Home Remedies: చలికాలంలో జలుబు, దగ్గు నుంచి ఉపశమనం కోసం ఈ 4 వంటింటి చిట్కాలు .. దివ్య ఔషధాలు

|

Dec 11, 2022 | 9:28 AM

మీ వంటగది మీకు అద్భుతమైన అనుభూతిని కలిగించే కొన్ని అద్భుతమైన ఆహారాల ఔషధాల పెట్టె.  సీజనల్ వ్యాధులైన దగ్గు, జలుబు నుంచి ఉపశమనం కోసం మందులతో పాటు..కొన్ని ఇంటి నివారణల చిట్కాలను సూచించారు .

Home Remedies: చలికాలంలో జలుబు, దగ్గు నుంచి ఉపశమనం కోసం ఈ 4 వంటింటి చిట్కాలు .. దివ్య ఔషధాలు
Home Remedies To Prevent Cold And Cough In Winter
Follow us on

శీతాకాలంలో వాతావరణంలో వచ్చే మార్పులు ఆహారపు అలవాట్లలో వచ్చిన మార్పులతో సీజనల్ వ్యాధుల బారిన పడతాడు. సాధారణ ఇన్ఫెక్షన్‌లైన  జలుబు, దగ్గు, జ్వరం బారిన పడి తీవ్ర ఇబ్బందులను పడతాడు. వీటికి చికిత్స తీసుకున్నా..  మందులు  పని చేయడానికి కొంత సమయం పడుతుంది. జలుబు, దగ్గు, జ్వరం వంటి లక్షణాలతో పనిచేయడం చాలా కష్టం. అయితే దగ్గు, జలుబులనుంచి ఉపశమనం లభించకపోతే.. అలసట, మగత, శరీరం నొప్పులు, జ్వరం, తలనొప్పి , ముక్కు దిబ్బడ, బొంగురు గొంతు వంటి లక్షణాలతో తీవ్ర ఇబ్బందులు పడవచ్చు. అయితే చలికాలంలో ఇలాంటి సీజనల్ వ్యాధుల బారిన పడి ఎవరైనా ఇబ్బంది పడుతుంటే.. ఉపశమనం కోసం వంటిల్లే ఒక దివ్య ఔషధ శాలగా పనిచేస్తుంది.

ఇదే విషయాన్ని ప్రముఖ డైటీషియన్ తన్వీ తుత్లానీ తన ఇన్‌స్టాగ్రామ్ పేజీ ద్వారా తెలియజేశారు. మీ వంటగది మీకు అద్భుతమైన అనుభూతిని కలిగించే కొన్ని అద్భుతమైన ఆహారాల ఔషధాల పెట్టె.  సీజనల్ వ్యాధులైన దగ్గు, జలుబు నుంచి ఉపశమనం కోసం మందులతో పాటు..కొన్ని ఇంటి నివారణల చిట్కాలను సూచించారు . ఈ ఆహారాలు సహజంగా జలుబు, దగ్గును నివారించడానికి కూడా సహాయపడతాయి.

ఇవి కూడా చదవండి

జలుబు, దగ్గును నివారించడానికి  4 హోం రెమెడీస్..

1. విటమిన్ సి-రిచ్ ఫుడ్స్:

రోగనిరోధక శక్తి కోసం విటమిన్ సీ అధికంగా ఉన్న సిట్రస్ పండ్లను మధ్యాహ్న భోజనంలో తీసుకోవాలని డైటీషియన్ సూచించారు.   విటమిన్ సి రోగనిరోధక శక్తిని పెంచుతుంది. సిట్రస్ పండ్లలో పోషకాలు పుష్కలంగా ఉంటాయి.

2. జింజర్ వాటర్:

అల్లం శక్తివంతమైన యాంటీబయాటిక్, యాంటీ బాక్టీరియల్ లక్షణాలకు ప్రసిద్ధి చెందింది. అందుకే మనలో చాలా మంది తమ  గొంతుకు ఉపశమనం కలగడం కోసం టీలో అల్లం కలుపుకుని తాగుతారు. కెఫిన్ ఎక్కువగా తీసుకోకుండా..  గోరువెచ్చని అల్లం నీటిని తయారు చేసి రోజంతా అప్పుడప్పుడు తాగండి.

3. వెల్లుల్లి సూప్:

ఒక వెచ్చని సూప్ శరీరాన్ని తక్షణమే వేడెక్కించేలా చేస్తుంది. అంతేకాదు అనారోగ్య సమయంలో వెల్లుల్లి సూప్ మంచి ఉపశమనం.  చలికాలంలో తీసుకునే చికెన్ లేదా వెజిటబుల్ సూప్ ఏదైనా సరే..  మసాలా దినుసులతో పాటు సీజనల్ వ్యాధుల నుంచి ఉపశమనం కోసం వెల్లుల్లి, అల్లంను జోడించాలి.

4. పసుపు పాలు

పసుపు పాలను గురించి పెద్దగా పరిచయం అవసరం లేదు. పసుపు పాలు అద్భుతమైన ఆరోగ్య-ప్రయోజనాలను కలిగి ఉన్నాయి. పసుపు పాలు భారతదేశంలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా కూడా ప్రసిద్ధి చెందాయి. పసుపులో ఉండే యాంటీ బాక్టీరియల్, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు గోరువెచ్చని పాలతో కలిపి సీజనల్ ఇన్ఫెక్షన్ల నుండి చాలా ఉపశమనాన్ని అందిస్తాయి. ఒక కప్పు గోరువెచ్చని పాలలో చిటికెడు పసుపు వేసి తాగితే ఆరోగ్యం బాగుంటుంది.

ఈ ఇంటి చిట్కాలు జలుబు , దగ్గు నుండి త్వరగా కోలుకోవడానికి ఖచ్చితంగా సహాయపడతాయి. అంతేకాదు ఇన్ఫెక్షన్లను నివారించడంలో అద్భుతాలు చేస్తాయి.

మరిన్ని హెల్త్ వార్తల కోసం చూడండి..

(ఇక్కడ ఇచ్చిన సమాచారం సాధారణ పాఠకుల ఆసక్తిని దృష్టిలో ఉంచుకుని ఇచ్చింది. ఈ వ్యాసంలో ఇచ్చిన సమాచారం నిపుణుల వ్యక్తిగత అభిప్రాయాలు. ఈ కథనంలోని ఏదైనా సమాచారం ఖచ్చితత్వం, సంపూర్ణత, అనుకూలతకు టీవీ 9 తెలుగు బాధ్యత వహించదు. వైద్యుల సలహాలను , సూచనలు తీసుకుని పాటించాల్సి ఉంటుంది. )