Summer Health Tips: ఇంతటి ఎండలలో కూడా ఫ్రిజ్ వాటర్ తాగుతున్నారా..? మట్టి కుండ నీళ్లు తాగండయ్యా..! ఎందుకంటే..?

|

Mar 05, 2023 | 7:30 AM

ఓల్డ్ ఈజ్ ఆల్వేస్ గోల్డ్ అని ఎవరో అన్నట్లుగా పెద్దలు ఆచరించిన ప్రతి విషయం మనకు మేలుదాయకమే. మారిన జీవన శైలీతో.. స్టీల్, ప్లాసిక్,..

Summer Health Tips: ఇంతటి ఎండలలో కూడా ఫ్రిజ్ వాటర్ తాగుతున్నారా..? మట్టి కుండ నీళ్లు తాగండయ్యా..! ఎందుకంటే..?
Drinking Water From Clay Pot
Follow us on

మార్చి నెల ప్రారంభం కాకముందు నుంచే ఎండలు మండిపోతున్నాయి. ఇక ఇప్పుడైతే పగటి వేళ అడుగు బయట పెట్టాలంటే చర్మ సమస్యలు, వడదెబ్బ, వేడి వంటి సమస్యల బారిన పడే పరిస్థితి. రానున్న రోజులలో ఈ ఎండలు మరింతగా తీవ్రతరం అయ్యే అవకాశం ఉంది. ఈ క్రమంలో మండుతున్న ఎండల నుంచి, వేడి వాతావరణంలో కూడా ప్రశాంతంగా జీవించడానికి మన పెద్దలు కుండలోని నీరు తాగితే చాలంటున్నారు. నిజమే. ఓల్డ్ ఈజ్ ఆల్వేస్ గోల్డ్ అని ఎవరో అన్నట్లుగా పెద్దలు ఆచరించిన ప్రతి విషయం మనకు మేలుదాయకమే. మారిన జీవన శైలీతో.. స్టీల్, ప్లాసిక్, పింగాణి పాత్రలు వచ్చేశాయి. ఇక మట్టి కుండలను కూడా వాడడం మార్చిపోయారు నేటితరం. ఫ్రిజ్‌లు వచ్చాక.. వీటిని పక్కన పెట్టేశారు. పూర్వకాలంలో నీళ్ళను ఈ మట్టి కుండలలోనే స్టోర్ చేసి తాగేవారు. కానీ ప్రస్తుత కాలంలో ఎండాకాలం వచ్చిదంటే ఓన్లీ ఫ్రిజ్ వాటర్. అలా కూల్ వాటర్ తాగడం వల్ల వెంటనే చాలా హాయిగా అనిపిస్తుంది. కానీ.. కొంతకాలం తర్వాత అనారోగ్య సమస్యలు వెంటాడే అవకాశాలున్నాయి.

మరోవైపు రిఫ్రిజిరేటర్‌లోని చల్లటి నీరు తాగడం వల్ల అకస్మాత్తుగా గొంతు కణాల ఉష్ణోగ్రత పడిపోతుంది, గొంతు నొప్పితో పాటు జలుబు చేసే అవకాశం ఉంది. మట్టి కుండలో నీళ్ళను తాగితే ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలున్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో ఇప్పటికీ చాలా మంది మట్టి కుండలో నీళ్లు తాగుతుంటారు. ఇక వేసవి ప్రారంభమైంది. మార్కెట్లో కొన్ని చోట్ల ఈ మట్టి కుండలు లభిస్తున్నాయి. అలాగే.. ఇటీవల కాలంలో మట్టి పాత్రలతోపాటు.. మట్టి గ్లాసులు, మట్టి బాటిల్స్ కూడా అందుబాటులోకి వస్తున్నాయి. అయితే ఈ మట్టి కుండలలో నీళ్లు తాగడం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలను తెలుసుకుందాం..

మట్టి కుండలోని నీరు తాగడం వల్ల కలిగే ప్రయోజనాలు..

  • వేసవిలో కుండలోని నీరు తాగాడం వలన ఆరోగ్యానికి మంచిది. అలాగే గొంతుకు సంబంధించిన సమస్యలు రావు. జలుబు, దగ్గు సమస్యలను తగ్గిస్తుంది.
  • సన్ స్ట్రోక్ ప్రతి ఒక్కరికి ఎదురయ్యే సమస్య. వేసవికాలంలో చాలా మంది వడదెబ్బకు గురవతుంటారు. మట్టికుండలోని నీటిలో విటమిన్లు, ఖనిజాలు అధికంగా ఉండి.. శరీర గ్లూకోజ్ స్థాయిని నిర్వహించడానికి సహాయపడతాయి.
  •  మట్టి కుండలో ఉండే నీరు తాగడం వలన శరీరానికి ఆమ్ల శాతం అందుతుంది.
  •  కడుపులో యాసిడిటి సమస్యను తగ్గుతుంది.
  • మెటబాలిజం రేటు పెరుగుతుంది.
  • టెస్టోస్టెరాన్ స్థాయిలను సమతుల్యం చేస్తుంది.
  • జీవక్రియ రేటును మెరుగుపరుస్తుంది.
  • అతిగా దాహం వేయదు.
  • శరీరాన్ని చల్లబరుస్తుంది.

గమనిక : అధ్యయనాలు.. ఆరోగ్య నిపుణుల సూచనలు.. ఇతర ఆరోగ్య సంబంధిత నివేదికల ప్రకారం ఈ వివరాలను అందించాం. ఈ కథనం కేవలం మీ అవగాహన కోసమే. ఆరోగ్యానికి సంబంధించిన సమస్యలపట్ల నిర్ణయాలను తీసుకునే ముందు వైద్యులను సంప్రదించడం మంచిది.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆరోగ్య సంబంధిత వార్తల కోసం..