Air Pollution: మహిళల వెన్ను విరుస్తున్న వాయు కాలుష్యం.. తాజా అధ్యయనంలో సంచలన విషయాలు..

| Edited By: Anil kumar poka

Feb 27, 2023 | 6:46 PM

వాయుకాలుష్యం పెరగడం వల్ల పోస్ట్ మోనోపాజ్ దశలో ఉన్న మహిళల ఎముకలు దెబ్బతింటాయని అమెరికన్ శాస్త్రవేత్తలు షాకింగ్ విషయాలను బయటపెట్టారు

Air Pollution: మహిళల వెన్ను విరుస్తున్న వాయు కాలుష్యం.. తాజా అధ్యయనంలో సంచలన విషయాలు..
Air pollution
Follow us on

వాయుకాలుష్యం పెరగడం వల్ల పోస్ట్ మోనోపాజ్ దశలో ఉన్న మహిళల ఎముకలు దెబ్బతింటాయని అమెరికన్ శాస్త్రవేత్తలు షాకింగ్ విషయాలను బయటపెట్టారు.కొలంబియా యూనివర్శిటీ యొక్క మెయిల్‌మన్ స్కూల్ ఆఫ్ పబ్లిక్ హెల్త్‌లోని బృందం నేతృత్వంలో పరిశోధనలో ప్రధానంగా వాయు కాలుష్యం, బోన్ డెన్సిటీ ప్రభావాలను అధ్యయనం చేసింది. ఈ అధ్యయనంలో కొన్ని షాకింగ్ విషయాలు బయటపడ్డాయి. ప్రత్యేకంగా మోనోపాజ్ దశలో ఉన్న మహిళల ఎముకలు బోలుగా మారుతున్నాయని, బోన్ డెన్సిటీ తగ్గి, బోలు ఎముకల వ్యాధి ప్రమాదం పెరుగుతోందని అన్నారు. ముఖ్యంగా వృద్ధాప్యంలోకి అడుగుపెడుతున్న మహిళల్లో బోన్ డెన్సిటీ తగ్గిన సమస్య ఎక్కువగా ఉందని గుర్తించారు.

ఈ అధ్యయనం ది లాన్సెట్ డిస్కవరీ సైన్స్ సూట్ ఆఫ్ ఓపెన్-యాక్సెస్ జర్నల్స్‌లోని పీర్-రివ్యూడ్ జర్నల్ క్లినికల్ మెడిసిన్‌లో ప్రచురించారు. రుతుక్రమం ఆగిపోయిన 1,61,808 మంది స్త్రీలపై ఈ అధ్యయనం చేశారు. ఉమెన్స్ హెల్త్ ఇనిషియేటివ్ ద్వారా సేకరించిన డేటాను శాస్త్రవేత్తల బృందం విశ్లేషించింది, మహిళల్లో చాలా మందిలో ఆస్టియోపోరోసిస్ వ్యాధి కనిపించిందన్నారు. వెన్నెముకపై ఎక్కువగా ఈ ప్రబావం చూపిందన్నారు. నైట్రస్ ఆక్సైడ్‌లు సాధారణంగా వృద్ధాప్యంలో కంటే రెండు రెట్లు ఎక్కువ హాని కలిగిస్తాయని అధ్యయనంలో తేలింది..

అధ్యయనంలో పాల్గొన్న మహిళల ఇంటి చిరునామా ఆధారంగా పరిశోధన చేశారు. వారు ఉండే ప్రదేశంలో వాయు కాలుష్యం (PM 10, NO, NO2, SO2) సాంద్రత ఆధారంగా అధ్యయనం చేశారు. శాస్త్రవేత్తలు అధ్యయనం ప్రారంభంలో బోన్ డెన్సిటీ (BMD; మొత్తం శరీరం, తుంటి, తొడ మెడ మరియు కటి వెన్నెముక)ని చెక్ చేశారు. ఒక సంవత్సరం, మూడు సంవత్సరాలు, ఆరు సంవత్సరాల తర్వాత మళ్లీ ఈ పరీక్ష చేశారు.

ఇవి కూడా చదవండి

అయితే నైట్రోజన్ ఆక్సైడ్లు ముఖ్యంగా కటి వెన్నెముకలో ఎముకలు దెబ్బతినడానికి ప్రధాన కారణం అయ్యిందని కనుగొన్నారు. .కొలంబియా మెయిల్‌మాన్ స్కూల్ ఆఫ్ పబ్లిక్ హెల్త్‌లోని ఎన్విరాన్‌మెంటల్ హెల్త్ సైన్సెస్ విభాగంలో అసోసియేట్ రీసెర్చ్ సైంటిస్ట్ రచయిత డిడ్డియర్ ప్రాడా ప్రకారం, గాలి నాణ్యత ఎముక నష్టానికి ప్రమాద కారకంగా మారిందని పరిశోధనలు నిర్ధారించాయని తెలిపారు.

“మొదటిసారిగా, నైట్రోజన్ ఆక్సైడ్లు,, ఎముకలు దెబ్బతినడానికి ప్రధాన కారణమని తేలిందని, వెన్నెముక భాగం ఈ నష్టానికి ఎక్కువగా గురయ్యే ప్రదేశాలలో ఒకటి అని తేలినట్లు గుర్తించామని ” అని డిడియర్ ప్రాడా చెప్పారు. నైట్రస్ ఆక్సైడ్ ఎక్కువగా కార్లు,ఎరువుల పరిశ్రమలు, విద్యుత్ శక్తి ఉత్పత్తి ప్లాంట్ల నుండి వెలువడుతాయని, అధ్యయన బృందం తెలిపింది.

మరిన్ని హెల్త్ ఆర్టికల్స్ కోసం క్లిక్ చేయండి..