Tips for Healthy Liver: ఈ ఆహారాలు కాలేయానికి చాలా ప్రమాదకరం.. వాటికి దూరంగ ఉండండి..!

|

Jun 26, 2022 | 1:44 PM

Tips for Healthy Liver: శరీరంలో కాలేయం ఆరోగ్యంగా ఉండటం చాలా ముఖ్యం. కాలేయం అనారోగ్యానికి గురైతే.. అనేక సమస్యలు తలెత్తుతాయి.

Tips for Healthy Liver: ఈ ఆహారాలు కాలేయానికి చాలా ప్రమాదకరం.. వాటికి దూరంగ ఉండండి..!
Health
Follow us on

Tips for Healthy Liver: శరీరంలో కాలేయం ఆరోగ్యంగా ఉండటం చాలా ముఖ్యం. కాలేయం అనారోగ్యానికి గురైతే.. అనేక సమస్యలు తలెత్తుతాయి. రోజు రోజుకు ఆరోగ్యం క్షీణిస్తుంది. శరీరంలోని ఇతర అవయవాలూ పాడైపోవడం మొదలవుతుంది. అది ప్రాణాపాయ స్థితికి దారి తీస్తుంది. అందుకే కాలేయాన్ని భద్రంగా కాపాడుకోవాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తుంటారు. ఒకవేళ కాలేయం అనారోగ్యానికి గురైతే.. కాలేయ మార్పిడీ ద్వారా జీవితాన్ని కాపాడుకోవచ్చు. అయితే, ఆ చికిత్స విజయవంతం అవుతుందనే గ్యారెంటీ లేదు. అందుకే కాలెయం ఆరోగ్యంగా ఉంచుకునే ప్రయత్నం చేయాలి. అయితే, కాలేయం అనారోగ్యానికి ప్రధాన కారణం.. మారుతున్న జీవన శైలి, బద్ధకం, రుచి కోసం జంక్ ఫుడ్స్ విపరీతంగా తినడం. ఇవి ఫ్యాటీ లివర్ సమస్యకు దారి తీస్తుంది. దీన్ని సీరియస్‌గా తీసుకోకపోవడంతో అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి.

కాలేయం ఆరోగ్యంగా ఉండటానికి ఆకుపచ్చ కూరగాయలు, పండ్లు రోజూవారి ఆహారంలో చేర్చుకోవాలి. నీళ్లు ఎక్కువగా తాగడం వల్ల కాలేయం ఆరోగ్యంగా ఉంటుందని నిపుణులు సూచిస్తున్నారు. కాగా, కాలేయం క్షీణించడానికి కారణమయ్యే ఆహారాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం..

జంక్ ఫుడ్..
ఇవి రుచికరమైనవి కావచ్చు, కానీ కాలేయం సహా శరీరంలోని అన్ని అవయవాలను తీవ్రంగా దెబ్బతీస్తాయి. పిల్లలు, పెద్దలు కూడా బర్గర్‌లు, పిజ్జా, ఫ్రెంచ్ ఫ్రైస్‌ను విపరీతంగా తింటారు. ఇలాంటి జంక్ ఫుడ్స్ ని నిరంతరం తీసుకోవడం వల్ల లివర్ ఆరోగ్యం క్షీణించడం మొదలవుతుంది. వీటిని తినడం వలన ఫ్యాటీ లివర్ బారిన పడటం ఖాయం. జీర్ణవ్యవస్థ పనితీరు కూడా క్షీణిస్తుంది. కడుపు ఉబ్బరం, గ్యాస్ వంటి సమస్యలు తలెత్తుతాయి. అందుకే జంక్ ఫుడ్స్ తినే అలవాట్లను మానుకోవాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.

ఇవి కూడా చదవండి

నాన్ వెజ్..
కొందరికి నాన్ వెజ్ అంటే చాలా ఇష్టం. నిత్యం ఈ తరహా ఫుడ్ తింటుంటారు. నాన్ వెజ్‌లో ప్రోటీన్, ఇతర పోషకాలు ఉంటాయి. అయితే మాంసాన్ని అధికంగా తీసుకోవడం వల్ల కిడ్నీ, కాలేయం, ఇతర భాగాల్లో కొవ్వు బాగా పేరుకుంటుంది. కాలేయ ఆరోగ్యం క్షీణిస్తుంది. వారానికి ఒకటి లేదా రెండుసార్లు రెడ్ మీట్ తినొచ్చు. అతిగా తింటే ముప్పు తప్పదని హెచ్చరిస్తున్నారు నిపుణులు.

తీపి పదార్థాలు..
కొంతమందికి స్వీట్లు తినడం చాలా ఇష్టం. విపరీతంగా స్వీట్స్ తింటుంటారు. అయితే, ఇది ఆరోగ్యానికి చాలా హానీ తలపెడుతుంది. తీపి పదార్థాలు ఎక్కువగా తినే వారు మధుమేహం బారిన పడటం ఖాయం అని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అలాగే స్వీట్స్ అధికంగా తినడం వల్ల కాలేయం కూడా దెబ్బతింటుందని చెబుతున్నారు.