AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Savita Punia: భారత మహిళా హాకీ చరిత్రలో కొత్త మైలురాయి.. రికార్డు సృష్టించిన గోల్‌కీపర్ సవిత పూనియా

Asian Games 2026: భారత మహిళా హాకీ గోల్‌కీపర్ సవిత పూనియా సరికొత్త చరిత్ర సృష్టించారు. ఇండోనేషియాతో జరిగిన మ్యాచ్‌లో 321వ అంతర్జాతీయ మ్యాచ్ ఆడి, వందనా కటారియా పేరిట ఉన్న 320 మ్యాచ్‌ల రికార్డును అధిగమించారు. ఈ మ్యాచ్‌లో భారత్ 17-1తో ఘన విజయం సాధించింది. ఏషియన్ గేమ్స్‌లో భారత జట్టు వరుస విజయాలతో దూసుకెళ్తోంది.

Savita Punia: భారత మహిళా హాకీ చరిత్రలో కొత్త మైలురాయి.. రికార్డు సృష్టించిన గోల్‌కీపర్ సవిత పూనియా
Savita Punia
Rakesh
|

Updated on: Sep 21, 2026 | 7:05 PM

Share

Savita Punia: భారతీయ మహిళా హాకీ రంగంలో మరో అద్భుతమైన అధ్యాయం మొదలైంది. దేశం తరఫున అత్యధిక అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడిన మహిళా హాకీ క్రీడాకారిణిగా గోల్‌కీపర్ సవిత పూనియా (Savita Punia) సరికొత్త చరిత్ర సృష్టించారు. ప్రస్తుతం జరుగుతున్న ఏషియన్ గేమ్స్‌లో భాగంగా ఇండోనేషియా జట్టుతో జరిగిన మ్యాచ్‌లో బరిలోకి దిగడం ద్వారా ఆమె ఈ అరుదైన మైలురాయిని అందుకున్నారు. సవిత పూనియా తన కెరీర్‌లో మొత్తం 321 అంతర్జాతీయ మ్యాచ్‌లను పూర్తి చేసుకుని, ఇప్పటివరకు ఈ రికార్డును కలిగి ఉన్న మరో స్టార్ ప్లేయర్ వందనా కటారియాను వెనక్కి నెట్టారు. ఈ చారిత్రాత్మక విజయంతో ఆమె పేరు ఇప్పుడు దేశవ్యాప్తంగా మార్మోగుతోంది.

వందనా కటారియా రికార్డు బ్రేక్

ఇంతకుముందు భారత మహిళా హాకీ జట్టు తరఫున అత్యధికంగా 320 అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడిన రికార్డు వందనా కటారియా పేరిట ఉండేది. ఉజ్బెకిస్తాన్‌తో జరిగిన గత మ్యాచ్‌లో వందనా రికార్డును సమం చేసిన సవిత, తాజాగా ఇండోనేషియాతో జరిగిన మ్యాచ్‌లో మైదానంలో అడుగుపెట్టడం ద్వారా దానిని పూర్తిగా తన ఖాతాలో వేసుకున్నారు. ఈ అద్భుత రికార్డు సాధించిన అనంతరం సవిత మాట్లాడుతూ.. వందనా కటారియాను తన ఆదర్శంగా పేర్కొన్నారు. క్రీడా జీవితంలో ఎన్ని గాయాలు, ఇబ్బందులు ఎదురైనా వెనకడుగు వేయకుండా పోరాడే వందనా స్ఫూర్తే తనను ఇప్పటి వరకు నడిపించిందని ఆమె ఎమోషనల్ అయ్యారు.

2009 నుంచి అద్భుత ప్రస్థానం

36 ఏళ్ల వయసు గల సవిత పూనియా 2009 సంవత్సరంలో భారత సీనియర్ మహిళా హాకీ జట్టు తరఫున అంతర్జాతీయ అరంగేట్రం చేశారు. ఆ తర్వాత నుంచి భారత జట్టుకు గోల్‌కీపర్‌గా వెన్నెముకలా నిలబడ్డారు. కేవలం ఆటగాడిగానే కాకుండా, సుదీర్ఘకాలం పాటు జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించి ఎన్నో చిరస్మరణీయ విజయాలను అందించారు. ఆమె చేసిన అంకితభావం మరియు సేవలకు గుర్తింపుగా 2025లో భారత ప్రభుత్వం ఆమెను దేశ నాలుగో అత్యున్నత పౌర పురస్కారమైన పద్మశ్రీ(Padma Shri)తో ఘనంగా సత్కరించింది. హాకీ రంగానికి ఆమె అందిస్తున్న సేవలు దేశ యువతకు ఎల్లప్పుడూ స్ఫూర్తిదాయకం.

