Sphygmomanometer: ప్రస్తుత ఉరుకులు, పరుగుల జీవితంలో ప్రపంచ వ్యాప్తంగా చాలా మంది ప్రజలు ఊభకాయం, స్థూలకాయం, మధుమేహం బారిన పడుతున్నారు. అలాగే రక్తపోటు పెరుగుతున్న బాధితుల సంఖ్య కూడా భారీగా పెరుగుతున్నారు. ఇలాంటి వ్యాధులతో సతమతం అయ్యేవారితో పాటు.. స్వల్ప అస్వస్థతకు గురయ్యే వారికి సైతం సాధారణ పరీక్షలో భాగంగా బ్లడ్ ప్రెజర్‌ను చెక్ చేస్తుంటారు వైద్యులు. స్పిగ్మోమానోమీటర్‌ను ఉపయోగించి రక్తపోటును పరిశీలిస్తారు. దాని ఆధారంగా రక్తపోటును నిర్ధారిస్తారు వైద్యులు. అయితే, స్పిగ్మోమానోమీటర్‌లో భాగమైన కఫ్‌కు సంబంధించి ఓ వార్త ప్రపంచాన్ని కలవరానికి గురి చేస్తుంది. కఫ్ పరిమానం.. మరిన్ని సమస్యలకు దారి తీస్తుందని తాజా అధ్యయనంలో బయటపడింది.
అమెరికన్ హార్ట్ అసోసియేషన్ ఎపిడెమియాలజీ అండ్ ప్రివెన్షన్/లైఫ్‌స్టైల్ అండ్ కార్డియోమెటబోలిక్ హెల్త్ 2022లో సమర్పించబడిన ఒక అధ్యయనం ప్రకారం.. సరికాని కఫ్ పరిమాణాన్ని ఉపయోగించి చెక్ చేసిన రక్తపోటు రీడింగ్‌లు తప్పుగా వస్తున్నాయని, ఇది ప్రజలకు మరింత చేటు చేస్తుందని పేర్కొంది. ఊబకాయం ఉన్న వ్యక్తులకు పెద్ద సైజు కఫ్‌లు అవసరం ఉంటుంది. కానీ, పరిణామంలో తేడా ఉండటం వల్ల బీపీ చెకప్‌లో తప్పుడు రీడింగ్ వచ్చే ప్రమాదం ఉందని ఆ నివేదిక పేర్కొంది.
బాల్టిమోర్‌లోని జాన్స్ హాప్‌కిన్స్ యూనివర్శిటీకి చెందిన పరిశోధకుడు టామీ ఎం. బ్రాడీ (MD, PhD), సహచరులు కలిసి 165 మంది విభిన్న వ్యక్తులపై పరిశోధనలు నిర్వహించారు. విభిన్న పరిమాణాలు గల రెండు సెట్ల స్పిగ్మోమానోమీటర్‌లను ఉపయోగించి పరీక్షలు నిర్వహించారు. చిన్న కఫ్ అవసరమయ్యే వారిలో సాధారణ కఫ్‌ను ఉపయోగించి పరీక్షలు నిర్వహించారు. అయితే, ఈ పరీక్షణల్లో భారీ తేడాను గమనించారు పరిశోధకులు. రీడింగ్‌లలో గణనీయమైన హెచ్చుతగ్గులు ఉండటాన్ని కనుగొన్నారు. వ్యక్తుల పరిమానాలకు తగినట్లు కఫ్‌లను వినియోగించి పరీక్షలు చేస్తే సక్రమంగానే రీడింగ్ వస్తోందన్నారు. అండర్ కఫింగ్‌తో చేసిన పరీక్షల్లో బీపీని ఎక్కువగా అంచనా వేయడం వల్ల హైపర్ టెన్షన్ ఉన్నవారిలో 39 శాతం తప్పుడు రీడింగ్ చూపుతోందని తేల్చారు. ఇక ఓవర్ కఫింగ్‌తో జరిపిన పరీక్షల్లో బీపీని తక్కువ అంచనా వేయడం వల్ల హైపర్‌టెన్సివ్ బీపీ ఉన్నవారిలో 22 శాతం తప్పు అని తేలింది.
‘‘ఖచ్చితమైన పద్ధతుల ద్వారా కొలిచినప్పుడు కూడా రక్తపోటు మారుతూ ఉంటుంది. కఫ్ చాలా చిన్నది లేదా చాలా పెద్దది అయినట్లయితే, కొలతలో లోపాలు సంభవించవచ్చు. ఆటోమేటిక్ పరికరాల్లో ఇదే సమస్య. వీటితో కొలత ఖచ్చితత్వాన్ని వైద్యపరంగా ధృవీకరించబడలేదు. క్లినికల్ ధ్రువీకరణలో ప్రదర్శించడం ద్వారా ఈ పరికరం అంతర్జాతీయ బిపి కొలత ప్రమాణాల ఖచ్చితత్వ అవసరాలను తీరుస్తుంది.’’ అని ముంబైలోని జైన్ మల్టీస్పెషాలిటీ హాస్పిటల్ ఎండీ ఫిజీషియన్ డాక్టర్ సోనుకుమార్ పూరి తెలిపారు.
