రాత్రిపూట నిద్రరాక ఇబ్బంది పడుతున్నారా..? ఇలా చిన్న ఛేంజ్ చేసి చూడండి..!
ప్రస్తుత రోజుల్లో చాలా మంది రాత్రి ఆలస్యంగా భోజనం చేస్తున్నారు. అయితే ఆరోగ్య నిపుణులు ఏం చెబుతున్నారంటే.. రాత్రిపూట త్వరగా డిన్నర్ చేస్తే మన ఆరోగ్యానికి చాలా మంచిది. ఇలా త్వరగా తినడం వల్ల జీర్ణక్రియ బాగా జరుగుతుంది. అంతేకాదు నిద్ర కూడా హాయిగా పడుతుంది. ఈ చిన్న మార్పుతో మీరు చాలా ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు.

ప్రస్తుత రోజుల్లో ఆరోగ్య నిపుణులు ఏం చెబుతున్నారో తెలుసా..? రాత్రి భోజనం త్వరగా చేయడం వల్ల మన జీర్ణక్రియ బాగా జరుగుతుందంటున్నారు. పైగా నిద్ర కూడా బాగా పడుతుందట. డిన్నర్ సమయాన్ని ముందుగా మార్చుకోవడం వల్ల మన శరీరానికి ఇంకా ఎన్ని లాభాలు ఉన్నాయో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.
మనలో చాలా మంది రాత్రి 9 గంటల తర్వాతే ఫుడ్ ఆర్డర్ చేసుకోవడం.. ఆలస్యంగా భోజనం చేయడం కామన్ అయిపోయింది. కానీ గతంలో లాగా సాయంత్రం 7 గంటల కల్లా డిన్నర్ పూర్తి చేయడం ఇప్పుడు మళ్లీ డాక్టర్ల దృష్టిలో ముఖ్యమైంది. ఇది కేవలం ఒక అలవాటు మాత్రమే కాదు.. మన శరీర ఆరోగ్యానికి చాలా సపోర్ట్ ఇచ్చే మార్గం.
శరీరం ఒకేసారి జీర్ణక్రియ చేయడం.. విశ్రాంతి తీసుకోవడం అనే రెండు పనులు చేయలేదని నిపుణులు చెబుతున్నారు. రాత్రి టైమ్ లో తిన్న ఆహారం జీర్ణం చేసుకోవడం శరీరానికి కష్టంగా మారుతుందని.. అదే సమయంలో నిద్రపోవడం వల్ల శరీరంలోని ప్రాసెస్‌లకు అడ్డంకి ఏర్పడుతుందని నిపుణులు అంటున్నారు. దీని ప్రభావం నిద్రపైనే కాకుండా.. ఎక్కువ కాలం చూస్తే మెటబాలిజంపై కూడా పడొచ్చు అని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
మన శరీరం సహజంగా రోజంతా పనిచేసే ఒక ఇంటర్నల్ క్లాక్ ను ఫాలో అవుతుంది. ఉదయం సమయంలో శరీరం చాలా యాక్టివ్ గా ఉంటుంది. కానీ సాయంత్రం నుండి ఆ శక్తి తగ్గుతుంది. భోజనం సమయాన్ని ముందుగా మార్చుకుంటే ఇది మన సహజ జీవనశైలికి బాగా సెట్ అవుతుంది. నిపుణులు వివరించినట్లుగా.. ఉదయం శరీరం ఇన్సులిన్ ను బాగా వాడుకోగలుగుతుంది. కానీ రాత్రి తిన్న ఆహారం వల్ల గ్లూకోజ్ ఎక్కువసేపు రక్తంలో ఉండిపోవచ్చు. దీని వల్ల షుగర్ ఉన్నవాళ్లకు రిస్క్ మరింత పెరుగుతుంది.
జీర్ణక్రియతో పాటు నిద్ర క్వాలిటీపై కూడా డిన్నర్ టైం ప్రభావం చూపిస్తుంది. సాయంత్రం ముందుగానే తిన్నప్పుడు రాత్రిపూట శరీరం విశ్రాంతి తీసుకోవడం.. కణాలను రిపేర్ చేసుకోవడం లాంటి పనులపై ఫోకస్ పెట్టగలుగుతుంది. దీని వల్ల నిద్ర కష్టం కాకుండా.. హాయిగా పడుతుంది. ఉదయం లేవగానే మీరు తేలికగా, ఉత్సాహంగా, రోజంతా ఫోకస్ గా ఉండగలుగుతారు.
చదువు, జాబ్, ఇతర పనుల వల్ల అందరికీ 7 గంటలలోపు డిన్నర్ చేయడం సాధ్యం కాకపోవచ్చు. కానీ కనీసం నిద్రపోవడానికి 2 నుంచి 3 గంటల ముందు భోజనం చేయడం శరీరానికి చాలా మంచి చేస్తుందని నిపుణులు సూచిస్తున్నారు. ఇది కచ్చితంగా 7 గంటలు కాకపోయినా.. భోజనానికి నిద్రకు మధ్య గ్యాప్ ఇవ్వడం ఆరోగ్యానికి చాలా హెల్ప్ అవుతుందని నిపుణులు చెబుతున్నారు.
మీరు ఏం తింటున్నారన్న దానికంటే ఎప్పుడు తింటున్నారు అనేదే మరింత ముఖ్యమని నిపుణులు చెబుతున్నారు. ఒక చిన్న మార్పుతో.. అంటే డిన్నర్ సమయాన్ని ముందుకు జరపడం వల్ల జీర్ణక్రియ మెరుగవుతుంది, నిద్ర క్వాలిటీ పెరుగుతుంది, శరీర శక్తి కూడా పెరుగుతుంది.
(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)