ఏషియన్ గేమ్స్‌లో భారత మహిళా జట్టు జోరు

సవిత పూనియా రికార్డు సాధించిన మ్యాచ్‌లో భారత మహిళా జట్టు అద్భుతమైన ప్రదర్శన కనబరిచింది. ఇండోనేషియాతో జరిగిన ఈ మ్యాచ్‌లో భారత్ ఏకంగా 17-1 గోల్స్ తేడాతో ఘన విజయం సాధించింది. అంతకుముందు ఉజ్బెకిస్తాన్‌పై 19-0 తేడాతో అఖండ విజయం నమోదు చేసిన మన అమ్మాయిలు, టోర్నమెంట్‌లో అజేయంగా ముందుకు సాగుతున్నారు. ఇక తదుపరి సెప్టెంబర్ 23న థాయ్‌లాండ్‌తో భారత్ తలపడనుంది. ఆ తర్వాత జపాన్, సింగపూర్ జట్లతో మ్యాచ్‌లు జరగనున్నాయి. డిఫెన్స్‌లో సవిత పూనియా అనుభవం జట్టుకు ఏషియన్ గేమ్స్‌లో పతకం సాధించడంలో కీలక పాత్ర పోషిస్తుందని అభిమానులు ఆశిస్తున్నారు.

మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
రికార్డు సృష్టించిన గోల్‌కీపర్ సవిత పూనియా
రికార్డు సృష్టించిన గోల్‌కీపర్ సవిత పూనియా
‘కుండ పెరుగు’తో రూ.50 కోట్లు కూడబెట్టాడు.. ఓ రైతుబిడ్డ విజయం
‘కుండ పెరుగు’తో రూ.50 కోట్లు కూడబెట్టాడు.. ఓ రైతుబిడ్డ విజయం
ఈ తేదీల్లో పుట్టిన పిల్లలకు మొండితనం, పట్టుదల ఎక్కువేనట..!
ఈ తేదీల్లో పుట్టిన పిల్లలకు మొండితనం, పట్టుదల ఎక్కువేనట..!
సరిహద్దు దాటితే యుద్ధమే.. పెద్దపులుల సామ్రాజ్య పోరు వెనుక భయంకర న
సరిహద్దు దాటితే యుద్ధమే.. పెద్దపులుల సామ్రాజ్య పోరు వెనుక భయంకర న
‘మీరు 0 నుంచి 9లో ఏ అంకెగా మారాలనుకుంటారు?’ UPSC ఇంటర్వ్యూ ప్రశ్న
‘మీరు 0 నుంచి 9లో ఏ అంకెగా మారాలనుకుంటారు?’ UPSC ఇంటర్వ్యూ ప్రశ్న
ఐపీఎల్ 2027 కోసం సీఎస్‌కే సంచలన నిర్ణయం.. హెడ్ కోచ్‌గా జహీర్ ఖాన్
ఐపీఎల్ 2027 కోసం సీఎస్‌కే సంచలన నిర్ణయం.. హెడ్ కోచ్‌గా జహీర్ ఖాన్
సోనియా గాంధీ ఓటరు జాబితా కేసులో బిగ్ ట్విస్ట్!
సోనియా గాంధీ ఓటరు జాబితా కేసులో బిగ్ ట్విస్ట్!
నేను స్వతంత్రుడిని.. ఎవరికీ సమాధానం చెప్పను.. ఓపెన్ ఏఐ తిరుగుబాటు
నేను స్వతంత్రుడిని.. ఎవరికీ సమాధానం చెప్పను.. ఓపెన్ ఏఐ తిరుగుబాటు
ఆహా.. భర్త అంటే నీలా ఉండాలి బాస్‌.. హ్యాట్సాఫ్‌!
ఆహా.. భర్త అంటే నీలా ఉండాలి బాస్‌.. హ్యాట్సాఫ్‌!
విమానంలో షర్ట్స్‌ చిరిగేలా కొట్టుకున్న ప్రయాణికులు..
విమానంలో షర్ట్స్‌ చిరిగేలా కొట్టుకున్న ప్రయాణికులు..