Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Health Tips: ఉదయాన్నే ఖాళీ కడుపుతో వీటిని అస్సలు తీసుకోవద్దు.. ఎందుకంటే!

ఆ రోజు మొత్తం మనం యాక్టివ్‌గా ఉండాలంటే.. కచ్చితంగా టిఫిన్‌లో పౌష్టికాహారాన్ని తీసుకోవాలని వైద్యులు సూచిస్తుంటారు.

Health Tips: ఉదయాన్నే ఖాళీ కడుపుతో వీటిని అస్సలు తీసుకోవద్దు.. ఎందుకంటే!
Avoid These Foods In Mornin
Follow us
Ravi Kiran

|

Updated on: Oct 14, 2022 | 8:13 PM

ఉదయాన్నే లేచిన వెంటనే మనకు ఏ పని చేయబుద్ది కాదు. అందుకే ఆ రోజు మొత్తం మనం యాక్టివ్‌గా ఉండాలంటే.. కచ్చితంగా టిఫిన్‌లో పౌష్టికాహారాన్ని తీసుకోవాలని వైద్యులు సూచిస్తుంటారు. అయితే ఈ మధ్యకాలంలో కొందరు బరువును నియంత్రణలో ఉంచుకోవాలని, చక్కటి ఫిజిక్ మైంటైన్ చేయడానికి పరగడుపునే డైట్ ఫాలో అవుతున్నారు. ఈ క్రమంలోనే ఉదయాన్నే ఖాళీ కడుపుతో కొన్ని ఆహారాలను లేదా పానీయాలను తీసుకోవడం జరుగుతోంది. అయితే ఖాళీ కడుపుతో వీటిని అస్సలు తీసుకోకూడదని డాక్టర్లు చెబుతున్నారు. మరి అవేంటో తెలుసుకుందాం.

  • స్పైసీ ఫుడ్:

ఖాళీ కడుపుతో మసాలాలు ఎక్కువ ఉండే ఆహారం, ఆయిలీ ఫుడ్స్ తీసుకోకూడదు. అలా తినడం వల్ల కడుపు సంబంధిత సమస్యలు తలెత్తుతాయి. కడుపులో తిమ్మిర్లు, అజీర్తి వంటివి వస్తాయి.

  • చక్కెర ఆహారాలు లేదా పానీయాలు:

పరగడుపున ఒక గ్లాసు పండ్ల రసం తాగడం ఆరోగ్యకరమని చాలామంది అభిప్రాయపడుతుంటారు. అయితే డాక్టర్లు మాత్రం ఖాళీ కడుపుతో జ్యూస్‌లు తాగొద్దని చెబుతున్నారు. ఖాళీ కడుపుతో పండ్ల రసం తాగితే.. అందులో ఉండే చక్కెర స్థాయిలు మీ కాలేయంపై తీవ్ర ప్రభావం చూపిస్తాయని అంటున్నారు.

  • శీతల పానీయాలు:

ఖాళీ కడుపుతో చల్లటి పానీయాలు తాగడం వల్ల మీ శ్లేష్మ పొర దెబ్బతింటుంది. అలాగే రోజంతా మీ జీర్ణక్రియ కూడా మందగిస్తుంది. అందుకే ఉదయాన్నే శీతల పానీయాలను తీసుకోకూడదని డాక్టర్లు చెబుతున్నారు.

  • సిట్రస్ పండ్లు:

పండ్లను సరైన సమయంలో తినడం ఆరోగ్యానికి ఎంతో మంచిది. అయితే సిట్రస్ పండ్లను మాత్రం ఖాళీ కడుపుతో అస్సలు తినకూడదు. ఒకవేళ తింటే మీ శరీరంలో యాసిడ్ ఉత్పత్తి పెరుగుతుంది. అంతేకాకుండా, పండ్లలో ఎక్కువ ఫైబర్, ఫ్రక్టోజ్ అధిక మోతాదులో ఉంటాయి.. వాటిని ఖాళీ కడుపుతో తింటే మీ జీర్ణవ్యవస్థ నెమ్మదిస్తుంది. అలాగే పీచు ఎక్కువగా ఉన్న జామ, నారింజ వంటి పండ్లను ఉదయాన్నే తినొద్దు.

  • పచ్చి కూరగాయలు:

పచ్చి కూరగాయలు లేదా సలాడ్‌ను ఖాళీ కడుపుతో తినడం అస్సలు ఉత్తమం కాదు. అవి ముతక ఫైబర్‌ నిండి ఉంటాయి, ఇవి ఖాళీ కడుపుతో తినడం వల్ల మీకు చాలా ఇబ్బంది కలుగుతుంది. కడుపు నొప్పి, అజీర్తి లాంటి సమస్యలు వస్తాయి.

  • కాఫీ:

అందరూ ఉదయాన్నే ఒక కప్పు కాఫీతో తమ రోజును ప్రారంభిస్తారు. నిద్ర నుంచి బయటపడటానికి ఇది సులభమైన మార్గం అనిపిస్తుంది. కానీ ఖాళీ కడుపుతో కాఫీ తాగడం ఎసిడిటీకి దారితీయవచ్చు. ఇది జీర్ణవ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపిస్తుంది. అలాగే కొంతమందిలో గ్యాస్ట్రిక్ సమస్యకు కారణమవుతుంది.

(నోట్‌: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణుల సలహాలు, సూచనల మేరకు అందించడం జరుగుతుంది. ఏవైనా సందేహాలు ఉంటే నిపుణులను సంప్రదించండి.)

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి