AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Water Side Effects: ఎక్కువగా నీరు తాగుతున్నారా..? అయితే ప్రమాదంలో పడినట్లే.. ఎందుకో తెలుసుకోండి

ఆరోగ్య నిపుణులు ప్రతిరోజూ ఎనిమిది నుంచి పది గ్లాసుల నీరు తాగాలని సిఫార్సు చేస్తున్నప్పటికీ, ఎక్కువ నీరు తాగడం వల్ల ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది.

Water Side Effects: ఎక్కువగా నీరు తాగుతున్నారా..? అయితే ప్రమాదంలో పడినట్లే.. ఎందుకో తెలుసుకోండి
water
Shaik Madar Saheb
|

Updated on: May 30, 2022 | 4:59 PM

Share

Water Side Effects: అనారోగ్య సమస్యల నుంచి దూరంగా ఉండాలంటే సాధ్యమైనంత ఎక్కువగా నీరు తాగాలని నిపుణుల సూచిస్తారు. ఎందుకంటే.. నీరు మీ శరీరానికి హాని కలిగించే కలుషితాలను బయటకు పంపుతుంది. చాలా మంది ఆరోగ్య నిపుణులు ప్రతిరోజూ ఎనిమిది నుంచి పది గ్లాసుల నీరు తాగాలని సిఫార్సు చేస్తున్నప్పటికీ, ఎక్కువ నీరు తాగడం వల్ల ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది. ఎక్కువ నీరు తాగడం మీ ఆరోగ్యానికి హానికరం. ఎందుకంటే ఇది అదనపు నీటిని తొలగించే మూత్రపిండాల సామర్థ్యాన్ని నిరోధిస్తుంది. శరీరంలోని సోడియంను తక్కువ చేస్తుంది. న్యూ ఢిల్లీలోని వెల్‌నెస్ న్యూట్రిషన్ ఎక్స్‌పర్ట్ డాక్టర్ శిఖా శర్మ ప్రకారం.. ఎక్కువ నీరు తాగడం వల్ల మూత్రపిండాలు సరిగా పనిచేయవు. దీంతోపాటు ఆరోగ్యానికి ప్రమాదకరమైన కణాల వాపుకు దారితీస్తుందని చెప్పారు.

ఎక్కువ నీరు తాగడం వల్ల కలిగే 5 దుష్ప్రభావాలు:

హైపోనట్రేమియాకు కారణమవుతుంది: ఎక్కువ నీరు తాగడం వల్ల శరీరంలో ద్రవం పెరిగి అసమతుల్యత ఏర్పడుతుంది. అధిక నీరు శరీర ఉప్పు స్థాయిలను తగ్గిస్తుంది. ఫలితంగా వికారం, వాంతులు, తిమ్మిరి, అలసట, ఇతర లక్షణాలు కనిపిస్తాయి.

ఇవి కూడా చదవండి

శరీరంలో ఎలక్ట్రోలైట్‌ను తగ్గిస్తుంది: మీరు ఎక్కువ నీరు తాగినప్పుడు ఎలక్ట్రోలైట్ స్థాయిలు పడిపోతాయి. బ్యాలెన్స్ తప్పి శరీరం వణుకుతుంది. ఎలక్ట్రోలైట్ స్థాయిలు తక్కువగా ఉన్నప్పుడు కండరాల నొప్పి, తిమ్మిరి వంటి లక్షణాలు సంభవించవచ్చు.

తరచుగా మూత్రవిసర్జన: ప్రతి 15 నిమిషాలకు తరచుగా మూత్రవిసర్జన చేయడం చాలా అసౌకర్యంగా ఉంటుంది. ఇంట్లో, కార్యాలయంలో లేదా పాఠశాలలో ఉన్నా ఇలాంటి పరిస్థితిని ఎదుర్కొవడం కష్టం. ఎక్కువ నీరు తీసుకున్నప్పుడు మీ మూత్రపిండాలు నిరంతరం పని చేస్తాయి. ఫలితంగా మీరు రోజూ బాత్రూమ్‌కి పరిగెత్తాల్సి వస్తుంది.

