
అందంగా, కాంతి వంతంగా ఉండాలని మగవారికైనా, ఆడవారికైనా ఉంటుంది. అయితే అందుకు తగ్గట్టుగానే ఆహారం, లైఫ్ స్టైల్ విధానాల్లో కూడా మార్పులు చేసుకోవాలి. కానీ ఇప్పుడు ఉన్న జీవన విధానం, ఫుడ్ హ్యాబిట్స్ వల్ల ముఖంలో కాంతి లేకుండా, నిర్జీవంగా మారుతుంది. అయితే కొన్ని రకాల ఫేస్ ఎక్సర్ సైజులు చేస్తే మీ ముఖం గ్లోగా తయారవుతుంది. మరి ఆ వ్యాయామాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
* నిదానంగా నిలబడి.. ముఖాన్ని వీలైనంత వరకు వెనక్కి ఎత్తి వంచాలి. గడ్డం ఆకాశం వైపు చూసేలా ఉండాలి. ఇలా ఐదు సెకన్ల పాటు ఉంచాలి. ఇలా 15 సార్లు చేస్తే సరి పోతుంది.
* అలాగే కొంత మందికి నోటి దగ్గర గీతలు వస్తూ ఉంటాయి. అలాంటి వారు నోటి నిండా గాలి నింపుకుని ఉబ్బినట్లు చేయండి. ఈ గాలిని ఒక బుగ్గ నుంచి మరో బుగ్గకు పుక్కిలించినట్లుగా చేయాలి.
* కళ్లు, ముక్కు, నోరు దగ్గర ఉన్న ముఖ కండరాలన్నింటినీ చిట్లించి ముందుకు అనాలి. అలా పది సెకన్ల పాటు ఉంచి.. మరో పది సెకన్ల పాటు రెస్ట్ తీసుకోవాలి. ఇలా రోజుకు పది సార్లు చేయాలి.
* పెదవులను మూసి ఉంచి.. ముద్ద పెడితే ఎలా ముందుకు వస్తాయి అలా ఉంచాలి. ఈ మూతిని రెండు చెవుల వైపుకు తిప్పుతూ ఉండాలి. ఇలా చేయడం వల్ల పెదవుల్లోకి, బుగ్గల్లోకి రక్త ప్రసరణ బాగా జరుగుతుంది. దీంతో ముఖం ఆరోగ్య వంతంగా తయారవుతుంది. అలాగే పెదవులు కూడా సహజంగానే లేత గులాబీ రంగులోకి వస్తాయి.
* 30 ఏళ్లు దాటిన తర్వాత కొందరికి నుదురు మీద గీతలు రావడం మొదలవుతుంది. దీంతో వయసు వచ్చిన వారిలా కనిపిస్తారు. ఇలాంటి వారు కనుబొమ్మల చివర ఇరు వైపులా వేళ్లన పెట్టండి. కన్ను బొమ్మల్ని తల వైపుకు మెల్లిగా లాగాలి. కళ్లు మూసుకుని కను బొమ్మల్ని సహజంగా పైకి అనేలా 15 సార్లు చేస్తే మీ ముఖంలో మార్పులు కనిపిస్తాయి.
* కళ్ల కింద భాగంలో దవడ ఎముకలు రెండు వైపులా ఉంటాయి. వాటిపై చేతి వెళ్లను పెట్టి ఆనించండి. స్కిన్ ని నెమ్మదిగా కళ్ల వైపు లాగండి. నోటిని ‘O’ ఆకారంలో పెట్టాలి. ఇలా ఐదు సెకన్ల పాటు ఉండాలి. ఇలా రోజుకు 15 సార్లు చేయాలి.
మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
గమనిక: ఇది నిపుణులు, అధ్యయనాల నుంచి సేకరించిన సమాచారం. అవగాహన కోసం మాత్రమే ఈ కథనం. ఆరోగ్యానికి సంబంధించిన ఏ చిన్న సమస్య ఉన్నా వైద్యులను సంప్రదించడం మేలు.