Cloth washing: మీరు కూడా రాత్రి దుస్తులు ఉతుకుతున్నారా.? ఏమవుతుందో తెలుసా..

ఇక ఇంటి నిర్మాణంలో వాస్తు ఎంత కీలక పాత్ర పోషిస్తుందో. ఇంట్లో మనం చేసే పనుల విషయాల్లో కూడా శాస్త్రాన్ని ఫాలో కావాలని నిపుణులు చెబుతున్నారు. వీటిలో ఒకటి రాత్రుళ్లు దుస్తులు ఉతకడం. సాధారణంగా దుస్తులను ఉదయాన్నే వాష్‌ చేస్తుంటారు. అయితే ప్రస్తుతం మారిన జీవన విధానాలు, ఆఫీస్‌ కల్చర్‌ కారణంగా మనలో చాలా మంది సమయంతో...

Cloth washing: మీరు కూడా రాత్రి దుస్తులు ఉతుకుతున్నారా.? ఏమవుతుందో తెలుసా..
Cloth Washing
Follow us

|

Updated on: Jun 09, 2024 | 10:33 PM

మనలో చాలా మంది వాస్తు, జ్యోతిష్యాన్ని విశ్వసిస్తుంటాం. మరీ ముఖ్యంగా భారతీయుల్లో ఈ నమ్మకాలు ఎక్కువగా ఉంటాయి. అయితే కొందరు ఇవన్నీ ఏంటని కొట్టి పడేస్తుంటారు. కానీ మరికొందరు మాత్రం తూచా తప్పకుండా పాటిస్తుంటారు. వాస్తు, జ్యోతిష్యం వ్యక్తిగత నమ్మకాలకే పరిమితమైనప్పటికీ చాలా మంది వీటిని విశ్వసిస్తుంటారు.

ఇక ఇంటి నిర్మాణంలో వాస్తు ఎంత కీలక పాత్ర పోషిస్తుందో. ఇంట్లో మనం చేసే పనుల విషయాల్లో కూడా శాస్త్రాన్ని ఫాలో కావాలని నిపుణులు చెబుతున్నారు. వీటిలో ఒకటి రాత్రుళ్లు దుస్తులు ఉతకడం. సాధారణంగా దుస్తులను ఉదయాన్నే వాష్‌ చేస్తుంటారు. అయితే ప్రస్తుతం మారిన జీవన విధానాలు, ఆఫీస్‌ కల్చర్‌ కారణంగా మనలో చాలా మంది సమయంతో సంబంధం లేకుండా దుస్తులను ఉతికేస్తున్నారు. మరీ ముఖ్యంగా వాషింగ్ మిషిన్స్ అందుబాటులోకి వచ్చిన తర్వాత రాత్రుళ్లు దుస్తులను ఉతకడం సర్వసాధారణమైపోయింది.

అయితే జ్యోతిష్య, వాస్తు పండితుల అభిప్రాయం ప్రకారం రాత్రిపూట దుస్తులు ఉతకడం ఏమాత్రం మంచిది కాదని చెబుబుతున్నారు. రాత్రి వెన్నెల వచ్చిన తర్వాత దుస్తులను ఎట్టిపరిస్థితుల్లో బయట ఆరబెట్టకూడదని సూచిస్తున్నారు. చిన్న పిల్లల దుస్తులను రాత్రి పూట ఆరబెట్టకూడదని మన పెద్దలు చెప్పే ఉంటారు. అయితే పెద్దల దుస్తులను కూడా ఇలా ఆరబెట్టకూడదని అంటున్నారు. దీనివల్ల నెగిటివ్‌ ఎనర్జీ పెరుగుతుందని అంటున్నారు.

సూర్యకాంతి ఉన్నప్పుడే బట్టలను ఆరబెట్టాలని చెబుతున్నారు. రాత్రిపూట ప్రతికూల శక్తులు బలంగా ఉంటాయి. ఇలాంటి సమయాల్లో దుస్తులను ఉతకడం, ఆరేయడం చేస్తే నెగిటివ్‌ ఎనర్జీ పెరుగుతుందని అంటున్నారు. అయితే దీనికి ఓ సైంటిఫిక్‌ రీజన్‌ కూడా ఉందడోయ్‌. ఉదయం సూర్య రక్ష్మిలో ఆరబెట్టిన దుస్తులకు, రాత్రుళ్లు ఆరబెట్టని దుస్తులకు చాలా తేడా ఉంటుంది. సూర్యరక్ష్మిలో దుస్తులు ఆరితే ఎలాంటి బ్యాక్టీరియా ఫామ్‌ అయ్యే అవకాశం ఉండదు. కొన్ని సందర్భాల్లో ఈ బ్యాక్టీరియా, ఫంగస్‌లే చర్మ సమస్యలకు కారణమవుతుందని వైద్యులు సైతం చెబుతుంటారు. కాబట్టి వీలైనంత వరకు దుస్తులను ఉదయాన్నే ఉతకడం అలవాటు చేసుకోవాలి.

నోట్‌: పైన తెలిపిన విషయాలు పలువురు వాస్తు పండితులు, జ్యోతిష్య శాస్త్రంలో తెలిపిన అంశాల ఆధారంగా అందించనవి మాత్రమే. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని రీడర్స్‌ గమనించాలి.

మరిన్ని ఇంట్రెస్టింగ్ వార్తల కోసం క్లిక్ చేయండి..