Heart Health: అజీర్తి కారణంగా మహిళల్లో గుండెపోటు వచ్చే అవకాశం 40% ఎక్కువ.. అధ్యయనంలో షాకింగ్ విషయాలు..
ప్రజలను కబళిస్తున్న వ్యాధుల్లో గుండెపోటు ముందు వరసలో ఉంది. మారిపోతున్న జీవనశైలి, ఫుడ్ అలవాట్లు కారణంగా ఈ ముప్పు రోజురోజుకు పెరుగుతోంది. ఈ విషయంపై అధ్యయనం జరిపిన శాస్త్రవేత్తలకు పలు దిగ్భ్రాంతికర..
ప్రజలను కబళిస్తున్న వ్యాధుల్లో గుండెపోటు ముందు వరసలో ఉంది. మారిపోతున్న జీవనశైలి, ఫుడ్ అలవాట్లు కారణంగా ఈ ముప్పు రోజురోజుకు పెరుగుతోంది. ఈ విషయంపై అధ్యయనం జరిపిన శాస్త్రవేత్తలకు పలు దిగ్భ్రాంతికర విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ముఖ్యంగా మహిళల్లో గుండెపోటు వచ్చే అవకాశాలపై తీవ్ర ఆందోళన నెలకొంది. అజీర్తి కారణంగా మహిళల్లో గుండెపోటు వచ్చే అవకాశం 40% ఎక్కువగా ఉన్నట్లు ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. యూకేలో రోజూ 77 మంది మహిళలు గుండెపోటు కారణంగానే చనిపోతున్నట్లు గుర్తించారు. మహిళలు సాధారణంగా గుండెల్లో మంట లేదా ఆందోళనతో గుండెపోటు లక్షణాలను అంతగా పట్టించుకోరు. గుండెపోటు వచ్చే సమయంలో 85 నుంచి 90 శాతం మంది మహిళలు అనేక విభిన్న లక్షణాలను గుర్తించినట్లు పరిశోధకులు కనుగొన్నారు. మహిళల్లో అజీర్తి అనేది గుండెపోటుకు దారితీసే ఒక సాధారణ సంఘటనగా శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
40 శాతం మంది మహిళలు గుండెపోటుకు ముందు ఒక నిర్దిష్ట లక్షణాన్ని అనుభవించవచ్చని, దానిని సులభంగా గుర్తించవచ్చని చెబుతున్నారు. బ్రిటీష్ హార్ట్ ఫౌండేషన్ ప్రకారం.. కొరోనరీ సమస్యల విషయంలో పురుషుల కంటే స్త్రీలు 50 శాతం తప్పుగా నిర్ధారణ చేస్తుంటారు. వృద్ధులు లేదా మధ్య వయస్కులు, యువకులందరిలో గుండె సమస్యలు వస్తున్నాయి. ఈ పరిస్థితిపై డబ్ల్యూహెచ్ఓ కూడా ఆందోళన వ్యక్తం చేసింది. మహిళలు సాధారణంగా గుండెల్లో మంట లేదా ఆందోళనతో గుండెపోటు లక్షణాలను అంతగా పట్టించుకోవడం లేదని, కానీ ఈ పరిస్థితి దీర్ఘ కాలంలో పెను ముప్పుగా మారుతోందని తెలిపింది.
అధ్యయనం ప్రకారం.. దాదాపు 39 శాతం మంది గుండెపోటుకు ముందు తాము అజీర్తి సమస్యలతో బాధపడుతున్నట్లు తెలిపారు. విలక్షణమైన కార్డియాక్ లక్షణాలు ప్రధానంగా వారి వయసు, అనుభవంపై ఆధారపడి ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. 85 నుంచి 90 శాతం మంది మహిళలు గుండెపోటుకు దారితీసే కాలంలో అనేక విభిన్న లక్షణాలను గుర్తించినట్లు పరిశోధకులు తెలిపారు. ఇది వైద్యులు, సాధారణ వ్యక్తుల్లో అపార్థాలకు కారణమవుతుంది. అంతే కాకుండా తప్పుడు చికిత్స విధానాలనూ దోహదపడుతుంది. అంతే కాకుండా మహిళలకు చికిత్స అందించడంలోనూ ఆలస్యం కలిగిస్తుందని చెప్పారు.
బ్రిటిష్ హార్ట్ ఫౌండేషన్‌లోని సీనియర్ కార్డియాక్ నర్సు రూత్ గోస్, గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గించడంలో సహాయపడే అనేక చిట్కాలను చెప్పారు. క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం, రక్తపోటు స్థాయిలను నిర్వహించడం, ఆరోగ్యకరమైన జీవనశైలిని అనుసరించడం, పొగాకు లేదా ఆల్కహాల్ తీసుకోవడం అనేక గుండె జబ్బులకు దారి తీస్తుంది కాబట్టి, శారీరకంగా ఆరోగ్యంగా జీవించడానికి వ్యక్తి బరువునూ కంట్రోల్ గా ఉంచుకోవాలని చెబుతున్నారు. ఈ జాగ్రత్తలు పాటిస్తే గుండెపోటు వచ్చే అవకాశాలు తగ్గుముఖం పడతాయని పేర్కొంటున్నారు.