మధుమేహం తర్వాత వేగంగా పెరుగుతున్న వ్యాధి బ్లడ్ ప్రెజర్. అధిక రక్తపోటు, తక్కువ రక్తపోటు అనేది ఇప్పుడు చాలామందిలో సాధారణ సమస్యగా మారింది. యువతలో కూడా వేగంగా పెరుగుతోంది. బిజీ లైఫ్ స్టైల్, బ్యాడ్ ఫుడ్ హ్యాబిట్స్ కారణంగా పిల్లలతో పాటు వృద్ధుల్లోనూ బీపీ సమస్య ఎక్కువగా కనిపిస్తోంది. అయితే, యోగాతో రక్తపోటు సమస్య నుంచి బయటపడొచ్చని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు. యోగా మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరచడమే కాకుండా శారీరక ఆరోగ్యాన్ని కూడా మెరుగుపరుస్తుంది. ఇందుకోసం చాలా యోగాసనాలు ఉన్నాయి. ఇవి మన హృదయం ఆరోగ్యాన్ని కూడా కాపాడుతాయి. రక్తపోటు సమస్యను తగ్గించే యోగాసనాలు ఏంటో ఇవాళ మనం తెలుసుకుందాం..
‘సూర్య నమస్కారం’ ఆసనం చేయడం ద్వారా మనస్సు ప్రశాంతంగా ఉంటుంది. ఇది రక్తపోటును నియంత్రణలో ఉంచుతుంది. అయితే, 12 ఆసనాలు ఉంటాయని, వీటిని చాలా జాగ్రత్తగా చేయాలని యోగా నిపుణులు సూచిస్తున్నారు.
రక్తపోటు ఎక్కువగా ఉన్నప్పుడు శరీరంలో శరీరంలో రక్త ప్రసరణ తగ్గుతుంది. తద్వారా అనేక సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇలాంటి సమస్యను ఎదుర్కొనేవారు.. పవన్ముక్తాసనం వేయడం వలన రక్త ప్రసరణ మెరుగవుతుంది. ఇది ఆరోగ్య పరిస్థితిని మెరుగుపరుస్తుంది.
సూర్యభేది ప్రాణాయామం రక్తపోటు సమస్య ఉన్నవారే కాకుండా.. మధుమేహం బాధితులు కూడా చేయొచ్చని యోగా నిపుణులు చెబుతున్నారు. ఇది ఈ రెండింటిని నియంత్రణలో ఉంచుతుందని చెబుతున్నారు.
అధికరక్తపోటు ఉన్నవారు అన్ని రకాల యోగాసనాలు చేయొద్దని యోగా నిపుణులు చెబుతున్నారు. హైబీపీ ఉన్నవారు సర్వాంగ ఆసనం, హలాసనం, శీర్షాసనం చేయొద్దుని స్పష్టం చేస్తున్నారు. వీరు భ్రమరీ ప్రాణాయామం, శవాసనం చేయొచ్చని చెబుతున్నారు.
భ్రమరీ ప్రాణాయామం చేయడం వల్ల మెదడులో ఒత్తిడి తగ్గుతుందని యోగా నిపుణులు చెబుతున్నారు. అధిక రక్తపోటులో భ్రమరీ ప్రాణాయామం చాలా ప్రయోజనకరంగా ఉంటుందట.
శవాసనం రెగ్యులర్ అభ్యాసంగా చేయాలని సూచిస్తున్నారు. ఇది ఇంద్రియాలను నియంత్రిస్తుంది. ఇది ఆందోళనను తగ్గిస్తుంది. బీపీని నియంత్రణలో ఉంచుతుంది.
మరిన్ని హెల్త్ సంబంధిత వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..