AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Self-surrender: ఇంట్లో ఉండలేను.. దయచేసి నన్ను అరెస్ట్ చేసి జైల్లో వేయండి.. ఇంగ్లండ్‌లో వింత అభ్యర్థన..!

Self-surrender: మాయదారి కరోనా ప్రజలను ఎంతలా భయపెట్టిందో అందరికీ తెలిసిందే. కరోనా కారణంగా యావత్ ప్రపంచమే స్తంభించిపోయింది.

Self-surrender: ఇంట్లో ఉండలేను.. దయచేసి నన్ను అరెస్ట్ చేసి జైల్లో వేయండి.. ఇంగ్లండ్‌లో వింత అభ్యర్థన..!
Shiva Prajapati
|

Updated on: Feb 20, 2021 | 3:53 PM

Share

Self-surrender: మాయదారి కరోనా ప్రజలను ఎంతలా భయపెట్టిందో అందరికీ తెలిసిందే. కరోనా కారణంగా యావత్ ప్రపంచమే స్తంభించిపోయింది. ప్రజలందరినీ ఇళ్లకే పరిమితం చేసింది. అయితే, దీని వల్ల కొందరు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోగా.. మరికొందరికి కుటుంబంతో గడిపే అవకాశం లభించింది. వచ్చిన అవకాశాన్ని కొంతమంది బాగా ఎంజాయ్ చేశారు. అయితే, కొంతకాలం ఇంట్లో ఉంటే సరదాగా ఉంటుంది కానీ.. నెలల తరబడి ఇంట్లో ఉండటం అంటే ఎవరికైనా విసుగొస్తుంది. ఇంగ్లండ్‌కు చెందిన ఓ వ్యక్తి కూడా ఇదే పరిస్థితిని ఎదుర్కొన్నాడు. ఇంట్లో ఉండి విసిగిపోయిన సదరు వ్యక్తి.. తనను జైల్లో వేయండంటూ నేరుగా పోలీసుల వద్దుకు వెళ్లి అభ్యర్థించాడు. వివరాల్లోకెళితే.. ఇంగ్లండ్ లోని బర్గెస్ హిల్ పోలీస్ స్టేషన్‌కు ఓ వ్యక్తి వచ్చాడు.

తనను అరెస్ట్ చేసి జైలుకు పంపాలని పోలీసులను అభ్యర్థించాడు. ఇంట్లో కుటుంబ సభ్యులతో కలిసి ఉండలేకపోతున్నానని, నరకం కనిపిస్తుందన్నాడు. ఇంట్లో ఉండటం కంటే.. జైలులో ఉండటమే మంచిదని పోలీసు అధికారులను సదరు వ్యక్తి వేడుకున్నాడు. ఇంట్లో ఉండలేకపోతున్నానని, నిద్ర కూడా పట్టడం లేదని, ఇంట్లో ఉండటం కంటే జైలు జీవితమే ప్రశాంతంగా ఉంటుందని పోలీసులను అభ్యర్థించాడు. తనను అరెస్ట్ చేసి జైల్లో వేయాలని కోరాడు. ఈ ఘటన తాలూకు వివరాలను బర్గెస్ హిల్ పోలీస్ స్టేషన్ ఇన్స్‌పెక్టర్ ట్విట్టర్‌లో పోస్ట్ చేశాడు. దాంతో అదికాస్తా వైరల్ అయ్యింది. ఇదిలాఉంటే.. స్ట్రెయిన్ వైరస్ వ్యాప్తంగా కారణంగా ఇంగ్లండ్ లోని పలు ప్రాంతాల్లో అక్కడి అధికారులు లాక్‌డౌన్‌ను విధించిన విషయం తెలిసిందే.

Also read:

ఆ సమస్యతో బంగారు భవనాన్ని అమ్ముతున్న యజమాని.. ధర ఎంతో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..

Gold Price Today: స్వల్పంగా తగ్గిన బంగారం ధరలు.. ఈరోజు గోల్డ్‌ రేట్స్‌ ఎలా ఉన్నాయంటే..

ఇంట్లో ఆర్టిఫిషియల్ మొక్కలు, పూలు పెడుతున్నారా..? ఏం జరుగుతుందంటే
ఇంట్లో ఆర్టిఫిషియల్ మొక్కలు, పూలు పెడుతున్నారా..? ఏం జరుగుతుందంటే
U19 WC: అండర్-19 ప్రపంచ కప్‏లో భారత్ ఘన విజయం.. బంగ్లాదేశ్‌ను చిత్తు చేసిన యంగ్ ఇండియా..
U19 WC: అండర్-19 ప్రపంచ కప్‏లో భారత్ ఘన విజయం.. బంగ్లాదేశ్‌ను చిత్తు చేసిన యంగ్ ఇండియా..
రైల్వే స్టేషన్లలో రూమ్ బుక్ చేసుకోవడం ఎలా..?
రైల్వే స్టేషన్లలో రూమ్ బుక్ చేసుకోవడం ఎలా..?
కిస్మిస్‌ అని లైట్‌ తీసుకుంటున్నారా..? ఎన్ని ఉపయోగాలో తెలిస్తే..
కిస్మిస్‌ అని లైట్‌ తీసుకుంటున్నారా..? ఎన్ని ఉపయోగాలో తెలిస్తే..
పోస్టాఫీస్‌లో అధిక రాబడి ఇచ్చే స్కీమ్‌లు ఇవే..!
పోస్టాఫీస్‌లో అధిక రాబడి ఇచ్చే స్కీమ్‌లు ఇవే..!
ఆఫీసులో ఏ దేవుని ఫొటో ఉండాలి.. వాస్తు చెప్పే సీక్రెట్ ఇదే
ఆఫీసులో ఏ దేవుని ఫొటో ఉండాలి.. వాస్తు చెప్పే సీక్రెట్ ఇదే
సికింద్రాబాద్ Vs మల్కాజ్‌గిరి.. జీహెచ్ఎంసీ విలీనంతో రగులుతున్న..
సికింద్రాబాద్ Vs మల్కాజ్‌గిరి.. జీహెచ్ఎంసీ విలీనంతో రగులుతున్న..
ప్లాస్టిక్ సర్జరీ రూమర్స్ పై హీరోయిన్ సీరియస్..
ప్లాస్టిక్ సర్జరీ రూమర్స్ పై హీరోయిన్ సీరియస్..
నా ఫిట్నెస్ సీక్రెట్స్ ఇవే.. హీరోయిన్ రాశి..
నా ఫిట్నెస్ సీక్రెట్స్ ఇవే.. హీరోయిన్ రాశి..
నిరుద్యోగులకు సూపర్ న్యూస్... ప్రభుత్వోద్యోగాలకు నోటిఫికేషన్
నిరుద్యోగులకు సూపర్ న్యూస్... ప్రభుత్వోద్యోగాలకు నోటిఫికేషన్