నువ్వు కాదు డబ్బే నిన్ను ఫాలో అవ్వాలి.. సుధామూర్తి నేర్పిన సక్సెస్ పాఠాలు..
చూపు తిప్పుకోనివ్వకుండా చేసే ఆమె ప్రసంగాలు ఎంతో మందికి స్ఫూర్తిదాయకం. వేల కోట్ల సామ్రాజానికి యజమాని అయినా.. సాధారణ ఇల్లాలి తీరుగా కనిపించే కట్టూ బొట్టూ ఆమె ప్రత్యేకం. జీవితంలో గెలవాలంటే కావలసింది ప్యాషన్ మాత్రమే అని నమ్ముతారామే. ఎంతో స్ఫూర్తిని రగిల్చే సుధామూర్తి కొటేషన్స్ ఇవి..

సుధా మూర్తి.. ఈ పేరు వినగానే అందరికీ గుర్తొచ్చేది ఎంత ఎదిగినా ఒదిగి ఉండే ఆమె తీరు. ఇన్ఫోసిస్ వంటి దిగ్గజ సంస్థ సీఈవోకు సతీమణి అయినా ఆమె తన గుర్తింపును తానే క్రియేట్ చేసుకున్నారు. ఆమె ఓ సాధారణ గృహిణి మాత్రమే కాదు ఓ సామాజిక కార్యకర్త, ఫిలాంత్రఫిస్ట్, రచయిత్రి, రాజ్యసభ సభ్యురాలు కూడా. జీవితంలో ఎన్నో ఎత్తుపల్లాలను ఎదుర్కొని వారు స్థాపించిన సాఫ్ట్ వేర్ సామ్రాజ్యం వేల మందికి ఉపాధినిస్తోంది. తన ఈ ప్రయాణంలో సుధా మూర్తి నేర్చుకున్న సక్సెస్ పాఠాలను కొన్ని మనతోనూ పంచుకున్నారు. అవేంటో చూసేద్దాం రండి..
ప్రస్తుతం నీకు దార్శనికత మాత్రమే కావచ్చు. దానికి నీ ప్రయత్నాన్ని జోడిస్తే అదే రేపు ప్రపంచాన్ని మార్చగల శక్తి కాగలదు.
జగతిలో మనుషులను కలిపి ఉంచాలన్నా.. విడగొట్టాలన్నా ఆ శక్తి కేవలం డబ్బుకు మాత్రమే ఉంది.
చక్కటి అభిరుచి కలిగిన వ్యక్తులు మాత్రమే జీవితంలోని ప్రతి చిన్న విషయాన్ని ఆస్వాదించగలరు.
క్వశ్చన్ పేపర్స్, మోడల్ పేపర్స్ అంటూ లేని సిలబస్ లాంటిది జీవితమనే పరీక్ష. దేన్నీ నువ్వు ముందే ప్రిపేర్ కాలేవు.
నీ దగ్గర ఎంత సంపద ఉన్నా నీ పని నువ్వు చేయడం అలవాటు చేసుకో. అది నీకు ఒదిగి ఉండటంలో ఉండే మజాను నేర్పుతుంది.
సక్సెస్ ఎప్పుడూ నీ గమ్యం కాకూడదు. అందుకోసం చేసే ప్రయాణమే నీ గెలుపు కావాలి.
కష్టపడి పనిచేయడం, వినయ విధేయలతో జీవితాన్ని గడపడం.. ఇవి నిన్నెప్పుడూ విజయతీరాలకు చేరుస్తాయి.
ఏదైనా సాధించాలంటే నీలో ఎప్పుడూ నిప్పులా ఎగిసిపడే తపన ఉండాలి. పాషన్ లేనిదే ఏ గొప్ప కార్యాన్ని జయించలేవు.
నిజమైన విజయం నువ్వు కూడబెట్టవిన సంపదలో కాదు.. ఇతరుల జీవితాల్లో నీవు తేగలిగిన మార్పే దానికి కొలమానం.
డబ్బు కోసం పనిచేయడం మానేయ్. నీ లక్ష్యం కోసం పనిచెయ్.. అదే డబ్బు నీ వెంట నడిచివస్తుంది.