AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Cattle: థ్యాంక్యూ సార్స్.. ఆవు దూడ విధి రాతను మార్చిన పశువైద్యులు..

పుట్టుకతో కాలు లోపంతో నడవడానికి ఇబ్బంది పడిన దూడకు పశువైద్యులు విజయవంతంగా చికిత్స అందించారు. కాలిలోని బిగుతుగా ఉన్న టెండాన్లను శస్త్రచికిత్స ద్వారా సరిచేయడంతో దూడ ఇప్పుడు మామూలుగా నడుస్తోంది. ఈ చికిత్స ద్వారా దూడ తన తోటి జంతువులతో కలిసి హుషారుగా జీవించగలుగుతోంది.

Cattle: థ్యాంక్యూ సార్స్.. ఆవు దూడ విధి రాతను మార్చిన పశువైద్యులు..
Calf Recovery Story
Ram Naramaneni
|

Updated on: Feb 15, 2026 | 2:52 PM

Share

పుట్టుకతోనే ముందు కాలులో లోపంతో ఉన్న ఒక దూడ, బిగుతుగా ఉన్న టెండాన్స్ (flexor tendons) కారణంగా నడవడానికి తీవ్ర ఇబ్బందులు పడింది. ముందు కాలు మడతపడటం వల్ల అది సాధారణంగా కదలలేకపోయింది. ఈ పరిస్థితిని అలాగే వదిలేస్తే, దూడ జీవితకాలం నడవలేకపోయేది. పశువైద్యులు ఈ దూడ పరిస్థితిని పరిశీలించి, బిగుసుకుపోయిన టెండాన్లను సరిచేయడానికి శస్త్రచికిత్స (tenotomy) అవసరమని గుర్తించారు. వైద్యులు ఎంతో ఓపికతో దూడ ముందు కాలులోని ప్రభావిత నరాన్ని గుర్తించి, దాన్ని జాగ్రత్తగా కట్ చేశారు. శస్త్రచికిత్స తర్వాత, కాలికి బ్యాండేజ్ వేశారు. ఈ చికిత్స పశువైద్యులు ఎంత నిపుణతతో పనిచేశారో తెలియజేస్తుంది. చికిత్సానంతరం రెండు నెలల తర్వాత, ఆ దూడ అద్భుతంగా కోలుకుంది. ఇప్పుడు అది తన తోటి దూడలతో కలిసి బయటికి వెళ్లి మేత మేయగలదు. పశువుల మందలో కూడా ఈ దూడ చాలా ఉత్సాహంగా, చురుకుగా తిరుగుతూ కనిపిస్తుంది. పశువైద్యుల ఈ చికిత్స దూడకు తిరిగి నార్మల్ జీవితాన్ని అందించింది.

వీడియోను దిగునవ చూడండి…

Also Read: గడ్డి వాము వద్ద అదే పనిగా అరుస్తున్న గిన్ని కోళ్లు.. ఏంటా అని వెళ్లి చూడగా..