AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

చేపలు తిన్న వెంటనే పాలు తాగితే ఈ వ్యాధి వస్తుందా? వైద్యులు చెప్పే నిజాలు

White Patches on Skin: చర్మంపై తెల్లటి మచ్చలు ఏర్పడి క్రమంగా శరీరంలోని ఇతర భాగాలకు వ్యాపించే వ్యాధినే బొల్లి లేదా విటిలిగో అంటారు. ఆటోఇమ్యూన్ సమస్యలు, జన్యుపరమైన ప్రభావం, మానసిక ఒత్తిడి, పర్యావరణ కారణాలు వంటి అనేక అంశాలు దీనికి కారణమవుతాయని వైద్యులు చెబుతున్నారు. అయితే బొల్లి అంటువ్యాధి కాదని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. సరైన అవగాహన, సమయానికి చికిత్సతో ఈ వ్యాధిని సమర్థంగా నియంత్రించవచ్చని సూచిస్తున్నారు..

చేపలు తిన్న వెంటనే పాలు తాగితే ఈ వ్యాధి వస్తుందా? వైద్యులు చెప్పే నిజాలు
Vitiligo Skin Conditions
Srilakshmi C
|

Updated on: Jun 28, 2026 | 2:19 PM

Share

చర్మంపై తెల్లటి మచ్చలు కనిపించడం ప్రారంభమై, క్రమంగా శరీరంలోని ఇతర భాగాలకు వ్యాపించే పరిస్థితిని బొల్లి వ్యాధి (విటిలిగో) అంటారు. ఇది ముఖం, కళ్ల చుట్టూ, పెదవుల పరిసరాలు, చేతులు, వేళ్లు, మోచేతులు, మోకాళ్లు, పాదాలు, జననేంద్రియాల ప్రాంతాల్లో ఎక్కువగా కనిపిస్తుంది. ప్రపంచవ్యాప్తంగా జనాభాలో సుమారు 0.5 నుంచి 2 శాతం మంది ఈ వ్యాధితో బాధపడుతున్నట్లు అంచనాలు సూచిస్తున్నాయి. పురుషులతో పోలిస్తే మహిళల్లో ఇది కాస్త ఎక్కువగా కనిపిస్తుందని వైద్య నిపుణులు చెబుతున్నారు. బొల్లి ఏ వయస్సులోనైనా రావచ్చు. చిన్న పిల్లల నుంచి వృద్ధుల వరకు ఎవరినైనా ప్రభావితం చేసే అవకాశం ఉంది. అయితే ఈ వ్యాధికి ఒకే ఒక్క ఖచ్చితమైన కారణం ఉందని ఇప్పటివరకు నిర్ధారణ కాలేదు. పలు జీవశాస్త్ర, జన్యు, పర్యావరణ అంశాలు కలిసి దీనికి కారణమవుతాయని భావిస్తున్నారు. సంగీత ప్రపంచాన్ని ఉర్రూతలూగించిన ప్రముఖ పాప్ సింగర్ మైఖెల్ జాక్సన్ కూడా విటిలిగో వ్యాధి బాధితుడే. ఈ వ్యాధిని కప్పి పుచ్చుకోవడానికి ఆయన ఎప్పుడూ అధిక మేకప్ తో కనిపించేవాడు.

బొల్లి వ్యాధి ఎందుకు వస్తుంది?

  • ఆటో ఇమ్యూన్ సమస్యలు: మన శరీరంలోని రోగనిరోధక వ్యవస్థ పొరపాటున చర్మానికి రంగును ఇచ్చే మెలనోసైట్స్ కణాలను శత్రువులుగా గుర్తించి నాశనం చేయడం వల్ల విటిలిగో వచ్చే అవకాశం ఉందని వైద్యులు భావిస్తున్నారు.
  • జన్యుపరమైన ప్రభావం: కుటుంబంలో ఎవరికైనా బొల్లి ఉంటే, ఇతర కుటుంబ సభ్యులకు కూడా ఈ వ్యాధి వచ్చే అవకాశం కొంత ఎక్కువగా ఉంటుంది.
  • మానసిక ఒత్తిడి: అధిక ఒత్తిడి, ఆందోళన, భావోద్వేగ సంఘటనలు కొందరిలో బొల్లి ప్రారంభం కావడానికి లేదా వేగంగా వ్యాపించడానికి కారణమవుతాయి.
  • నాడీ సంబంధిత కారణాలు: కొన్ని నాడీ రసాయనాలు మెలనోసైట్స్‌పై ప్రతికూల ప్రభావం చూపి చర్మంలో రంగు కోల్పోయే పరిస్థితిని ప్రేరేపించవచ్చని పరిశోధనలు సూచిస్తున్నాయి.
  • ఆక్సిడేటివ్ ఒత్తిడి: శరీరంలో ఫ్రీ రాడికల్స్ అధికంగా ఉత్పత్తి కావడం వల్ల మెలనోసైట్స్ దెబ్బతిని తెల్లటి మచ్చలు ఏర్పడే అవకాశం ఉంటుంది.
  • పర్యావరణ ప్రభావాలు: చర్మ గాయాలు, కాలిన గాయాలు, కొన్ని రకాల రసాయనాల ప్రభావం, అధిక సూర్యరశ్మి, చర్మంపై పదేపదే రాపిడి వంటి అంశాలు కూడా బొల్లి వ్యాధిని ప్రేరేపించవచ్చు.
  • ఇతర వ్యాధులతో సంబంధం: థైరాయిడ్ సమస్యలు, టైప్-1 మధుమేహం, రుమటాయిడ్ ఆర్థరైటిస్ వంటి ఆటో ఇమ్యూన్ వ్యాధులతో బొల్లికి సంబంధం ఉండొచ్చని నిపుణులు చెబుతున్నారు.

