
ఇంటి నిర్మాణం విషయంలో వాస్తును ఎలా పాటిస్తామో, ఇంట్లో ఏర్పాటు చేసుకునే వస్తువుల విషయంలోనూ అంతే పాటించాలని వాస్తు పండితులు చెబుతుంటారు. అందుకే ఇంట్లోని ప్రతీ వస్తువును వాస్తుకు అనుగుణంగానే, వాస్తు పండితులు చెప్పిన విధంగానే ఏర్పాటు చేసుకుంటాం. అయితే కొన్ని సందర్భాల్లో తెలిసో, తెలియకో చేసే తప్పులు వాస్తుకు విరుద్ధంగా ఉంటాయి.
ఇంట్లో గదుల నిర్మాణం విషయంలో ఎలాగైతే వాస్తును పాటిస్తామో.. ఇంట్లో ఏర్పాట చేసుకునే వస్తవుల విషయంలో అలాగే పాటించాలని వాస్తు పండితులు చెబుతున్నారు. అలాంటి వాటిలో వాటర్ ట్యాంక్ ఒకటి. ఇటీవలి కాలంలో ప్రతీ ఇంటికి బోర్ సర్వసాధారణంగా మారిపోయింది. దీంతో ఇంటిపై ఓవర్ హెడ్ వాటర్ ట్యాంక్‌ల ఏర్పాటు కూడా అనివార్యంగా మారింది. అయితే వాటర్ ట్యాంక్‌ల ఏర్పాటు విషయంలో ఎట్టి పరిస్థితుల్లో తప్పులు చేయకూడదని వాస్తు పండితులు చెబుతున్నారు. ఇంతకీ ఆ తప్పులు ఏంటి.? వాటి వల్ల ఎలాంటి నష్టాలు జరుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం..
* వాటర్ ట్యాంక్‌ను వీలైనంత వరకు ఇంటిపై నైరుతి దిశలోనే ఏర్పాటు చేసుకోవాలని వాస్తు పండితులు చెబుతున్నారు. ఒకవేళ ఈ దిశలో కుదరని నేపథ్యంలో దక్షిణ దిశలో ఏర్పాటు చేసుకుంటే మంచిది.
* ఇక ఓవర్ హెడ్ ట్యాంక్‌ను ఎట్టి పరిస్థితుల్లో ఇంటికి ఈశాన్య దిశలో ఉంచకూడదని గుర్తుంచుకోవాలి. ఈ దిశలో వాటర్ ట్యాంక్‌ను ఏర్పాటు చేసుకుంటే ఇంట్లో అనవసర ఖర్చులు భారీగా పెరిగిపోతాయి. అంతేకాకుండా నష్టాలు సైతం పెరిగిపోతాయి.
* బిల్డింగ్‌పై వాటర్ ట్యాంక్ మధ్యలో ఉండకుండా జాగ్రత్త పడాలని వాస్తు పండితులు చెబుతున్నారు. ఇలా ఉంచడం వల్ల ఇంటి యజమాని ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం పడుతుందని సూచిస్తున్నారు.
* ఇక ఓవర్ హెడ్ వాటర్ ట్యాంక్ ఎట్టి పరిస్థితుల్లో వంటగదిపై ఉండకుండా చూసుకోవాలి. సాధారణంగా వంటగది ఆగ్నేయ దిశలో ఉంటుంది కాబట్టి, ఈ దిశలో వాటర్ ట్యాంక్ ఉండకపోవడమే బెటర్.
* అండర్ గ్రౌండ్ వాటర్ ట్యాంక్ విషయానికొస్తే.. కొందరు బోర్ వాటర్‌ను స్టోర్ చేసుకోవడానికి సంపులు నిర్మించుకుంటారు. అయితే ఓవర్ హెడ్ వాటర్ ట్యాంక్‌ను ఈశాన్యంలో నిర్మించుకోవద్దని చెబుతున్న వాస్తు శాస్త్రం, అండర్ గ్రౌండ్ వాటర్ ట్యాంక్‌ను మాత్రం ఈశాన్య దిశలోనే ఏర్పాటు చేసుకోవాలని చెబుతోంది. ఈశాన్యంలో నీటి నిల్వ ఉంటే కుటుంబంలోని సభ్యులకు మంచి జరుగుతుందని వాస్తు శాస్త్రం చెబతోంది.
మరిన్ని ఇంట్రెస్టింగ్ వార్తల కోసం క్లిక్ చేయండి..