ఇంట్లోని పరికరాలతో బీపీని ఎలా కొలవాలి..
‘‘రక్తపోటు రోజంతా మారుతూ ఉంటుంది. ఇది సాధారణంగా ఉదయం అతి తక్కువగా ఉంటుంది. ఒక వ్యక్తి మేల్కొన్న తర్వాత, ఆపై క్రమంగా పెరుగుతుంది. ఇది కదలికలు, భోజనం, మానసిక స్థితికి తగ్గట్లుగా ప్రతిస్పందిస్తుంది. అయితే, వీటితో సంబంధం లేకుండా రక్తపోటును మరింత ఖచ్చితమైన వివరాలను పొందడానికి వ్యక్తులకు సంబంధించి అనేక రికార్డులను పరిశీలించారు. వాటిని సగటున గణించాలి. అలాగే, ఇంట్లో సాధారణ రక్తపోటును చెక్ చేసే ముందు.. మీవద్ద ఉన్న బీపీ చెకింగ్ పరికరాన్ని వైద్యులతో తనిఖీ చేసుకోవడం చాలా ముఖ్యం. బీపీ ఎక్కువ ఉన్నవారు.. పరీక్షలు నిర్వహించుకోవడం మంచి ఆలోచనే.’’ అని డాక్టర్ పూరి పేర్కొన్నారు.
కాగా, లాన్సెట్ అధ్యయనంలో మరో కీలక విషయం కూడా వెల్లడైంది. హైపర్ టెన్షన్ నిర్ధారణలో భారత్ చివరన ఉన్నట్లు తేల్చారు. దేశంలోని 60-70 శాతం మంది ప్రజలకు తమ రక్తపోటు పరిస్థితి గురించి తెలియదన్నారు. వీటి గురించిన సమాచారం లేకపోవడం వల్ల గుండెపోటు, స్ట్రోక్‌ల వంటి ప్రాణాంతక పరిస్థితులను ఎదుర్కొనే పరిస్థితి వస్తుందన్నారు. హైపర్ టెన్షన్ అనేది తీవ్రమైన పరిస్థితి అని, ప్రాథమిక ఆరోగ్య సంరక్షణ కేంద్రాలలోనూ దీనిని సులభంగా గుర్తించవచ్చు. ముందుగానే గుర్తిస్తే.. తక్కుత ఖర్చుతో కూడిన చికిత్సతో రక్తపోటును నియంత్రించవచ్చు. కానీ, దేశ ప్రజలలో దీనిపై అవగాహన లేమి ఉందని నివేదిక పేర్కొంది. 200 దేశాలతో పోలిస్తే.. భారతదేశం మహిళల విషయంలో 193, పురుషుల విషయంలో 170వ స్థానంలో ఉందని అధ్యయనం పేర్కొంది.
ఇక ప్రపంచ వ్యాప్తంకగా రక్తపోటుతో బాధపడుతున్న వారి సంఖ్య 30 సంవత్సరాల కాలంలో 650 మిలియన్ల నుంచి 1.28 బిలియన్లకు పెరిగిందని నివేదిక పేర్కొంది. ముఖ్యంగా రక్తపోటుతో బాధ పడుతున్నవారి సంఖ్య తక్కువ ఆదాయం, మధ్య ఆదాయ దేశాల్లో ఎక్కువగా ఉందని నివేదిక తెలిపింది. 2019లో అతి తక్కువ రక్తపోటు బాధిత దేశాల్లో కెనడా, పెరూ, స్విట్జర్లాండ్ దేశాలు వరుసగా ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానాల్లో నిలిచాయి. ఇక డొమినికన్ రిపబ్లిక్, జమైకా, పరాగ్వే, హంగేరీ వంటి దేశాల్లో ప్రజలు అధిక రక్తపోటు బాధితులు ఎక్కువగా ఉన్నట్లు నివేదిక పేర్కొంది.
Also read:
Bad Breath: నోటి దుర్వాసనతో ఇబ్బంది పడుతున్నారా అయితే ఇలా చేయండి… క్షణంలో నోటి దుర్వాసన మాయం..వీడియో
NCSM Jobs 2022: నేషనల్ కౌన్సిల్ ఆఫ్ సైన్స్ మ్యూజియంలో ఉద్యోగాలు.. పూర్తి వివరాలివే..