Winter: చలికాలంలో చెవి ఇన్ఫెక్షన్లు ఎందుకు వేధిస్తాయి.? ఏం చేయాలి.?

సహజంగానే చల్లని వాతావరణం బ్యాక్టీరియా, వైరస్‌లు వృద్ధి చెందడానికి కారణంగా మారుతుంది. ఇక చెవి వాపు రావడానికి ప్రధాన కారణాల్లో బ్యాక్టీరియా లేదా వైరస్‌లు ప్రధానమైనవి. అంతేకాకుండా చలికాలంలో బలహీనమైన రోగనిరోధక శక్తి కారణంగా కూడా ఇలాంటి ఇన్ఫెక్షన్లు పెరిగే అవకాశం ఉంటుంది. నిపుణుల అభిప్రాయం ప్రకారం.. సైనసైటిస్‌ సమస్య కారణంగా కూడా చెవి ఇన్ఫెక్షన్లు పెరుగుతాయి...

Winter: చలికాలంలో చెవి ఇన్ఫెక్షన్లు ఎందుకు వేధిస్తాయి.? ఏం చేయాలి.?
Ear Infection

Updated on: Dec 18, 2023 | 2:30 PM

చలి తీవ్రత రోజురోజుకీ పెరిగిపోతోంది. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ చలి పులి పంజా విసురుతోంది. చలి తీవ్రత కారణంగా సీజన్‌ వ్యాధులు సైతం పెరుగుతున్నాయి. ఇక చలికాలం సహజంగా వచ్చే సమస్యల్లో చెవి సంబంధిత ఇన్ఫెక్షన్‌ల ప్రమాదం పెరుగుతుంది. చలికాలం చెవి లోపల, వెలుపల ఇన్ఫెక్షన్లు ఎక్కువతుంటాయి. బ్యాక్టీరియా లేదా వైరస్‌ల కారణంగా చెవి వాపు వస్తుంది. చలికాలంలో చెవిలో ఇన్ఫెక్షన్‌ సోకి చాలా మంది రోగులు వైద్యం కోసం వస్తున్నారని వైద్యులు చెబుతున్నారు.

సహజంగానే చల్లని వాతావరణం బ్యాక్టీరియా, వైరస్‌లు వృద్ధి చెందడానికి కారణంగా మారుతుంది. ఇక చెవి వాపు రావడానికి ప్రధాన కారణాల్లో బ్యాక్టీరియా లేదా వైరస్‌లు ప్రధానమైనవి. అంతేకాకుండా చలికాలంలో బలహీనమైన రోగనిరోధక శక్తి కారణంగా కూడా ఇలాంటి ఇన్ఫెక్షన్లు పెరిగే అవకాశం ఉంటుంది. నిపుణుల అభిప్రాయం ప్రకారం.. సైనసైటిస్‌ సమస్య కారణంగా కూడా చెవి ఇన్ఫెక్షన్లు పెరుగుతాయి. సైనసైటిస్‌కు సరైన సమయంలో చికిత్స అందించకపోతే ఇన్ఫెక్షన్‌ చెవులకు వ్యాపిస్తుందని నిపుణులు చెబుతున్నారు.

చలికాలంలో చెవులు విపరీతంగా పొడిబారడం, ఎలర్జీ రినైటిస్ కారణంగా చెవి ఇన్ఫెక్షన్స్‌తో బాధపడుతుంటారు. చల్లని వాతావరణం కూడా చెవి నొప్పికి కారణమవుతుంది. చలి కారణంగా రక్త ప్రసరణ తగ్గడం వల్ల చెవి ఇన్ఫెక్షన్లు పెరుగుతాయి. చెవి ఇన్ఫెక్షన్, చెవి నొప్పి, తల తిరగడం, తలనొప్పి, సున్నితత్వం, వాపు వంటివి చెవి ఇన్ఫెక్షన్ల లక్షణాలుగా చెబుతున్నారు. బహిరంగ ప్రదేశాల్లో చల్లిని గాలికి ఎక్స్‌పోజ్‌ అయిన సమయంలో కూడా చెవి నొప్పి తీవ్రంగా మారుతుంది.

చెవి నొప్పి ప్రారంభ దశలోనే చికిత్స చేయించుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. వెంటనే ఇయర్ డ్రాప్స్ వాడడంతో పాటు డాక్టర్లను సంప్రదించాలి. వైద్యుల సూచన మేరకు యాంటీబయాటిక్స్, యాంటిహిస్టామైన్లు, నొప్పి నివారణ మాత్రలను వాడాలి. ఇక ఇన్ఫెక్షన్ల కారణంగా చెవి నొప్పి వేధిస్తుంటే.. ఐస్ ప్యాక్ లేదా వెచ్చని కంప్రెస్ వంటి హీటింగ్ ప్యాడ్‌ వంటి వాటిని ఉపయోగించాలి. చెవుల్లో నీరు చేరకుండా చూసుకోవాలి. చెవ్వుల్లోకి గాలి పోకుండా క్యాప్ లేదా ఏదైనా వస్త్రాన్ని ధరించాలి. చెవులు నిత్యం వేడిగా ఉండేలా చూసుకోవాలి.

నోట్‌: పైన తెలిపిన విషయాలు కేవలం ప్రాథమిక సమాచారం మేరకు అందించినవి మాత్రమే. ఆరోగ్యం విషయంలో వైద్యుల సూచనలు పాటించడమే ఉత్తమం.

మరిన్ని హెల్త్ ఆర్టికల్స్ కోసం క్లిక్ చేయండి..