Immune System: రోగనిరోధకతను పటిష్టపరిచే చిట్కాలు.. రోజూ ఇలా చేశారంటే ఏ రోగాలు దరిచేరవు

చలికాలం వస్తే దానితోపాటో అనేక వ్యాధులు కూడా వస్తాయి. జలుబు, ముక్కు కారడం నుంచి గ్యాస్-హార్ట్ బర్న్ వరక పలు వ్యాధులు వెంటాడుతాయి. చలికాలంలో శ్వాసకోశ సమస్యలు, న్యుమోనియా వంటి సమస్యలు కూడా పెరుగుతాయి. చలికాలం అయినప్పటికీ దోమల బెడద తక్కువేమీ కాదు. దోమల వల్ల మలేరియా, డెంగ్యూ వ్యాధులు దేశ వ్యాప్తంగా ఇంకా ప్రబలుతూనే ఉన్నాయి. మరోవైపు కోవిడ్ కూడా మళ్లీ విజృంభిస్తోంది. కోవిడ్ కేసులు పలు చోట్ల నమోదవుతూనే ఉన్నాయి. అందుకే చలికాలంలో జాగ్రత్తగా ఉండడం చాలా..

Immune System: రోగనిరోధకతను పటిష్టపరిచే చిట్కాలు.. రోజూ ఇలా చేశారంటే ఏ రోగాలు దరిచేరవు
Immune System

Updated on: Dec 18, 2023 | 11:53 AM

చలికాలం వస్తే దానితోపాటో అనేక వ్యాధులు కూడా వస్తాయి. జలుబు, ముక్కు కారడం నుంచి గ్యాస్-హార్ట్ బర్న్ వరక పలు వ్యాధులు వెంటాడుతాయి. చలికాలంలో శ్వాసకోశ సమస్యలు, న్యుమోనియా వంటి సమస్యలు కూడా పెరుగుతాయి. చలికాలం అయినప్పటికీ దోమల బెడద తక్కువేమీ కాదు. దోమల వల్ల మలేరియా, డెంగ్యూ వ్యాధులు దేశ వ్యాప్తంగా ఇంకా ప్రబలుతూనే ఉన్నాయి. మరోవైపు కోవిడ్ కూడా మళ్లీ విజృంభిస్తోంది. కోవిడ్ కేసులు పలు చోట్ల నమోదవుతూనే ఉన్నాయి. అందుకే చలికాలంలో జాగ్రత్తగా ఉండడం చాలా అవసరం. ఈ కాలంలో నీళ్లు పుష్కలంగా తాగాలి. పండ్లు, కూరగాయలు ఎక్కువగా తినాలి. అదే విధంగా ముఖానికి మాస్క్ కూడా ధరించాలి. మన చుట్టూ ఉన్న కొన్ని వాతావరణ పరిస్థితులు మన రోగనిరోధక శక్తిపై ప్రభావం చూపుతాయి. రోగనిరోధకతను పెంచడంలో వెల్లుల్లి ప్రభావవంతంగా పనిచేస్తుంది.

మధుమేహ వ్యాధిగ్రస్తులకు వెల్లులి చాలా మంచిది. 150 ml నీటిలో 3-5 గ్రాముల వెల్లుల్లి పొడిని కలిపి ఒక నిమిషం పాటు మూత పెట్టకుండా మరగనివ్వాలి. తర్వాత గ్యాస్ ఆఫ్ చేసి 2 నిమిషాలు మూతపెట్టాలి. కొద్దిగా చల్లగా ఉన్నప్పుడు ఈ నీటిని కొద్దికొద్దిగా తాగాలి. ఇలా ప్రతి రోజూ తాగడవ వల్ల ఎలాంటి ఇన్ఫెక్షన్ సంబంధిత సమస్యలు రాకుండా కాపాడుతుంది. ఈ జలుబుతో వచ్చే ఇతర వ్యాధులతో ఇది పోరాడుతుంది.

పాలతో ఎలాంటి సమస్య లేని వారు.. ఒక గ్లాసుడు పాలలో ఈ పొడిని ఒక స్పూన్‌ వేసి మరిగించాలి. పెద్ద మంట మీద ఒక నిమిషం మరగనివ్వాలి. ఆ తర్వాత స్టౌవ్‌ ఆఫ్‌ చేసి 2 నిమిషాలు మూత పెట్టి పక్కన పెట్టుకోవాలి. కాస్త చల్లారిన తర్వాత నెమ్మదిగా సిప్ చేయాలి. దీంతో శరీరం ఆరోగ్యంగా ఉంటుంది. అలాగే పాలకూర శరీరానికి కూడా ఎంతో మేలు చేస్తుంది. దీనిలో ఫోలేట్ ఉంటుంది. ఇది శరీరంలో కొత్త కణాలు ఏర్పడటానికి సహాయపడుతుంది. దానితో పాటు ఫైబర్, ఐరన్, విటమిన్ సి శరీరాన్ని అన్ని వైపుల నుంచి ఆరోగ్యంగా ఉంచుతుంది. అందుకే ఈ చలికాలంలో పాలకూరను క్రమం తప్పకుండా తినడం మర్చిపోకూడదు. పుట్టగొడుగులు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. తెల్ల రక్త కణాలను చురుకుగా ఉంచుతుంది. ఇందులో సెలీనియం అనే మిలనర్స్‌ ఉంటాయి. యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్ బి, రిబోఫ్లావిన్, నిసిన్ కూడా ఉంటాయి. కాబట్టి ఈ కాలంలో పుట్టగొడుగులు రెగ్యులర్ గా తినడం మర్చిపోకూడదు.

ఇవి కూడా చదవండి

అర చెంచా ఉసిరి పొడిని ఒక చెంచా తేనెతో కలిపి ఉదయం ఖాళీ కడుపుతో తినాలి. ఇది రోగనిరోధక శక్తిని పెంపొందిస్తుంది. జీర్ణవ్యవస్థను కూడా మెరుగుపరుస్తుంది. చలికాలంలో ప్రతిరోజూ ఉదయం ఉసిరి రసం లేదా పొడిని తీసుకుంటే మంచి ఫలితం ఉంటుంది. త్రిఫల చూర్ణాన్ని చూర్ణం చేసి గోరువెచ్చని నీటిలో కలుపుకుని తాగిపా మంచిది.

మరిన్ని ఆరోగ్య సంబంధిత కథనాల కోసం క్లిక్‌ చేయండి.