
శీతా కాలంలో చర్మ సమస్యలు సర్వ సాధారణం. నిజానికి గాలిలో తేమ లేకపోవడం వల్ల చర్మం పొడి బారుతుంది. శీతా కాలంలో ఎక్కడికైనా విహార యాత్రకు వెళ్లినప్పుడు ఈ సమస్య మరింత తీవ్ర తరం అవుతుంది. ఎందుకంటే ప్రతి ప్రదేశంలో గాలి, నీరు అనేవి భిన్నంగా ఉంటాయి. దాని కారణంగా చర్మం పొడిగా మారుతుంది. అందుకే వింటర్ సీజన్‌లో ముఖాన్ని మాత్రమే కాకుండా మొత్తం శరీరాన్ని కూడా తేమగా ఉంచుకోవాలి. ఈ సమస్యను తగ్గించుకోవడానికి ఎంతో ఖరీదైన క్రీములను కూడా ఉపయోగించుకోవచ్చు. ఇంట్లో ఉండే వాటితోనే తక్కువ బడ్జెట్‌లో మంచి మాయిశ్చరైజ్ అండ్ గ్లోయింగ్ స్కిన్ ని పొంద వచ్చు. అలాగే చర్మం పొడిబారే సమస్యను తగ్గించుకునేందుకు.. షాహిద్ కపూర్ భార్య మీరా కపూర్ పాటించిన హోమ్ రెమిడీస్ ఏంటో కూడా ఇప్పుడు తెలుసుకుందాం.
సాధారణం వింటర్ సీజన్‌లో చర్మం పొడి బారుతూ ఉంటుంది. ఈ సమస్యను తగ్గించుకునేందుకు షాహిద్ కపూర్ భార్య మీరా కపూర్ పచ్చి పాలను రాసుకునేదట. తక్కువ ఖర్చుతోనే మంచి హెల్దీ స్కిన్ పొందుతున్నట్లు ఆమె ఓ ఇంటర్వ్యూలో చెప్పింది. కాగా చర్మం పొడిబారకుండా కాపాడేందుకు పచ్చి పాలు అద్భుతంగా పని చేస్తాయని ముంబైకి చెందిన డెర్మటాలజిస్ట్ డాక్టర్ శ్రద్ధా దేశ్ పాండే చెబుతున్నారు. పచ్చి పాలలో విటమిన్లు ఎ, డి, ఇ వంటివి సమృద్ధిగా ఉంటాయి. అదే విధంగా చర్మం కూడా హైడ్రేట్ అవుతుందని, మృదువుగా మారుతుందని అంటున్నారు. పచ్చి పాలల్లో ఉండే లాక్టిక్ యాసిడ్ సహాయంతో చర్మం ఆకృతిని మెరుగు పరచుకోవడమే కాకుండా తేమను పెంచుతుందని డాక్టర్ దేశ్ పాడే తెలిపారు.
పచ్చి పాలు సహజమైన మాయిశ్చరైజర్. ఇందులో ఇమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్, అధిక కొవ్వు పదార్థాలు ఉన్నాయి. ఇవి చర్మాన్ని హైడ్రేట్‌గా ఉంచుతాయి. అంతే కాకుండా పొడి బారకుండా చేస్తుంది. అంతే కాకుండా చర్మంపై ఉండే మృత కణాలు (డెడ్ స్కిన్ సెల్స్)ను కూడా తొలగిస్తుందని చర్మ నిపుణులు పేర్కొంటున్నారు. పచ్చి పాలను నేరుగా అయినా చర్మానికి అప్లై చేసుకోవచ్చే. లేదా ఇతర పదార్థాలతో కలిపి రాసుకున్న మంచి రిజల్ట్స్ ఉంటాయి.
పాల వాసన నచ్చని వారు పాలలో ఇతర పదర్థాలు కూడా కలిపి యూజ్ చేసుకోవచ్చు. చర్మం పొడి బారకుండా ఉండేందుకు, వాసన రాకుండా ఉండేందుకు.. పచ్చి పాలలో రోజ్ వాటర్ కలిపి కూడా చర్మానికి రాయవచ్చు. చర్మం జిడ్డుగా ఉంటే రోజ్ వాటర్ పరిమాణం పెంచాలి. ప్రతి రోజూ రాత్రి పడుకునే ముందు ఈ మిశ్రమాన్ని రాసుకుని పడుకుంటే.. ఉదయం గోరు వెచ్చని నీటితో కడిగేసుకుంటే స్కిన్ కాంతివంతంగా మెరుస్తూ ఉంటుంది.
మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
గమనిక: ఇది నిపుణులు, అధ్యయనాల నుంచి సేకరించిన సమాచారం. అవగాహన కోసం మాత్రమే ఈ కథనం. ఆరోగ్యానికి సంబంధించిన ఏ చిన్న సమస్య ఉన్నా వైద్యులను సంప్రదించడం మేలు.