థైరాయిడ్ అనేది సీతాకోకచిలుక ఆకారపు గ్రంథి. ఇది గొంతు ముందు భాగంలో, అంటే కాలర్ బోన్ దగ్గర ఉంటుంది. థైరాయిడ్‌కి అత్యంత సాధారణ కారణం ఏంటంటే ఆటో ఇమ్యూన్ థైరాయిడ్ వ్యాధి (AITD). థైరాయిడ్ రోగులలో బరువుకు సంబంధించిన చాలా సమస్యలు కనిపిస్తాయి. బరువు పెరుగుట అనేది తక్కువ థైరాయిడ్ హార్మోన్‌ను సూచిస్తుంది. దీనిని హైపో థైరాయిడిజం అని పిలుస్తారు. థైరాయిడ్ శరీరంలో ఎక్కువ హార్మోన్‌ను ఉత్పత్తి చేస్తే, బరువు వేగగం తగ్గడం మొదలవుతోంది. దీనిని హైపర్ థైరాయిడిజం అంటారు. హైపోథైరాయిడిజం పరిస్థితిలో, జీవక్రియ మందగిస్తుంది. ఈ పరిస్థితి ఉన్నవారు బరువు తగ్గడాని(Weight Loss)కి చాలా కష్టపడాలి. అధ్యయనం ప్రకారం, థైరాయిడ్ ప్రమాదం పురుషుల కంటే మహిళల్లో పది రెట్లు ఎక్కువగా ఉంటుంది. మీరు కూడా థైరాయిడ్ కారణంగా పెరిగిన బరువును తగ్గించుకోవాలనుకుంటే, ఈ పద్ధతులను పాటిస్తే సరిపోతుంది.
1. పిండి పదార్థాలు, చక్కెరలను తగ్గించాలి..
శాన్ డియాగోలోని ప్రైమ్ వెల్‌నెస్ క్లినిక్‌లో డైరెక్టర్, హార్మోన్ డిజార్డర్ నిపుణుడు కెల్లీ ఆస్టిన్, థైరాయిడ్ ఉన్న రోగులు సాధారణ పిండి పదార్థాలు, చక్కెరలను తినకూడదని సూచించారు. కూరగాయలు, చిక్కుళ్ళు వంటి సంక్లిష్ట పిండి పదార్థాలను తీసుకోవాలి. తీపి పదార్థాలను తీసుకోవడం మానేయాలని తెలిపారు.
ఒరెగాన్ స్టేట్ యూనివర్శిటీ ప్రకారం, అధిక గ్లైసెమిక్ ఇండెక్స్ ఉన్న ఆహారాలు (సాధారణ కార్బ్, చక్కెర ఆహారాలు వంటివి) శరీరంలో మంటను పెంచుతాయి. దీర్ఘకాలం వాపు వల్ల శరీరం ఉబ్బినట్లుగా కనిపించడంతోపాటు బరువు తగ్గదు.
2. యాంటీ ఇన్ఫ్లమేటరీ ఫుడ్స్ ఎక్కువగా తినాలి..
మంటను తగ్గించే ఆహారాలు తినడం వల్ల కీళ్ల నొప్పులు తగ్గుతాయి. అలాగే వాపు తగ్గుతుంది. దీనితో పాటు, శోథ నిరోధక ఆహారాలు కూడా రోగనిరోధక వ్యవస్థను సరిగ్గా ఉంచడంలో సహాయపడతాయి. మాంచెస్టర్‌లోని న్యూ హాంప్‌షైర్‌లోని హెల్త్ స్ట్రాంగ్ ఇంటిగ్రేటివ్ మెడిసిన్ మెడికల్ డైరెక్టర్ టీనా బ్యూడోయిన్ ప్రకారం, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ డైట్ రోగనిరోధక వ్యవస్థ, శరీరంలో మంటను తగ్గించడంలో సహాయపడుతుంది. కాబట్టి ఆకుకూరలు యాంటీ ఇన్‌ఫ్లమేటరీగా ఉంటాయి. కూరగాయలు, టమోటాలు, కొవ్వు- చేపలు, డ్రై ఫ్రూట్స్, పండ్లు, ఆలివ్ ఆయిల్ తీసుకోవచ్చు.
3. తక్కువ భోజనం చేస్తుండాలి..
థైరాయిడ్ ఉన్నవారు బరువు తగ్గడానికి తక్కువ మొత్తంలో భోజనం తీసుకోవాలి. తక్కువ మొత్తంలో ప్రతి 3-4 గంటలకు తినండి అలవాటు చేసుకోవాలి. ఆహారంలో ప్రోటీన్, ఆరోగ్యకరమైన కొవ్వు, సంక్లిష్ట కార్బ్ ఆహారాలు తినాలి. ఇవి బ్లడ్ షుగర్‌ని బ్యాలెన్స్ చేయడంతోపాటు బరువు తగ్గించడంలో కూడా సహాయపడతాయి.
4. ఫుడ్ డైరీని సిద్ధం చేసుకోవాలి..
డైరీలో మీరు ఏమి తిన్నారో నోట్ చేసుకోండి. ఇది సమతుల్య ఆహారం తీసుకోవడానికి మీకు సహాయం చేస్తుంది. ఎవరైనా హైపోథైరాయిడిజం బారిన పడితే, ఈ డైరీతో ఎంత ప్రోటీన్, కొవ్వు, కార్బోహైడ్రేట్ తీసుకున్నాడో తెలుసుకోవచ్చు. ఆహారంలో ఎల్లప్పుడూ ఆరోగ్యకరమైన కొవ్వు, ప్రోటీన్ మీడియం, తక్కువ కార్బోహైడ్రేట్లను తీసుకోవడం మంచిది.
5. శారీరక శ్రమను పెంచాలి..
ఆరోగ్యకరమైన ఆహారంతో పాటు వ్యాయామం చేయడం వల్ల అదనపు కేలరీలు బర్న్ అవుతాయి. హైపో థైరాయిడిజమ్‌తో బాధపడే వారికి వ్యాయామం బరువు తగ్గించడంలో సహాయపడుతుంది. రోగి మంచి ఆహారం తీసుకుంటూ వ్యాయామం చేస్తుంటే, అది థైరాయిడ్‌ను తగ్గించడంలో సహాయపడుతుంది.
గమనిక: ఈ కథనంలో పేర్కొన్న సమాచారం కేవలం అవగాహన కోసమే. ఈ పద్ధతులు, చిట్కాలు ఏవైనా అనుసరించే ముందు, దయచేసి వైద్యుడిని సంప్రదించండి.