బొల్లి వ్యాధిపై ఉన్న అపోహలు

అపోహ 1: బొల్లి అంటువ్యాధి

ఇది పూర్తిగా తప్పు. బొల్లి ఒకరి నుంచి మరొకరికి స్పర్శ ద్వారా, కలిసి భోజనం చేయడం ద్వారా, బట్టలు పంచుకోవడం ద్వారా లేదా రక్తం ద్వారా వ్యాపించదు.

అపోహ 2: ఇది పూర్వజన్మ కర్మ ఫలం

బొల్లి ఒక వైద్యపరమైన చర్మవ్యాధి మాత్రమే. దీనికి పూర్వజన్మ, శాపాలు లేదా మూఢనమ్మకాలతో ఎలాంటి సంబంధం లేదు.

ఇవి కూడా చదవండి

అపోహ 3: చేపలు తిన్న తర్వాత పాలు తాగితే బొల్లి వస్తుంది

ఈ నమ్మకానికి ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవు. చేపలు, పాలు కలిసి తీసుకోవడం వల్ల బొల్లి వస్తుందని నిరూపించే పరిశోధనలు లేవు.

అపోహ 4: బొల్లి ప్రాణాంతక వ్యాధి

బొల్లి క్యాన్సర్ కాదు. ఇది ప్రాణాలకు ముప్పు కలిగించదు. శరీరంలోని ఇతర అవయవాలకు నేరుగా హాని చేయదు.

చికిత్సతో సాధారణ జీవితం సాధ్యం

బొల్లి వ్యాధి ఉన్నవారు సామాజిక వివక్ష, అపోహలు, మానసిక ఒత్తిడికి గురికాకుండా వైద్యుల సూచనల మేరకు చికిత్స తీసుకుంటే సాధారణ జీవితం గడపవచ్చు. ఆధునిక వైద్యంలో మందులు, ఫోటోథెరపీ, ఇతర చికిత్సా విధానాల ద్వారా వ్యాధిని నియంత్రించే అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే.. బొల్లి అంటువ్యాధి కాదు. ఇది ఎవరి తప్పూ కాదు. సరైన అవగాహన, సమయానికి చికిత్స, కుటుంబ సభ్యుల మద్దతు ఉంటే ఈ వ్యాధిని సమర్థంగా ఎదుర్కోవచ్చు.

FAQs

ప్రశ్న: బొల్లి వ్యాధి అంటే ఏంటి?

సమాధానం: మన చర్మం రంగు మెలనిన్ అనే పిగ్మెంట్‌పై ఆధారపడి ఉంటుంది. ఈ మెలనిన్‌ను ఉత్పత్తి చేసే కణాలను మెలనోసైట్స్ అంటారు. కొన్ని కారణాల వల్ల ఈ కణాలు చనిపోయినపుడు లేదా పనిచేయడం ఆపినప్పుడు చర్మంపై తెల్లటి మచ్చలు ఏర్పడతాయి. ఈ పరిస్థితినే బొల్లి వ్యాధి లేదా విటిలిగో అంటారు.

ప్రశ్న: బొల్లి వ్యాధి లక్షణాలు ఏమిటి?

సమాధానం: తల వెంట్రుకలు తెల్లబడటం, కనుబొమ్మలు, గడ్డం వెంట్రుకలు తెల్లబడటం, నోటి లోపలి భాగం తెలుపు రంగులోకి మారడం జరుగుతుంది.

ప్రశ్న: బొల్లి వ్యాధి వల్ల క్యాన్సర్ వస్తుందా?

సమాధానం: బొల్లి (విటిలిగో) వచ్చిన ప్రాంతంలో సాధారణంగా నొప్పిగానీ, దురద గానీ ఉండదు. అయితే కొందరిలో ప్రారంభ దశలో స్వల్పంగా దురద ఉంటుంది.

ప్రశ్న: వ్యాధి నిర్ధరణ ఎలా చేస్తారు? చికిత్స ఏంటి?

సమాధానం: వుడ్ ల్యాంప్ పరీక్ష, చర్మ బయాప్సీ చేసి బొల్లి వ్యాధి నిర్ధారణ చేస్తారు.

ప్రశ్న: బొల్లి వ్యాధికి (విటిలిగో) చికిత్స ఉందా?

సమాధానం: బొల్లి వ్యాధికి ప్రస్తుతం స్టెరాయిడ్ క్రీములు, కాల్సిన్యూరిన్ ఇన్హిబిటర్లు వంటి మందులు ఉపయోగిస్తారు. అలాగే న్యారో బ్యాండ్ అల్ట్రావయొలెట్-బి (NB-UVB) అనే ఫోటోథెరపి చికిత్స కూడా అందుబాటులో ఉంది. ఈ చికిత్స ద్వారా మెలనోసైట్స్ తిరిగి పనిచేసేలా ప్రేరేపిస్తారు. దీంతో చర్మం రంగు సాధారణ స్థితికి చేరుకుంది. మెలనోసైట్ ట్రాన్స్‌ప్లాంటేషన్, స్కిన్ గ్రాఫ్టింగ్ వంటి విధానాలు కూడా చికిత్సలో ఉపయోగించవచ్చు. అయితే ఈ చికిత్స కొన్ని నెలల నుంచి ఏళ్ల వరకు ఉంటుంది. సుదీర్ఘకాలం వైద్యం తీసుకోవాల్సి వస్తుంది.

Follow Us
చేపలు తిన్న వెంటనే పాలు తాగితే ఈ వ్యాధి వస్తుందా?
చేపలు తిన్న వెంటనే పాలు తాగితే ఈ వ్యాధి వస్తుందా?
ప్రతి పది నిమిషాలకు ఒక అద్భుతమైన విజువల్
ప్రతి పది నిమిషాలకు ఒక అద్భుతమైన విజువల్
జుట్టు విపరీతంగా రాలిపోతుందా.. ఈ ఇంటి చిట్కాలు పాటిస్తే ఒత్తుగా..
జుట్టు విపరీతంగా రాలిపోతుందా.. ఈ ఇంటి చిట్కాలు పాటిస్తే ఒత్తుగా..
కావ్య- అనిరుధ్‌ పెళ్లి.. ఆసక్తికర విషయం చెప్పిన ఫ్యామిలీ మెంబర్
కావ్య- అనిరుధ్‌ పెళ్లి.. ఆసక్తికర విషయం చెప్పిన ఫ్యామిలీ మెంబర్
కన్యత్వపొర చిరిగిపోతే బాధితురాలిని తప్పుబట్టలేం..
కన్యత్వపొర చిరిగిపోతే బాధితురాలిని తప్పుబట్టలేం..
రాత్రి వేళల్లో బాత్‌రూమ్ తలుపులు తెరిచి పెడుతున్నారా? కష్టాలు
రాత్రి వేళల్లో బాత్‌రూమ్ తలుపులు తెరిచి పెడుతున్నారా? కష్టాలు
టూత్‌పేస్ట్, బేకింగ్ సోడాతో మీ పాత ఆభరణాలకు కొత్త మెరుపు
టూత్‌పేస్ట్, బేకింగ్ సోడాతో మీ పాత ఆభరణాలకు కొత్త మెరుపు
తెలంగాణలో చుక్కలు చూపిస్తున్న కోడిగుడ్డు ధరలు.. రూ. 8 మార్కు దాటి
తెలంగాణలో చుక్కలు చూపిస్తున్న కోడిగుడ్డు ధరలు.. రూ. 8 మార్కు దాటి
బొద్దింకను చూసి అమ్మాయిలు ఎందుకు భయపడతారు..?
బొద్దింకను చూసి అమ్మాయిలు ఎందుకు భయపడతారు..?
ఇండియన్ ఎయిర్‌ఫోర్స్‌లో అగ్నివీర్ వాయు ఉద్యోగాలు.. పూర్తి వివరాలు
ఇండియన్ ఎయిర్‌ఫోర్స్‌లో అగ్నివీర్ వాయు ఉద్యోగాలు.. పూర్తి వివరాలు