ప్రేమికుడి కోసం.. నదిని ఈదుతూ బంగ్లాదేశ్ నుంచి భారత్‌కు.. కట్ చేస్తే.. యువతికి షాకిచ్చిన పోలీసులు.. ఏమైందంటే?
Viral News: పశ్చిమ బెంగాల్ పోలీసులు మంగళవారం 22 ఏళ్ల యువతిని అరెస్టు చేశారు. యువతికి పాస్‌పోర్టు లేకుండా ప్రేమికుడిని కలిసేందుకు అక్రమంగా భారత్‌లోకి ప్రవేశించడంతో..

Bangladesh woman: సోషల్ మీడియాల్లో(Social Media) పరిచయాలతో దేశ, విదేశాల్లోని వ్యక్తుల మధ్య చిగురించిన స్నేహం.. ప్రేమ(Love)గా మారడాన్ని మనం వినే ఉంటాం. అయితే, తాజాగా ఇలాంటిదే ఓ సంఘటన నెట్టింట్లో తెగ వైరల్(Viral Video) అవుతోంది. ఫేస్‌బుక్‌లో పరిచయం కాస్తా.. ప్రేమగా మారడంతో ఓ లవర్ కోసం ఓ అమ్మాయి చేసిన సాహసమే షాకిచ్చేలా చేస్తోంది. మొసళ్లతో నిండిన నదిని దాటి, పులులు తిరిగే అడవి దాటి ప్రేమికుడి వద్దకు చేరుకునేందు భారీ ప్లాన్ వేసి, పెద్ద సాహసం చేసింది. భారతదేశంలోని వెస్ట్ బెంగాల్ లో ఉన్న తన లవర్‌ను కలుసుకునేందుకు ఎన్నో గంటలపాటు కష్టపడింది. ఎన్నో ప్రమాదాలకు సవాలు చేస్తూ ఏకంగా ఓ సముద్రం దాటేందుకు, అదికూడా తన లవర్‌ను కలుసుకునేందుకు, తన ప్రాణాలను పణ్ణంగా పెట్టింది. అంత సాహసం చేసి వచ్చినా.. చివరకు పోలీసులకు చిక్కడంతో, ఆమె కోరిక నెరవెరకుండా చేసింది. కోల్‌కతాలో మంగళవారం పట్టుబడిన బంగ్లాదేశ్ అమ్మాయి.. ఎన్నో వ్యయప్రయాసలు చేసి భారతదేశంలోకి ప్రవేశించింది.
కోల్‌కతాలో పెళ్లి..
సమాచారం ప్రకారం, బంగ్లాదేశ్ అమ్మాయి తన జీవితాన్ని పణంగా పెట్టి తన ప్రేమికుడిని కలవడమే కాకుండా, కోల్‌కతాలోని కాళీఘాట్ ఆలయంలో మూడు రోజుల క్రితం వివాహం చేసుకుంది. దీంతో ఈ పెళ్లి సోషల్ మీడియాలో పలు చర్చలకు దారి తీసింది. ఆనోటా, ఈనోటో అసలు విషయం తెలిసి, పోలీసులకు చేరడంతో, బయటకు ఈ విషయం తెలిసింది.




అరెస్టు చేసిన పోలీసులు..
భారతదేశంలోకి అక్రమంగా ప్రవేశించిన విషయం నరేంద్రపూర్ పోలీస్ స్టేషన్‌లోని పోలీసులకు తెలియడంతో, ఆమెను మంగళవారం అరెస్టు చేశారు. సమాచారం ప్రకారం ఆమె పేరు కృష్ణ మండలం. ఆమె బంగ్లాదేశ్‌లోని సత్‌ఖిరా నివాసి. మూలాల ప్రకారం, కృష్ణను బంగ్లాదేశ్ హైకమిషన్‌కు అప్పగించే ఛాన్స్ ఉందని తెలుస్తుంది.
ఫేస్‌బుక్‌లో ప్రేమలో పడ్డారు..
పోలీసు వర్గాల సమాచారం ప్రకారం, ఆమె బెంగాల్ నివాసి అభిక్ మండల్‌తో ఆరు నెలల క్రితం ఫేస్‌బుక్‌లో పరిచయం ఏర్పడింది. ఈ పరిచయం కాస్తా ప్రేమగా మారింది. అయితే, పెళ్లి చేసుకుందామని నిర్ణయించుకున్నారు. అయితే, కృష్ణ మండల్‌కి పాస్‌పోర్టు లేదు. ఇటువంటి పరిస్థితిలో, ఆమె అక్రమంగా భారతదేశంలోకి ప్రవేశించడానికి ప్రమాదకరమైన మార్గాన్ని ఎంచుకుంది. రాయల్ బెంగాల్ టైగర్స్‌కు నిలయమైన బంగ్లాదేశ్‌లోకి సుందర్‌బన్స్ నుంచి ప్రయాణం చేసి, ఆ తర్వాత గంటపాటు నదిని దాటేందుకు ఈతకొడుతూ బెంగాల్ చేరుకుంది. బెంగాల్ జిల్లాలోని కైఖలిలోకి ఆమె ఎంటరైంది. ఆ తర్వాత ఆమె లవర్ ఆ ప్రాంతానికి చేరుకుని, కారులో ఆమెను తీసుకెళ్లాడు. అనుకున్న ప్రకారమే ఇద్దరూ కలిసి, కాళీఘాట్ ఆలయానికి వెళ్లి వివాహం చేసుకున్నారు. ఈ విషయం ఆనోటా, ఈనోటా తెలియడంతో పోలీసులకు ఈ వార్త చేరింది. దీంతో అక్రమంగా భారత్‌కు చేరుకున్న కేసులో కృష్ణ మండలిని పోలీసులు అరెస్ట్ చేశారు. గతవారం ఓ టీనేజీ బాలుడు తనకు ఇష్టమైన చాక్లెట్ కొనేందుకు అక్రమంగా భారత్‌లోకి ప్రవేశించడం గమనార్హం.
