Home remedies for clothes: బట్టలు రంగు పోకుండా ఎక్కువ కాలం మన్నాలా.. వీటిని కలపండి!

| Edited By: Ram Naramaneni

Nov 12, 2023 | 9:35 PM

ఎన్ని బట్టలు ఉన్నా.. ఇంకా కొత్తవి కొంటూనే ఉంటారు. బట్టలతోనే మన లుక్ అనేవి ఎలివేట్ అవుతుంది. స్టైలిష్ గా, మోడ్రన్ గా కనిపించాలన్నా, సింపుల్ గా కనిపించాలన్నా.. బట్టలతోనే సాధ్యం. చుడిదార్ వేసుకుంటే ఒక లుక్ వస్తుంది. జీన్స్ వేసుకుంటే మరో లువ్ ఎలివేట్ అవుతుంది. బట్టలు ఎలాంటివైనా.. మనం వాడే విధానం కూడా చూసుకోవాలి. ప్రతి సారీ బట్టలు ఒకేలా ఉండవు. ఒక్కో క్లాత్ ని బట్టి మనం కేర్ తీసుకుంటూ ఉండాలి. బట్టల్ని ఎలా పడితే అలా వాడకుండా..

Home remedies for clothes: బట్టలు రంగు పోకుండా ఎక్కువ కాలం మన్నాలా.. వీటిని కలపండి!
Clothes Washing
Follow us on

ఎన్ని బట్టలు ఉన్నా.. ఇంకా కొత్తవి కొంటూనే ఉంటారు. బట్టలతోనే మన లుక్ అనేవి ఎలివేట్ అవుతుంది. స్టైలిష్ గా, మోడ్రన్ గా కనిపించాలన్నా, సింపుల్ గా కనిపించాలన్నా.. బట్టలతోనే సాధ్యం. చుడిదార్ వేసుకుంటే ఒక లుక్ వస్తుంది. జీన్స్ వేసుకుంటే మరో లువ్ ఎలివేట్ అవుతుంది. బట్టలు ఎలాంటివైనా.. మనం వాడే విధానం కూడా చూసుకోవాలి. ప్రతి సారీ బట్టలు ఒకేలా ఉండవు. ఒక్కో క్లాత్ ని బట్టి మనం కేర్ తీసుకుంటూ ఉండాలి. బట్టల్ని ఎలా పడితే అలా వాడకుండా.. ఎప్పటికప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలి. కొన్ని బట్టలు అనేవి త్వరగా కలర్ షేడ్ అవుతూ ఉంటాయి. అలాంటి వాటి పట్ల కేర్ తీసుకోవాలి. అసలు బట్టలు కలర్ పోకుండా.. ఎక్కువ కాలం మన్నాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇప్పుడు చూద్దాం.

వాటిని ఫాలో అవ్వండి:

క్లాత్స్ అన్నీ ఒకేలా ఉండవు. కాబట్టి బట్టలు కొనేటప్పుడే ఎలా ఉతకాలో వాటిపై కొన్ని రకాల ఇన్ స్ట్రెక్షన్స్ రాసి ఉంటాయి. వాటిని తప్పనిసరిగా ఫాలో అయితే సరిపోతుంది.

ఇవి కూడా చదవండి

వేర్వేరుగా ఉతకండి:

చాలా మంది చేసే తప్పు ఏంటంటే.. బట్టలు అన్నింటినీ కలిపి ఒకేసారి ఉతుకుతారు. కానీ అది కరెక్ట్ కాదు. బట్టలు ఎక్కువ కాలం మన్నాలంటే.. రఫ్ అండ్ టఫ్ గా ఉన్నవి ఒకలా.. సున్నితంగా ఉండేవి, కలర్స్ బట్టి మరోలా వాష్ చేయాలి.

ఎక్కువ సేపు నానబెట్టకూడదు:

చాలా మందికి బట్టలు ఉతికేటప్పుడు ఎక్కువ సేపు నానబెట్టడం అలవాటు. అలాంటి వారు అరగంట లేదా గంట అంత కంటే ఎక్కువ సేపు నానబెట్టకూడదు. ఇలా చేస్తే త్వరగా కలర్స్ షేడ్ అయిపోయే ప్రమాదం. ఉంది.

వేడి నీటితో ఉతక కూడదు:

మురికి వదులుతుందని కొన్నింటిని వేడి నీటితో ఉతుకుతూంటారు. అలా కాకుండా నార్మల్ వాటర్ తోనే ఉతకాలి. లేదంటే కలర్స్ పాడయ్యే ప్రమాదం ఉంది. అంతే కాకుండా బట్టలు త్వరగా చిరిగి పోతాయి.

వీటిని ఎండలో ఆరబెట్టొద్దు:

కలర్ షేడ్ అయ్యే బట్టల్ని ఆరబెట్టేటప్పుడు ఎక్కువ ఎండలో ఆరబెట్టకూడదు. కాస్త నీడలో, గాలిలో ఆర బెట్టాలి.

నానబెట్టే నీటిలో వీటిని వేయండి:

బట్టలు నానబెట్టే నీటిలో వెనిగర్ లేదా యాపిల్ సైడర్ వెనిగర్ ని నీటిలో వేస్తే రంగులు త్వరగా పాడవ్వకుండా ఉంటాయి. అలాగే సాఫ్ట్ గా ఉంటాయి. ఈ వాసన నచ్చని వారు.. ఇప్పుడు సువాసన వచ్చే లిక్విడ్స్ చాలా ఉన్నాయి. వాటిని వాడినా పర్వలేదు.