Farmers Protest: ఢిల్లీ సరిహద్దుల్లో నివురుగప్పిన నిప్పులా పరిస్థితి.. వెనక్కి తగ్గమంటున్న రైతులు.. భారీగా పోలీసుల మోహరింపు
కొత్త వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ దేశ రాజధాని ఢిల్లీలో రైతులు చేపట్టిన ఆందోళన ఉద్రిక్తంగానే కొనసాగుతోంది. ఢిల్లీ సరిహద్దుల్లోని సింఘు, టిక్రీ, ఘాజీపూర్...

Farmers Protest Updates: కొత్త వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ దేశ రాజధాని ఢిల్లీలో రైతులు చేపట్టిన ఆందోళన ఉద్రిక్తంగానే కొనసాగుతోంది. ఢిల్లీ సరిహద్దుల్లోని సింఘు, టిక్రీ, ఘాజీపూర్ తదితర బోర్డర్లను ఖాళీ చేయాలని అధికారులు, పోలీసులు ఇప్పటికే రైతులకు సూచించారు. అయినప్పటికీ కొత్త చట్టాలను రద్దు చేసేంత వరకు వెనక్కి తగ్గేది లేదని నాయకులు ముక్తకంఠంతో పేర్కొంటున్నారు. ఈ చర్యలకు భయపడమని.. కేంద్రం ఉద్యమాన్ని నీరుగార్చేంకు ప్రయత్నిస్తోందని రైతులు ఆరోపిస్తున్నారు. దీంతో సరిహద్దుల్లో భారీగా పోలీసులను మోహరించారు. ఈ క్రమంలోనే పలు రాష్ట్రాల నుంచి రైతులు మళ్లీ ఢిల్లీ సరిహద్దుకు చేరుకుంటుండంతో మళ్లీ టెన్షన్ మొదలైంది. ఢిల్లీలో మళ్లీ పరిస్థితులు చేయిదాటకుండా ఉండేందుకు అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. అంతేకాకుండా కేంద్ర సాయుధ బలగాలను సైతం భారీగా మోహరించి సరిహద్దుల్లో 144 సెక్షన్ విధించారు.
Delhi: Heavy security deployment continues at Tikri Border where farmers are protesting against #FarmLaws pic.twitter.com/6gRDMxU9OL
— ANI (@ANI) January 29, 2021
గణతంత్ర దినోత్సవం రోజున జరిగిన హింసాకాండపై ఢిల్లీపోలీసులు పలు స్టేషన్లలో 33 కేసులు నమోదు చేశారు. వాటిలో 9 కేసులను క్రైం బ్రాంచ్‌కు అప్పగించారు. అంతేకాకుండా రైతు సంఘాల నేతలతో సహా మరో 44 మందికి లుక్అవుట్ నోటీసులు సైతం జారీ చేశారు. ఇదిలాఉంటే.. నేటినుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. వ్యవసాయ చట్టాలే లక్ష్యంగా విపక్షాలు కేంద్రాన్ని టార్గెట్ చేస్తున్నాయి. ఈ చట్టాలపై పునరాలోచించాలని డిమాండ్ చేస్తూ రాష్ట్రపతి ప్రసంగానికి గైర్హాజరవుతున్నట్లు 16 విపక్షపార్టీలు ప్రకటించిన విషయం తెలిసిందే.
Also Read: