AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Numerology: ఈ తేదీల్లో పుట్టిన పిల్లలకు మొండితనం, పట్టుదల ఎక్కువేనట..!

సంఖ్యా శాస్త్రం ప్రకారం పుట్టిన తేదీ ఆధారంగా లెక్కించే మూలాంకం వ్యక్తి స్వభావంపై ప్రభావం చూపుతుందని నమ్ముతారు. ముఖ్యంగా మూలాంకం 1, 3, 9కు చెందిన పిల్లలు తమకు నచ్చిన విషయాన్ని సాధించే వరకు పట్టువదలకుండా ఉండవచ్చని చెబుతారు. వీరిలో కనిపించే పట్టుదల కొన్నిసార్లు మొండితనంగా అనిపించవచ్చు. ఈ మూలాంకాలు కలిగిన పిల్లల స్వభావం, వ్యక్తిత్వ లక్షణాలు ఎలా ఉంటాయో తెలుసుకుందాం.

Numerology: ఈ తేదీల్లో పుట్టిన పిల్లలకు మొండితనం, పట్టుదల ఎక్కువేనట..!
Numerology
Janardhan Veluru
|

Updated on: Sep 21, 2026 | 6:59 PM

Share

ప్రతి పిల్లాడి స్వభావం ఒకేలా ఉండదు. కొందరు చాలా సున్నితంగా ఉంటే.. మరికొందరు తమకు నచ్చిన విషయాన్ని సాధించే వరకు పట్టువదలరు. తల్లిదండ్రులు చెప్పిన మాట వినకుండా మొండిగా ప్రవర్తించే పిల్లలను కూడా మనం చూస్తుంటాం. సంఖ్యాశాస్త్రం ప్రకారం పిల్లల పుట్టిన తేదీ ఆధారంగా లెక్కించే మూలాంకం వారి స్వభావంపై కొంత ప్రభావం చూపుతుందని నమ్ముతారు. ఈ నేపథ్యంలో కొన్ని మూలాంకాలకు చెందిన పిల్లల్లో పట్టుదల, తమ మాటను నెగ్గించుకోవాలనే మొండితనం ఎక్కువగా కనిపించవచ్చని సంఖ్యాశాస్త్రం చెబుతోంది. ముఖ్యంగా మూలాంకం 1, 3, 9 ఉన్న పిల్లల గురించి ఈ విధంగా చెబుతున్నారు.

మూలాంకం 1

ఏదైనా నెలలో 1, 10 లేదా 19 తేదీల్లో జన్మించిన పిల్లలకు మూలాంకం 1 వస్తుంది. సంఖ్యాశాస్త్రంలో ఈ సంఖ్యకు సూర్యుడిని అధిపతిగా చెబుతారు. ఈ మూలాంకం పిల్లల్లో చిన్నప్పటి నుంచే నాయకత్వ లక్షణాలు కనిపిస్తాయి. తమకు నచ్చిన విషయాన్ని సాధించాలనే పట్టుదల వీరిలో ఎక్కువగా ఉండవచ్చని చెబుతారు. ఎవరి మాటకైనా వెంటనే తలొగ్గకుండా తమ అభిప్రాయానికే ప్రాధాన్యత ఇవ్వాలని చూస్తారట. అయితే ఇదే పట్టుదల సరైన దిశలో ఉపయోగపడితే లక్ష్యాలను సాధించడంలో సహాయపడుతుంది. కొన్ని సందర్భాల్లో తల్లిదండ్రుల సూచనలను పట్టించుకోకుండా మొండిగా వ్యవహరించడం ఇబ్బందులకు దారితీసే ప్రమాదముంది.

మూలాంకం 3

ఏదైనా నెలలో 3, 12 లేదా 21 తేదీల్లో పుట్టిన పిల్లల మూలాంకం 3. ఈ సంఖ్యకు గురు గ్రహాన్ని అధిపతిగా పరిగణిస్తారు. సంఖ్యాశాస్త్రం మేరకు మూలాంకం 3 పిల్లలు తెలివిగా, కష్టపడి పనిచేసే స్వభావం కలిగి ఉంటారు. ఒకసారి ఏదైనా లక్ష్యంగా నిర్ణయించుకుంటే దాన్ని పూర్తి చేయడానికి ప్రయత్నిస్తారు. తమకు కావాల్సిన విషయాన్ని తల్లిదండ్రులను ఒప్పించి సాధించుకోవడంలో కూడా వీరు ముందుంటారు. వీరి పట్టుదల సానుకూల దిశలో ఉంటే భవిష్యత్తులో లక్ష్యసాధనకు ఉపయోగపడుతుంది.

ఇవి కూడా చదవండి

మూలాంకం 9

ఏదైనా నెలలో 9, 18 లేదా 27 తేదీల్లో జన్మించిన పిల్లలకు మూలాంకం 9 వస్తుంది. ఈ సంఖ్యకు అంగారకుడు లేదా కుజుడిని అధిపతిగా చెబుతారు. మూలాంకం 9 పిల్లలు ఉత్సాహంగా, శక్తివంతంగా ఉంటారని, తాము అనుకున్నది సాధించాలనే పట్టుదల ఎక్కువగా ఉంటుందని సంఖ్యా శాస్త్రం చెబుతోంది. కొన్నిసార్లు తొందరగా కోపం రావడం, ఆలోచించకుండా నిర్ణయాలు తీసుకోవడం వంటి లక్షణాలు కనిపించే అవకాశముంది. తమ తప్పు తెలిసినా వెంటనే వెనక్కి తగ్గకపోవడం లేదా క్షమాపణ చెప్పడానికి ఇష్టపడకపోవడం వంటి స్వభావం ఉంటుంది.

సంఖ్యా శాస్త్రాన్ని నమ్మే వారు పిల్లలలో కనిపించే పట్టుదల, మొండితనాన్ని సానుకూలంగా మలిచేందుకు ప్రయత్నించారు. మొండితనాన్ని అణచివేయడం కంటే వారి మాటను ఓపికగా విని, సరైన కారణాలను వివరించి, నిర్ణయాలు తీసుకోవడంలో మార్గనిర్దేశం చేయడం ఉపయోగకరంగా ఉంటుంది.

(గమనిక: ఈ కథనంలోని సంఖ్యా శాస్త్రానికి సంబంధించిన అంశాలు నమ్మకాలపై ఆధారపడినవి. వీటిని శాస్త్రీయంగా నిరూపితమైన వాస్తవాలుగా పరిగణించకూడదు)

Follow Us