అలసిపోయేలా చేస్తుంది: ఎక్కువ నీరు తీసుకోవడం వల్ల అలసట, నీరసం వస్తుంది. ఎక్కువ నీరు తాగితే మీ మూత్రపిండాలు మరింత కష్టపడి పనిచేయవలసి రావచ్చు. దీని వలన ఒత్తిడితో కూడిన హార్మోన్ల ప్రతిచర్య మీ శరీరాన్ని ఆందోళనకు గురి చేస్తుంది. దీంతో శరీరం అలసిపోతుంది.

క్యాన్సర్ ప్రమాదాన్ని పెంచుతుంది: అనేక దేశాలలో పంపు నీటిని శుభ్రపరచడానికి క్లోరిన్ ఉపయోగిస్తారు. నిపుణుల అభిప్రాయం ప్రకారం క్లోరినేటెడ్ నీటిని ఎక్కువ తీసుకోవడం వల్ల మూత్రాశయం, వృషణ క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉంది.

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

ప్రపంచంలోనే ఎత్తైన జలపాతం..ఆకాశం నుండి చూస్తే ఎలా ఉంటుందో తెలుసా?
ప్రపంచంలోనే ఎత్తైన జలపాతం..ఆకాశం నుండి చూస్తే ఎలా ఉంటుందో తెలుసా?
కిడ్నీ రోగులకు ఈ జ్యూస్ విషంతో సమానం.. పొరపాటున కూడా తాగకండి
కిడ్నీ రోగులకు ఈ జ్యూస్ విషంతో సమానం.. పొరపాటున కూడా తాగకండి
నీలి చిత్రాల్లో నటించమని ఒత్తిడి చేశారు..
నీలి చిత్రాల్లో నటించమని ఒత్తిడి చేశారు..
బ్యాంకులు 2026లో వారానికి 5 రోజులే పని చేస్తాయా ??
బ్యాంకులు 2026లో వారానికి 5 రోజులే పని చేస్తాయా ??
అప్పు చేసి ప్రైవేట్ స్కూల్‌కు ఎందుకు.. విద్యార్థిని ఇంగ్లీష్..
అప్పు చేసి ప్రైవేట్ స్కూల్‌కు ఎందుకు.. విద్యార్థిని ఇంగ్లీష్..
చైనా‎మ్యాన్, ప్రసిద్ధ్ కృష్ణ మ్యాజిక్‎కు చిత్తైన సఫారీలు
చైనా‎మ్యాన్, ప్రసిద్ధ్ కృష్ణ మ్యాజిక్‎కు చిత్తైన సఫారీలు
పొరిగింటి పుల్ల కూరకు మరిగి.. ఇంటి ఆయన్ను ఏసేసింది...
పొరిగింటి పుల్ల కూరకు మరిగి.. ఇంటి ఆయన్ను ఏసేసింది...
నల్లటి ఇసుక ఎడారిలో పరిగెడుతున్న రంగు రంగుల గుర్రాలు..వీడియోవైరల్
నల్లటి ఇసుక ఎడారిలో పరిగెడుతున్న రంగు రంగుల గుర్రాలు..వీడియోవైరల్
ఎన్నడు లేని ఆఫర్లు..రూ. 4590కే వాషింగ్ మెషీన్, రూ.5,999కే టీవీ
ఎన్నడు లేని ఆఫర్లు..రూ. 4590కే వాషింగ్ మెషీన్, రూ.5,999కే టీవీ
ఈ రెండు చిరుతిండ్లు తింటే కాలేయం ఖతమే.. జాగ్రత్త పడకపోతే..
ఈ రెండు చిరుతిండ్లు తింటే కాలేయం ఖతమే.. జాగ్రత్త పడకపోతే..