Ginger: ఆ సమయంలో అల్లం తింటే ఈ సమస్యలన్నీ హాంఫట్.. కానీ, మోతాదు మించితే మాత్రం..

అల్లంలో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ, యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ వైరల్ గుణాలు పుష్కలంగా ఉన్నాయి. ఇది శరీరంలో మంట, జలుబు, దగ్గు, వైరల్ సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తుంది.

Ginger: ఆ సమయంలో అల్లం తింటే ఈ సమస్యలన్నీ హాంఫట్.. కానీ, మోతాదు మించితే మాత్రం..
Ginger Health Benefits

Updated on: Sep 20, 2022 | 9:39 AM

Ginger Health Benefits: అల్లంలో అనేక పోషకాలు, ఔషధ గుణాలు దాగున్నాయి. ఇందులో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ, యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ వైరల్ గుణాలు పుష్కలంగా ఉన్నాయి. ఇది శరీరంలో మంట, జలుబు, దగ్గు, వైరల్ సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తుంది. మీరు క్రమం తప్పకుండా అల్లం తీసుకుంటే మీ బరువును తగ్గించడంతో పాటు అనేక సమస్యలను దూరం చేస్తుంది. అయితే, రోజుల తగిన మోతాదులో అల్లం తీసుకుంటేనే దీనినుంచి పోషకాలు పొందుతారు. లేకపోతే.. అది మీ సమస్యను మరింత పెంచుతుందని నిపుణులు పేర్కొంటున్నారు. అయితే, అల్లం ఎప్పుడు, ఎలా తినాలో ఇప్పుడు తెలుసుకోండి..

అల్లం ఎప్పుడు తినాలి..

ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం.. ఉదయం పరగడుపున (ఖాళీ కడుపుతో) అల్లం తినాలి. దీనివల్ల మీ బరువును తగ్గించుకోవచ్చు. ఇది కాకుండా జలుబు, దగ్గు వంటి సమస్యలతో బాధపడుతున్నట్లయితే మీరు ఎప్పుడైనా అల్లం తినవచ్చు. అయితే అల్లం ఎక్కువగా తినకూడదన్న విషయాన్ని మాత్రం గుర్తుంచుకోవాలి. ఎందుకంటే.. శరీరంలో దీని మోతాదు పెరిగితే ఇది అనేక అనారోగ్య సమస్యలను కలిగిస్తుంది.

ఇవి కూడా చదవండి

రోజులో ఎంత అల్లం తినాలి..

పరిమిత పరిమాణంలో అల్లం తినాలి. అల్లం ఎక్కువగా తీసుకోవడం వల్ల హాని కలుగుతుంది. మీరు అల్లం తినడం ద్వారా ఆరోగ్యంగా ఉండాలనుకుంటే ఒక రోజు మొత్తంలో 25 గ్రాముల కంటే ఎక్కువ అల్లం తినవద్దు. దీనికంటే ఎక్కువగా అల్లం తీసుకోవడం వల్ల పైల్స్ వచ్చే అవకాశం ఉంది.

అల్లం ప్రయోజనాలు..

  • ఉదయాన్నే అల్లం తీసుకోవడం వల్ల జీర్ణవ్యవస్థ బలపడుతుంది. ఇది వికారం, అజీర్ణం, మార్నింగ్ సిక్‌నెస్‌ను తొలగిస్తుంది.
  • ఉదయం పూట అల్లం తింటే మధుమేహం సమస్యను దూరం చేసుకోవచ్చు. ఇది రక్తంలో చక్కెరను అదుపులో ఉంచుతుంది.
  • అల్లంను యాంటీఆక్సిడెంట్లు, విటమిన్ ఎ, విటమిన్ సి మూలంగా పరిగణిస్తారు. ఇది చర్మం నుంచి జుట్టు వరకు అనేక సమస్యలను తొలగిస్తుంది.
  • శరీరంలో నొప్పిని తగ్గించడానికి అల్లం ఉపయోగపడుతుంది. ముఖ్యంగా అల్లం వాడకం కండరాల నొప్పిని తగ్గించడంలో సహాయపడుతుంది.

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి