AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IND Vs Wi: విరాట్, రోహిత్‌ల గురించి విండీస్ ప్లేయర్ సంచలన వ్యాఖ్యలు

IND vs WI: భారత్‌తో వన్డే సిరీస్‌కు ముందు వెస్టిండీస్ స్టార్ ఆల్‌రౌండర్ జెసన్ హోల్డర్ కీలక వ్యాఖ్యలు చేశారు. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మల బ్యాటింగ్ సామర్థ్యాన్ని ప్రశంసించిన ఆయన, శుభ్‌మన్ గిల్ కెప్టెన్సీని కూడా కొనియాడారు. గిల్ ప్రశాంతంగా నిర్ణయాలు తీసుకుంటాడని, గునూర్ బ్రార్‌కు మంచి భవిష్యత్ ఉందని హోల్డర్ పేర్కొన్నారు

IND Vs Wi: విరాట్, రోహిత్‌ల గురించి విండీస్ ప్లేయర్ సంచలన వ్యాఖ్యలు
Virat Rohit
Rakesh
|

Updated on: Sep 21, 2026 | 5:23 PM

Share

IND Vs Wi: భారత్, వెస్టిండీస్ జట్ల మధ్య త్వరలో జరగనున్న ప్రతిష్టాత్మక వన్డే సిరీస్ కోసం క్రికెట్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సెప్టెంబర్ 27 నుంచి ప్రారంభం కానున్న ఈ సిరీస్ ద్వారా భారత్‌లో హోమ్ సీజన్ కూడా మొదలుకానుంది. ఈ నేపథ్యంలో వెస్టిండీస్ సీనియర్ ఆల్ రౌండర్ జెసన్ హోల్డర్ ప్రముఖ మీడియాతో మాట్లాడుతూ భారత జట్టుపై, ముఖ్యంగా విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, యువ కెప్టెన్ శుభమన్ గిల్ గురించి తన మనసులోని మాటలను పంచుకున్నారు. ప్రపంచ క్రికెట్‌లో ఈ దిగ్గజాల పాత్ర ఎంత కీలకమో ఆయన ఈ సందర్భంగా ప్రత్యేకంగా ప్రస్తావించారు.

శుభమన్ గిల్ కెప్టెన్సీపై హోల్డర్ ప్రశంసలు

ఐపీఎల్‌లో శుభమన్ గిల్ కెప్టెన్సీలో ఆడిన అనుభవాన్ని గుర్తుచేసుకుంటూ జెసన్ హోల్డర్ తన నాయకత్వ లక్షణాలను కొనియాడారు. గిల్ చాలా ప్రశాంతంగా ఉంటాడని, ఎక్కడా ఆందోళన చెందకుండా స్పష్టమైన ప్రణాళికలతో ముందుకు వెళ్తాడని తెలిపారు. మైదానంలో బౌలర్లకు పూర్తి స్వేచ్ఛను ఇస్తూ, వారిని నమ్ముకుని ఫీల్డ్ సెట్ చేసుకునే అవకాశమిస్తాడని హోల్డర్ వెల్లడించారు. గిల్ ఇంకా యువ కెప్టెన్ అయినప్పటికీ, మ్యాచ్‌లు ఆడుతూ ఎంతో వేగంగా నేర్చుకుంటున్నాడని, భవిష్యత్తులో అతను మరింత గొప్ప నాయకుడిగా ఎదుగుతాడని ప్రశంసించారు.

విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మలపై ఏమన్నారంటే

భారత క్రికెట్ దిగ్గజాలు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మల గురించి మాట్లాడుతూ జెసన్ హోల్డర్ ఆసక్తికరమైన కామెంట్లు చేశారు. విరాట్ కోహ్లీ బహుశా వన్డే క్రికెట్ చరిత్రలోనే అత్యుత్తమ బ్యాట్స్‌మెన్ అని, అతన్ని మైదానంలో చూడటమే ఒక అద్భుతమని కొనియాడారు. అలాగే రోహిత్ శర్మకు కూడా వన్డేల్లో అద్భుతమైన రికార్డు ఉందని, ముఖ్యంగా వెస్టిండీస్ జట్టుపై అతను ఎప్పుడూ అత్యుత్తమ ప్రదర్శన ఇస్తాడని గుర్తుచేశారు. ఈ ఇద్దరు లెజెండ్స్‌తో తలపడటం ఏ బౌలర్‌కైనా సవాల్‌తో కూడుకున్న విషయమేనని, అలాంటి ప్రపంచ స్థాయి ఆటగాళ్లతో పోటీ పడటాన్ని తాను ఎప్పుడూ ఆస్వాదిస్తానని హోల్డర్ చెప్పారు.

గున్రూర్ బ్రార్ పై ప్రశంసలు

ఇదే ఇంటర్వ్యూలో గుజరాత్ టైటాన్స్ జట్టులో తాను దగ్గరగా చూసిన యువ పేసర్ గున్రూర్ బ్రార్ ప్రతిభను హోల్డర్ ఎంతగానో మెచ్చుకున్నారు. బ్రార్‌ వద్ద అద్భుతమైన వేగంతో పాటు మంచి బౌన్సీ డెలివరీలు ఇచ్చే ఎత్తు ఉందని, అతనికి భవిష్యత్తులో గొప్ప కెరీర్ ఉంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఇక రాబోయే వన్డే సిరీస్ ఇటు వెస్టిండీస్ జట్టుకు, అటు టీమిండియాకు ఎంతో కీలకమని, ఇరు జట్ల మధ్య నువ్వా నేనా అన్నట్లు హోరాహోరీ పోరు సాగుతుందని ఆయన అంచనా వేశారు.

మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us