Corona Mask: N-95 మాస్క్‌ను ఉతకవచ్చా..? ఎన్ని రోజులకోసారి మాస్క్‌ మార్చాలి.. నిపుణులు ఏమంటున్నారంటే..!

|

May 14, 2021 | 6:22 AM

Corona Mask: కరోనా మహమ్మారి సెకండ్‌వేవ్‌ కొనసాగుతోంది. రోజురోజుకు తీవ్ర స్థాయిలో వ్యాపిస్తుండటంతో భయాందోళన నెలకొంటోంది. ఈ కరోనా టైమ్‌లో మాస్క్‌ తప్పనిసరి. డబుల్‌..

Corona Mask: N-95 మాస్క్‌ను ఉతకవచ్చా..? ఎన్ని రోజులకోసారి మాస్క్‌ మార్చాలి.. నిపుణులు ఏమంటున్నారంటే..!
N 95 Mask
Follow us on

Corona Mask: కరోనా మహమ్మారి సెకండ్‌వేవ్‌ కొనసాగుతోంది. రోజురోజుకు తీవ్ర స్థాయిలో వ్యాపిస్తుండటంతో భయాందోళన నెలకొంటోంది. ఈ కరోనా టైమ్‌లో మాస్క్‌ తప్పనిసరి. డబుల్‌ మాస్క్‌ బెస్టా.. లేక N95 మాస్క్‌ బెస్టా అనేది చాలా మందిలో వస్తున్న అనుమానం. అయితే N95 మాస్క్‌ వాడటం కూడా బాగానే ఉంది. దానిని ఎలా శుభ్రం చేయాలి..? సర్టికల్‌ మాస్క్‌ అయితే ధర తక్కువ కాబట్టి ఒక రోజు వాడి పారేస్తాం. బట్ట మాస్క్‌ అయితే ఒక్క రోజు వాడగానే శుభ్రంగా ఉతికి ఆరేస్తాం. ఇలా N95 మాస్క్‌ను ఉతక్కుండా ఎన్ని రోజులు వాడవచ్చు..? ఇలాంటి విషయాల్లో నిపుణులు ఏమంటున్నారంటే..

N95 మాస్క్‌ ఉతకవచ్చా..?

ఎన్‌95 మాస్కులు కరోనా వైరస్‌ను 95 శాతం వరకు సమర్థంగా అడ్డుకుంటాయి. కాకపోతే సర్టికల్‌, బట్ట మాస్కులతో పోలిస్తే వీటి ధర కొంచెం ఎక్కువగా ఉంటుంది. అలా వీటిని ఉతికి వాడుకోవడం చేయవద్దు. వీటిని ఉతకడం వల్ల వడపోత సామర్థ్యం దెబ్బతింటుందని నిపుణులు చెబుతున్నారు. అప్పుడు ఈ మాస్కులను ఉపయోగించిన ప్రయోజనం ఉండదు. N95 మాస్కులను కొన్ని ప్రత్యేక పద్దతుల్లో మాత్రమే శుభ్రం చేస్తారు.

N95 మాస్కులు ఎవరు వాడాలి..?

ఈ ఎన్‌-95 మాస్కులు డాక్టర్లు, నర్సులు, వైద్య సిబ్బంది, అలాగే కరోనా బారిన పడిన వారు, వారిని చూసుకునేవారు కూడా ఈ ఎన్‌95 మాస్కులను తప్పకుండా వాడాలి. కరోనా వైరస్‌ వ్యాప్తి ఎక్కువగా ఉండే ప్రాంతాలకు వెళ్లినప్పుడు కూడా వీటిని వాడటం మంచిది. మిగిలిన వారు మూడు పొర‌ల‌తో కూడిన స‌ర్జిక‌ల్ మాస్కులు ధ‌రిస్తే సరిపోతుంది.

ఒక్క N95 మాస్క్‌ ఎన్నిసార్లు వాడవచ్చు..?

సాధారణంగా ఎన్‌ 95 మాస్క్‌లను ప్రతి 8 గంటలకు ఒకసారి మార్చాల్సి ఉంటుంది. ఒక వేళ మాస్కు ఎక్కువ సార్లు వాడాలని అనుకుంటే మొదటి రోజు ఒక మాస్క్‌ వాడి తర్వాత దానిని ఒక కవర్‌లో భద్రపర్చుకోవాలి. అలాగే రెండో రోజు ఇంకో మాస్క్‌ వాడి దానిని వేరే కవర్‌లో భద్రపర్చాలి. ఇలా నాలుగు మాస్కులను నాలుగు రోజులు వాడాలి. ఆ తర్వాత ఐదో రోజు మొదటి రోజు వాడిన మాస్క్‌ను ఉపయోగించుకోవాలి. ఇలా చేయడం వల్ల మాస్క్‌ మీద వైరస్‌తో కూడిన తుంపర్లు ఉంటే ఆ నాలుగు రోజుల్లో ఎండిపోతాయి. ఇలా ఒక్కో మాస్క్‌ నాలుగు నుంచి ఐదు సార్లు వాడుకోవచ్చు అంటున్నారు వైద్య నిపుణులు.

ఇక రెస్పిరేటరీ వాల్వ్‌ ఎన్‌ 95 మాస్కులను మాత్రమే వాడాలి. రెస్పిరేటరీ వాల్వ్‌లు వాతావరణంలో ఉండే గాలిని శుద్ధి చేసి మనకు అందిస్తాయి. అదే మనం వదిలిన గాలిని మాత్రం నేరుగా బయటకు పంపించేస్తుంది. ఒక వేళ కరోనా సోకిన వారు రెస్పిరేటరీ వాల్వ్‌ ఉన్న ఎన్‌-95 మాస్కులు ధరిస్తే వారు వదిలిన గాలి నేరుగా బయటకు వచ్చేస్తుంది. దీంతో ఇతరులకు వైరస్‌ వ్యాపించే అవకాశం ఉంది.

ఇవీ కూడా చదవండి: Corona Updates: ఆ రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో 42,582 కరోనా పాజిటివ్‌ కేసులు, 850 మంది మృతి

Elephants Dead: విషాదం.. 18 ఏనుగులు మృతి.. ఘటన స్థలానికి అటవీ శాఖ అధికారులు. ఏనుగుల మరణాలపై దర్యాప్తు

Amla Health Benefits: ఉసిరికాయతో ఎన్నో ప్రయోజనాలు.. ఉదయాన్నే ఉసిరి తింటే ఆ సమస్యలు పరార్‌..!