AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Health Tips: నిద్ర లేవగానే శరీరంలో నొప్పులు ఉన్నాయా..? ఇలా చేయండి

కొన్ని సమయాల్లో శరీరం అన్ని విధాలుగా సహకరించదు. ఎందుకంటే ఇప్పుడున్న బిజీ లైఫ్‌లో ప్రతి మనిషికి ఏదో ఒక అనారోగ్య సమస్య ఉంటుంది. ఉద్యోగాల్లో..

Health Tips: నిద్ర లేవగానే శరీరంలో నొప్పులు ఉన్నాయా..? ఇలా చేయండి
Health Tips
Subhash Goud
|

Updated on: Oct 14, 2022 | 6:00 PM

Share

కొన్ని సమయాల్లో శరీరం అన్ని విధాలుగా సహకరించదు. ఎందుకంటే ఇప్పుడున్న బిజీ లైఫ్‌లో ప్రతి మనిషికి ఏదో ఒక అనారోగ్య సమస్య ఉంటుంది. ఉద్యోగాల్లో అలసిపోవడం, ఎక్కువ శ్రమించినప్పుడు వివిధ అనారోగ్య సమస్యలు రావడం, అలాగే రోజంతా పనులు చేసి రాత్రి నిద్రించిన తర్వాత నిద్ర లేవగానే మెడ, శరీరంలో నొప్పులు వంటివి వస్తుంటాయి.  చాలా మందికి నిద్రలో లేదా నిద్ర నుండి లేచిన తర్వాత శరీరంలో నొప్పి వంటి సమస్యలు ఉంటాయి. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కొన్నిసార్లు ఆఫీసులో పని చేస్తున్నప్పుడు కూడా ఈ సమస్యలు వస్తుంటాయి. అయితే నిద్ర లేవగానే శరీరంలో నొప్పి ఎందుకు వస్తుందో తెలుసుకోండి.

నిద్ర తర్వాత శరీరంలో నొప్పికి కారణాలు:

నిద్ర తర్వాత శరీరంలో నొప్పికి అనేక కారణాలు ఉండవచ్చు అంటున్నారు వైద్య నిపుణులు. శారీరక బలహీనత, నిద్ర లేకపోవడం లేదా శారీరక శ్రమ లేకపోవడం వంటివి. కానీ శరీరంలో పోషకాహార లోపం దీనికి పెద్ద కారణమని చెబుతున్నారు.

నిద్ర నుండి లేచిన తర్వాత, శరీరంలో నొప్పి ఉంటే ఏం చేయాలి..?

నిద్రలోంచి లేచిన తర్వాత శరీరంలో ఏదైనా నొప్పి ఉంటే ఆహారానికి సంబంధించిన నియమాలు పాటించాలని సూచిస్తున్నారు నిపుణులు. పోషకాలు అధికంగా ఉండే ఆహారం తీసుకోవాలంటున్నారు. నిద్ర నుంచి లేచిన తర్వాత కూడా శరీరంలో నొప్పి ఉన్నట్లు అనిపిస్తే ఎక్కువ మొత్తంలో పోషకాలు ఉండే ఆహారాలను తీసుకోవాలని, ఇలా పోషకాలు అధికంగా ఉండే ఆహారాలనే భోజనంలో చేర్చుకుంటే ఎంతో మేలంటున్నారు. ఎందుకంటే ఇది మీ కండరాలు, ఎముకలు, జీర్ణక్రియ, శరీరంలో రక్తం లేకపోవడం వంటి సమస్యను తీరుస్తుంది. దీని కోసం మీరు మీ ఆహారంలో పాలు, పెరుగు, మజ్జిగ, సోయాబీన్స్, పప్పు చేర్చుకోవాలి.

ఇవి కూడా చదవండి

వ్యాయామం:

ప్రతిరోజూ నిద్రలేచిన తర్వాత మీరు తప్పనిసరిగా 30 నిమిషాలు వ్యాయామం చేయడానికి ప్రయత్నించండి. ముఖ్యంగా స్ట్రెచింగ్, యోగా, మార్నింగ్ వాక్ కూడా చేయవచ్చు.

వేడి నీళ్లతో స్నానం చేయండి:

వేడి నీటితో స్నానం చేయడం వల్ల అలసట తొలగిపోతుంది. దీని కారణంగా మీ కండరాలు ఉద్రిక్తత, వాపు నుండి ఉపశమనం పొందుతాయి. అంతే కాకుండా వేడి నీళ్లతో తలస్నానం చేస్తే రిఫ్రెష్ గా ఉండి నొప్పులు దూరమవుతాయి. ఇలా నొప్పులను తగ్గించుకునేందుకు ఇలాంటి జాగ్రత్తలు తీసుకుంటో ఏంతో మేలంటున్నారు నిపుణులు.

(నోట్‌: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణుల సలహాలు, సూచనల మేరకు అందించడం జరుగుతుంది. ఏవైనా సందేహాలు ఉంటే నిపుణులను సంప్రదించండి.)

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

వెజ్‌లో నాన్‌వెజ్‌ రుచి కావాలంటే..ఈ కూరగాయతో రెట్టింపు బలం,టేస్ట్
వెజ్‌లో నాన్‌వెజ్‌ రుచి కావాలంటే..ఈ కూరగాయతో రెట్టింపు బలం,టేస్ట్
ఎన్నో విమర్శలు వచ్చినా.. వాటిని సరిదిద్ధుకుంటాను.. లోకేష్
ఎన్నో విమర్శలు వచ్చినా.. వాటిని సరిదిద్ధుకుంటాను.. లోకేష్
బ్యాటర్లు వచ్చారు..వెళ్ళారు..అంతే..109 ఓవర్లకే 30 వికెట్లా?
బ్యాటర్లు వచ్చారు..వెళ్ళారు..అంతే..109 ఓవర్లకే 30 వికెట్లా?
రెండు కోట్లు లేవు అన్నవారికి 26 బంతుల్లోనే సమాధానం చెప్పాడు
రెండు కోట్లు లేవు అన్నవారికి 26 బంతుల్లోనే సమాధానం చెప్పాడు
క్రిస్మస్ పర్వదినాన కాలిఫోర్నియాను ముంచెత్తిన వరదలు
క్రిస్మస్ పర్వదినాన కాలిఫోర్నియాను ముంచెత్తిన వరదలు
సీన్ గురించి చెప్పాలని గదిలోకి అలా ప్రవర్తించాడు..
సీన్ గురించి చెప్పాలని గదిలోకి అలా ప్రవర్తించాడు..
ఈజీగా డబ్బులు వస్తాయనుకున్నాడు.. కానీ చివరకు ఇలా బలైపోయాడు..
ఈజీగా డబ్బులు వస్తాయనుకున్నాడు.. కానీ చివరకు ఇలా బలైపోయాడు..
శ్రేయస్ అయ్యర్ రిటర్న్ గిఫ్ట్.. నెట్స్‌లో బ్యాటింగ్ షురూ
శ్రేయస్ అయ్యర్ రిటర్న్ గిఫ్ట్.. నెట్స్‌లో బ్యాటింగ్ షురూ
చివరిశనివారం-ఈ పరిహారాలతో వచ్చే ఏడాది పొడవునా డబ్బుకు కొరత ఉండదు!
చివరిశనివారం-ఈ పరిహారాలతో వచ్చే ఏడాది పొడవునా డబ్బుకు కొరత ఉండదు!
అతడంటే పిచ్చి.. క్రష్ ఎవరో చెప్పిన కాజల్..
అతడంటే పిచ్చి.. క్రష్ ఎవరో చెప్పిన కాజల్..