిన్ వేసుకున్నాక రెగ్యులర్ మందులు వాడొచ్చా. ? డాక్టర్ల సూచనలు ఎంటంటే..