Vitamin B12: విటమిన్ బి12 లోపం ఉందా.. అయితే మీకు ఆ సమస్యలు తప్పవు..

|

Jun 24, 2022 | 11:18 AM

శరీరానికి విటమిన్లు, ప్రోటీన్లు ఎంతో అవసరం. వీటి లోపం వల్ల బాడీలో చాలా సమస్యలు ఏర్పడతాయి. శరీరానికి తిగిన మోతాదులో విటమిన్లు అవసరం...

Vitamin B12: విటమిన్ బి12 లోపం ఉందా.. అయితే మీకు ఆ సమస్యలు తప్పవు..
Vitamin B12
Follow us on

శరీరానికి విటమిన్లు, ప్రోటీన్లు ఎంతో అవసరం. వీటి లోపం వల్ల బాడీలో చాలా సమస్యలు ఏర్పడతాయి. శరీరానికి తిగిన మోతాదులో విటమిన్లు అవసరం. విటమిన్ ఎ, విటమిన్‌ బి, విటమిన్ సి, విటమిన్ డి, విటమిన్‌ ఇ, విటమిన్‌ కెతో విటమిన్‌ బి12 కూడా ఎంతో అవసరం.. ఈ విటమిన్ బి12 లోపం వల్ల అనేక రకాల అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది. ఈ సమస్యను ఎదుర్కొవడానికి విటమిన్ బి12 పుష్కలంగా ఉండే ఆహారాన్ని తీసుకోవాల్సిందే. మారుతున్న జీవన శైలి కారణంగానే ఈ విటమిన్‌ లోపాలు వస్తున్నాయని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. విటమిన్ బి12 లోపం వల్ల శరీరంలో ఎలాంటి లక్షణాలు కనిపిస్తాయో.. దానిని నివారించే మార్గాలేంటో ఇప్పుడు చూద్దాం…

విటమిన్‌ బి12 లోపం చర్మం పసుపు రంగులోకి మారుతుంది. అప్పుడు అప్రమత్తంగా ఉండాలని నిపుణులు చెబుతున్నారు. కాబట్టి ఇలాంటి సమస్యతో బాధపడుతుంటే తప్పకుండా వైద్యులను సంప్రదించాలని సూచిస్తున్నారు. విటమిన్‌ బి12 లోపంతో క్రమం తప్పకుండా తల నొప్పి వస్తుంగని వైద్య నిపుణులు వివరిస్తున్నారు. విటమిన్ B12 లోపం వల్ల కొన్నిసార్లు కడుపు సంబంధిత సమస్యలు కూడా వచ్చే అవకాశాలున్నాయట. విరేచనాలు, మలబద్ధకం, అపానవాయువు, కడుపులో గ్యాస్ సమస్యలు వచ్చే అవకాశాలున్నాయని నిపుణులు చెబుతున్నారు. అంతే కాకుండా పదే పదే తలతిరుగుతున్నట్లు అనిపిస్తే అది కూడా విటమిన్‌ బి12 లోపమేనని వివరిస్తున్నారు.

వీటిని తీసుంటే పుష్కలంగా బి12

ఇవి కూడా చదవండి

చేపల్లో విటమిన్ బి12 అధికంగా లభిస్తుంది. ట్యూనా, సాల్మన్, సార్డినెస్ , ట్రౌట్ వంటి వివిధ రకాల చేపలను ఆహారంగా తీసుకోవటం ద్వారా శరీరానికి అవసరమైన బి 12 విటమిన్ అందుతుంది.  పాల ద్వారా విటమిన్ బి 12 లభిస్తుంది. అందుకే వైద్య నిపుణులు బి 12 లోపాన్ని నివారించటానికి ప్రతిరోజు పాలు తాగమని సూచిస్తుంటారు. పాలు తాగటం వల్ల అదనంగా కాల్సియంతోపాటు, విటమిన్ డి కూడా లభిస్తాయి. పెరుగులో  కూడా  విటమిన్ బి 12 అధికంగా ఉంటుంది. కాల్షియంతోపాటు, విటమిన్ డి, ఇతర ప్రోబయోటిక్స్ పెరుగులో సమృద్ధిగా దొరుకుతాయి. ప్రతిరోజు ఉడికించిన రెండు గుడ్లు తినటం వల్ల శరీరానికి కావాల్సిన విటమిన్ బి 12 ను అందిస్తాయి. ఉడికించిన రెండు గుడ్ల నుండి 1.6 మైక్రోగ్రాముల విటమిన్ బి 12 అందుతుంది.

 

Note: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే ఇచ్చింది. మీరు ఎలాంటి పద్ధతులు పాటించాలన్నా వైద్యులు, నిపుణులను సంప్రదించాలి.

మరిన్ని హెల్త్‌ వార్తలకు ఇక్కడ క్లిక్‌ చేయండి