AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Shocking: ఒక్క అమ్మాయిని కూడా టచ్ చేయలేదు.. 60 మంది పిల్లలకు తండ్రయ్యాడు.. అందరిదీ ఒకే రూపం..

స్త్రీ, పురుషులు ఫిజికల్‌గా కలవకుండా పిల్లలు పుడతారా? అంటే ఎందుకు పుట్టరు.. ఖచ్చితంగా పుడతారు. అసలే టెక్ యుగం.. భూమిపై మరో జీవి జన్మించడానికి స్త్రీ, పురుషులు శృంగారమే చేయాల్సిన..

Shocking: ఒక్క అమ్మాయిని కూడా టచ్ చేయలేదు.. 60 మంది పిల్లలకు తండ్రయ్యాడు.. అందరిదీ ఒకే రూపం..
Sperm Donor
Shiva Prajapati
|

Updated on: Feb 21, 2023 | 1:34 PM

Share

స్త్రీ, పురుషులు ఫిజికల్‌గా కలవకుండా పిల్లలు పుడతారా? అంటే ఎందుకు పుట్టరు.. ఖచ్చితంగా పుడతారు. అసలే టెక్ యుగం.. భూమిపై మరో జీవి జన్మించడానికి స్త్రీ, పురుషులు శృంగారమే చేయాల్సిన అవసరం లేదు. ప్రస్తుత టెక్నాలజీని ఉపయోగించి పిల్లలకు జన్మనియొచ్చు. అవును, ఇదే విధంగా ఓ యువకుడు ఏకంగా 60 మంది పిల్లలకు తండ్రి అయ్యాడు. అదీ ఒక్క మహిళలను కూడా టచ్ చేయకుండా. అవునండీ బాబూ.. అదెలాగని సందేహిస్తున్నారా? అయితే వివరాల్లోకి వెళ్లాల్సిందే..

ప్రస్తుతం స్పెర్మ్ దానం చేసే ట్రెండ్ నడుస్తోంది. ప్రపంచ వ్యాప్తంగా స్పెర్మ్ బ్యాంకులు ఏర్పడటం, స్పెర్మ్ దానం చేసేవారు సంఖ్య పెరగడం జరుగుతోంది. చాలా మంది ఈ పని చేస్తున్నారు. అయితే, స్పెర్మ్ డోనర్స్ గురించి ఎక్కడో చోటు వినే ఉంటారు. కానీ, ఆస్ట్రేలియాకు చెందిన ఈ స్పెర్మ్ డోనర్ కథ చాలా విచిత్రమైంది. అందుకే అతను వార్తల్లో ప్రముఖంగా నిలిచాడు. సోషల్ మీడియాలోనూ దుమ్మురేపుతున్నాడు. ఇంతకీ అతనేంటి? అతని కథేంటి? అంటే..

ఆస్ట్రేలియాకు చెందిన ఈ వ్యక్తి తన స్పెర్మ్ దానం చేసి 60 మంది పిల్లల జననానికి కారణం అయ్యాడు. స్పెర్మ్ దానం చేయడం కామన్.. కానీ, పుట్టిన 60 మంది పిల్లలు కూడా అచ్చం అతని మాదిరిగానే ఉన్నారట. అయితే, ఓ ఫంక్షన్‌కు కొందరు దంపతులు తమ పిల్లలతో సహా హాజరవగా.. వారి ముఖాలు సేమ్‌గా ఉండటంతో ఆశ్చర్యానికి గురయ్యారంతా. దాంతో మ్యాటర్ ఏంటా? అని ఆరా తీస్తే.. స్పెర్మ్ దాత కథ బయటకొచ్చింది.

ఈ వ్యక్తి LGBTQ+ కమ్యూనిటీలోని చాలా మంది సభ్యులకు తన స్పెర్మ్ దానం చేశాడట. వాస్తవానికి ఒక దాత స్పెర్మ్ ఒకేసారి ఉపయోగించాలనే నియమం ఉంది. కానీ, అతను మాత్రం వేర్వేరు పేర్లతో చాలా మందికి స్పెర్మ్ దానం చేసినట్లు తేలింది. ఈ విషయం ఎవరూ కనిపెట్టలేకపోయారు. అయితే, అతని స్పెర్మ్ కారణంగా పుట్టిన పిల్లలందరూ ఒకే రూపంలో ఉండటంతో ఇప్పుడు మ్యాటర్ రివీల్ అయ్యింది.

ఇలా తెలిసిపోయింది..

పిల్లల కోసం ఏర్పాటు చేసిన పార్టీకి వివిధ ప్రాంతాల నుంచి పిల్లలు హాజరయ్యారు. అయితే, వీరిలో 60 మంది పిల్లలు ముఖాలు ఒకేలా ఉన్నాయి. వారందరి ముఖాలు చూసి వారి వారి తల్లిదండ్రులు షాక్ అయ్యారు. అందరి ముఖాలు ఒకేలా ఉండటంతో ఆశ్చర్యపోయారు. వీరంతా వెంటనే ఆస్పత్రులకు పరుగులుపెట్టారు. పరీక్షలు చేయగా.. వారందరికీ ఒకే ఒక్కడు తండ్రి అని, అది స్పెర్మ్ దానం చేసిన వ్యక్తి అని వైద్యులు నిర్ధారించారు.

మరిన్ని హ్యూమన్‌ఇంట్రస్ట్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..