Army Marriage Viral: ఆమె పెద్ద ఆఫీసర్.. ఆయన ఆర్మీ మేజర్.. కేవలం రూ.500కే పెళ్లి చేసుకుని.. ఔరా అనిపించిన జంట
ఆమె పెద్ద ఆఫీసర్. ఆయన ఆర్మీ మేజర్. కాని సింప్లిసిటీ ఇష్టం. కేవలం ఐదువందల రూపాయలతో తమ పెళ్లి తంతు ముగించి ఆదర్శంగా నిలిచింది శివంగి-అంకిత్ జంట
Army Major got Married for rs 500: పెళ్లంటే నూరేళ్ల పంట. వివాహం అంటే మనకు వెంటనే గుర్తుకొచ్చిది ఖర్చులు. ఇవాళ, రేపు పెళ్లి వేడుకలు ఆడంబరాలకు వేదికగా మారాయి. సాధారణ ప్రజలు సైతం అప్పు చేసైనా పెళ్లి చేస్తుంటారు. కాని మధ్యప్రదేశ్‌లో ఉన్నతాధికారలు కేవలం ఐదువందల రూపాయలతో తమ పెళ్లి వేడుకలను ముగించి అందరికి ఆదర్శంగా నిలిచారు. వాళ్లిద్దరికి డబ్బు , హోదా లేదనుకుంటే పెద్ద పొరపాటే అవుతుంది. వధువు,వరుడు ఉన్నత హోదాలో ఉన్నారు. కాని భాజా బారాత్ లేకుండానే తమ పెళ్లి కార్యక్రమాన్ని ముగించారు.
వివరాల్లోకి వెళ్తే.. వధువు పేరు శివంగి జోషి మధ్యప్రదేశ్ లోని ధార్ సిటీ మేజిస్ట్రేట్. అంటే గ్రూప్ వన్ ఆఫీసర్. ఇక వరుడు అంకిత్ చతుర్వేది భారత సైన్యంలో మేజర్ జనరల్. ప్రస్తుతం లద్దాఖ్‌లో విధులు నిర్వహిస్తున్నారు. భోపాల్‌లో శివంగి జోషి , అంకిత్ చతుర్వేదిల పెళ్లి చాలా నిరాడంబరంగా జరిగింది. తమ పెళ్లి కోసం ఈ జంట కేవలం ఐదువందల రూపాయలు మాత్రమే ఖర్చు చేసింది. వాస్తవానికి వీళ్లిద్దరి పెళ్లి రెండేళ్ల క్రితమే జరగాల్సి ఉంది. కానీ, శివాని కోవిడ్ వారియర్ కావడంతో వివాహం వాయిదా వేసింది.
అయితే, తమ కుటుంబసభ్యులతో చర్చించిన తరువాత ఇద్దరు కూడా కోర్టులో మ్యారేజ్ చేసుకోవాలని నిర్ణయించారు. ఇద్దరూ ఏ హంగులు లేకుండా పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. ఇందుకు పెద్దలను సైతం ఒప్పించారు ఐదువందల రూపాయలు కోర్టులో డిపాజిట్ చేసి ఆ జంట ఒక్కటయ్యింది. సన్నిహితులకు స్వీట్లు మాత్రమే పంచారు. కుటుంబసభ్యులు, జిల్లా కలెక్టర్ అలోక్ కుమార్ సింగ్, ఏడీఎం సలోని సిదానా తదితర సిబ్బంది మాత్రమే అతిథులుగా హాజరయ్యారు.
పెళ్లి కోసం లక్షల రూపాయల ఖర్చే చేయకండి.. ఈ సందేశాన్ని పంచడానికే కోర్టులో పెళ్లి చేసుకున్నట్టు శివాని-అంకిత్ జంట తెలిపింది. కష్టపడి సంపాదించిన డబ్బును వృధాగా ఖర్చు చేయడం మంచిదికాదన్న సందేశాన్ని కూడా ఇచ్చారు. పెళ్లి తరువాత ఈ జంట ధరేశ్వర్ ఆలయాన్ని సందర్శించింది. భగవాన్ థార్‌నాథ్ ఆశీస్సులు తీసుకున్నారు. కేవలం 500 రూపాయల తమ పెళ్లి కోసం ఖర్చు చేసి ఈ జంట యువతకు ఆదర్శంగా నిలిచింది.
MP: Dhar City Magistrate Shivangi Joshi tied the knot with Army Major Aniket Chaturvedi in an intimate ceremony in a court on Monday
“Only family members were present. Both belonged to affluent families but chose a simple wedding to set an example,” DM AK Singh said yesterday pic.twitter.com/GEt5RpKFOb
— ANI (@ANI) July 14, 2021
Read Also… 80 ఏళ్ల అవ్వ గుడిసెలోకి వచ్చిన వ్యక్తి.. భోజనం చేసి.. చేతిలో కవర్ పెట్టాడు.. ఆశ్చర్యపోయిన బామ్మ.!