మైగ్రేన్ అనేది చాలా మంది ఎదుర్కొనే సాధారణ సమస్య. కానీ కొంతమంది స్త్రీలలో రుతుక్రమం సమయంలో మైగ్రేన్ సమస్య చాలా తీవ్రంగా ఉంటాయి. మహిళల్లో మైగ్రేన్‌కు కారణాలలో ఒకటి ఈస్టోమన్ స్థాయి మార్పు. ఈ హార్మోన్లలో అసమతుల్యం కారణంగా.. మైగ్రేన్ సమస్యను ఎదుర్కొంటారు.
స్త్రీల మావి, అండాశయాలలో ఈస్ట్రోజెన్ హార్మోన్ ఉత్పత్తి అవుతుంది. ఈస్ట్రోజెన్ అతి ముఖ్యమైన రూపం స్త్రీ శరీరం ద్వారా ఉత్పత్తి చేయబడిన ఎస్ట్రాడియోల్. ఇది పిల్లల ఎదుగుదలకు అత్యంత అవసరమైన హార్మోన్ అని అంటారు. ఈ హార్మోన్ గర్భం దాల్చడానికి సహాయపడుతుంది. గర్భస్రావాన్ని నివారిస్తుంది.
సాధారణ హార్మోన్ల సమస్యల వల్ల వచ్చే తలనొప్పులు స్వల్పంగా ఉంటాయి. అదే రుతుస్రావం కాలంలో తీవ్రమైన మైగ్రేన్ సమస్య వస్తుంది. పరిస్థితి చాలా దారుణంగా ఉంటుంది. మైగ్రేన్ సమస్య.. మహిళలను రోజువారి పనులను చేసుకోనివ్వదు. తీవ్రమైన నొప్పితో నరకం కనిపిస్తుంటుంది. మైగ్రేన్ కారణంగా వికారం, వాంతులు, మసకబారే దృష్టి, తీవ్రమైన తల నొప్పి వస్తుంది. ప్రపంచవ్యాప్తంగా 60% మంది మహిళల్లో ఈ ఆరోగ్య సమస్య కనిపిస్తోందని చెబుతున్నారు.
అయితే, ఈ సమస్య నుంచి బయటపడేందుకు ఒకటే మార్గం చెబుతున్నారు నిపుణులు. సరైన జీవనశైలిని పాటించాలని సూచిస్తున్నారు. సమయానికి ఆహారం తీసుకోవాలి. పౌష్టికాహారం తీసుకోవాలి. బాగా నీరు తాగాలి. యోగా, వ్యాయామం చేయాలని సూచిస్తున్నారు. తద్వారా హార్మోన్ల అసమతుల్యతను సరిచేయొచ్చని చెబుతున్నారు.
గమనిక: పైన పేర్కొన్న సమాచారం ప్రజల సాధారణ ప్రయోజలనుద్దేశించి ఇవ్వడం జరిగింది. దీనిని టీవీ9 తెలుగు ధృవీకరించడం లేదు. ఏవైనా సమస్యలుంటే ముందుగా వైద్యుల సలహా తీసుకుని, వారి సూచనలు పాటించాలి.
మరిన్ని జీవనశైలి వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి: