Ac or Coolers Purchasing Tips: ఏసీ లేదా కూలర్స్‌ కొంటున్నారా.. ఇవి ఖచ్చితంగా గమనించాల్సిందే..!

Ac or Coolers Purchasing Tips: ఈసారి వేసవి దబిడే దిబిడే అంటోంది. జనాలను కుక్కర్‌లో వేసి ఉడకబెట్టినట్లుగా వాతావరణం ఉంది.

Ac or Coolers Purchasing Tips: ఏసీ లేదా కూలర్స్‌ కొంటున్నారా.. ఇవి ఖచ్చితంగా గమనించాల్సిందే..!
Cooler
Follow us

|

Updated on: May 08, 2022 | 6:12 AM

Ac or Coolers Purchasing Tips: ఈసారి వేసవి దబిడే దిబిడే అంటోంది. జనాలను కుక్కర్‌లో వేసి ఉడకబెట్టినట్లుగా వాతావరణం ఉంది. తీవ్రమైన వేడి, ఉక్కపోతతో ప్రజలు అల్లాడిపోతున్నారు. ఈ ఎండవేడిమిని తాళలేక అవస్థలు పడుతున్నారు. ఈ నేపథ్యంలో అందరూ ఏసీ, కూలర్ లను కొనుగోలు చేసేందుకు తెగ ఆసక్తి చూపుతున్నారు. ఈ సమ్మర్‌లో ఇప్పటికే చాలా వరకు ఏసీలు, కూలర్లు అమ్ముడు పోయినట్లు అనేక నివేదికలు చెబుతున్నాయి. అయితే, ఏసీలు, కూలర్లను కొనుగోలు చేసేవారు కొన్ని విషయాలను ఖచ్చితంగా గమనించాలని నిపుణులు సూచిస్తున్నారు. మరి ఆ సూచనలేంటో ఓసారి లుక్కేద్దాం..

ముందు కొనుగోలు చేయాలనుకుంటున్న ఏసీ-కూలర్‌ కంపెనీని(మంచి కంపెనీ) ఎంచుకోవాలి. ఆ తరువాత ఆ కంపెనీ అధికారిక వెబ్‌సైట్‌లోకి వెళ్లి ప్రాక్ట్‌ మోడల్‌, ప్రత్యేకతల గురించి తెలుసుకోండి. ఆన్‌లైన్‌ ఈ కామర్స్‌ వెబ్‌సైట్లలో, బయట మార్కెట్లో వస్తువుల ధరల్లో తేడాలుంటాయి. అన్ని చోట్ల ధరలను పోల్చి చూడాలి. మీకు నచ్చిన కంపెనీ ఏసీ లేదా కూలర్‌ ఎక్కడ తక్కువ ధరకు లభిస్తే అక్కడ కొనుక్కోవచ్చు. మరీ ముఖ్యంగా ఏసీల్లో అయినా.. కూలర్లలో అయినా ఆధునిక టెక్నాలజీతో ఏటా సరికొత్త ఫీచర్లు అందుబాటులోకి వస్తున్నాయి. కాబట్టి అప్‌డేటెడ్‌ ఫీచర్లు ఏమున్నాయో తెలుసుకొని కొనడం మంచిది.

ఇవి కూడా చదవండి

వస్తువు కొనే ముందు దాని వారెంటీని తప్పకుండా చూసుకోవాలి. ఏసీబాడీ, కండెన్సర్‌, కంప్రెషర్‌ వారెంటీతో వస్తాయి. వాటి వివరాలు అడిగి వారెంటీ యాక్టివేట్‌ చేసుకోవాలి. అలాగే కూలర్లలోనూ ఒకటి నుంచి మూడేళ్లు వారెంటీ ఇస్తుంటాయి ఆయా కంపెనీలు. అలాంటి ఫ్యూచర్లు మీరు ఎంచుకున్న కూలర్‌లో కానీ ఏసీ కంపెనీలు మీకు ఏం ప్రొవైడ్‌ చేస్తున్నాయో తెలుసుకున్న తర్వాతే కొనడం ఉత్తమం. దీనితో పాటు ఏసీ డెలవరీ ఇన్‌స్టాలేషన్‌ ఛార్జీల గురించి ముందుగానే ఆరా తీయాలి. కొన్ని సంస్థలు ఈ సేవల్ని ఉచితంగా అందిస్తే.. మరికొన్ని కంపెనీలు వెయ్యి నుంచి 2వేల వరకు వసూలు చేస్తాయి. కాబట్టి ఛార్జీల విషయంలో జాగ్రత్తగా వ్యవహరించాలి.