Vaccination: త్వరలో చిన్నారులకు కరోనా వ్యాక్సిన్.. సన్నాహాలు ప్రారంభించిన ప్రైవేట్ ఆసుపత్రులు!

|

Nov 13, 2021 | 12:48 PM

దేశంలోని చిన్నారులకు కరోనా వ్యాక్సిన్‌లను ఇచ్చే కార్యక్రమం త్వరలో ప్రారంభం కానుంది. దీనికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం ఇంకా ఎలాంటి ప్రకటన చేయనప్పటికీ, చాలా ఆసుపత్రులు ఇప్పటికే దాని సన్నాహాలు ప్రారంభించాయి.

Vaccination: త్వరలో చిన్నారులకు కరోనా వ్యాక్సిన్.. సన్నాహాలు ప్రారంభించిన ప్రైవేట్ ఆసుపత్రులు!
Vaccination For Children
Follow us on

Vaccination:  దేశంలోని చిన్నారులకు కరోనా వ్యాక్సిన్‌లను ఇచ్చే కార్యక్రమం త్వరలో ప్రారంభం కానుంది. దీనికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం ఇంకా ఎలాంటి ప్రకటన చేయనప్పటికీ, చాలా ఆసుపత్రులు ఇప్పటికే దాని సన్నాహాలు ప్రారంభించాయి. మీడియా నివేదికల ప్రకారం, కోల్‌కతాలోని చాలా ప్రైవేట్ ఆసుపత్రులు పిల్లలకు టీకా కేంద్రాలను నిర్మిస్తున్నాయి. వారు పిల్లల డేటాబేస్‌లను సేకరిస్తున్నారు. అలాగే ఎక్కువ మంది పిల్లలకు టీకాలు వేయడానికి పాఠశాలలతో టై అప్ అవుతున్నారు.

2-18 సంవత్సరాల పిల్లలకు కోవాక్సిన్ వస్తుంది..

కొన్ని ప్రైవేట్ ఆసుపత్రులు కూడా కోవాక్సిన్ మోతాదులను కొనుగోలు చేయడం ప్రారంభించాయి. భారత్ బయోటెక్ కోవాక్సిన్ ప్రస్తుతం 18+ వయసు వారికి ఇస్తున్నారు. అదే వ్యాక్సిన్‌ని పిల్లలకు ఇవ్వడంపై కూడా కంపెనీ ప్రయోగాలు చేసింది. పిల్లల కోసం కోవాక్సిన్‌కు సబ్జెక్ట్ ఎక్స్‌పర్ట్ కమిటీ (SEC) అత్యవసర అనుమతిని ఇచ్చింది. అయితే, డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా (DCGI) నుండి ఇంకా ఆమోదం పొందాల్సి ఉంది. 2 నుంచి 18 ఏళ్ల లోపు పిల్లలకు ఈ వ్యాక్సిన్‌ వేయనున్నారు. దీని కోసం డీసీజీఐ ఆమోదం త్వరలో వచ్చే అవకాశం ఉందని భావిస్తున్నారు.

ఈ నేపధ్యంలో పిల్లలకు టీకాలు వేయడం త్వరలో ప్రారంభమవుతుందని, కాబట్టి వారి సన్నాహాలు పూర్తి చేయాలని ఆసుపత్రులు చెబుతున్నాయి. కోల్‌కతాలోని ఆర్‌ఎన్ ఠాగూర్ ఇంటర్నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ కార్డియాక్ సైన్సెస్ శుక్రవారం 20,000 డోస్ కోవాక్సిన్ కోసం ఆర్డర్ చేసింది. కొన్ని వారాల క్రితమే తమదగ్గర కోవాక్సిన్ మోతాదు అయిపోయిందనీ, అయితే డిమాండ్ చాలా తక్కువగా ఉన్నందున ఆర్డర్ చేయలేదని ఆసుపత్రి యాజమాన్యం చెబుతోంది. ఇప్పుడు పిల్లల టీకా త్వరలో ఆమోదించబడుతుందని భావిస్తున్నారు, కాబట్టి తాము మళ్లీ కోవాక్సిన్ టీకా మోతాదును కొనుగోలు చేస్తున్నామని ఆసుపత్రి వర్గాలు పేర్కొన్నాయి. ఇక పలు పాఠశాలలు, నివాస సముదాయాలు, కార్పొరేట్ సంస్థలతో చర్చలు జరుపుతున్నట్లు నారాయణ హెల్త్ హాస్పిటల్ చెబుతోంది. గత కొద్ది రోజులుగా రెసిడెన్షియల్ వెల్ఫేర్ అసోసియేషన్లు, కార్పొరేట్ సంస్థల నుంచి చిన్నారులకు వ్యాక్సినేషన్‌పై విపరీతమైన ఆరా తీస్తున్నారు.

డేటాబేస్ కలిగి ఉండటం క్రౌడ్ కంట్రోల్‌లో సహాయపడుతుంది.

అపోలో హాస్పిటల్స్ తన యాప్‌లో పిల్లల డేటాను స్వయంగా అప్‌లోడ్ చేసే సదుపాయాన్ని కూడా అందిస్తోంది. తద్వారా టీకా ప్రారంభంలోనే డిమాండ్‌ను అంచనా వేయవచ్చు. ఇటువంటి పధ్ధతి కారణంగానీ 18+ వ్యాక్సినేషన్ ప్రారంభమైనప్పుడు, అపోలో గ్రూప్ ఆసుపత్రులలో చాలా మందికి వేగంగా వ్యాక్సిన్ ఇవ్వగలిగారు. అందువల్ల, ముందుగానే డేటాబేస్ కలిగి ఉండటం టీకా అవసరార్ధులను నియంత్రించడంలో సహాయపడుతుంది.

పిల్లలకు ఏ టీకా ఆమోదించారు?

నేషనల్ డ్రగ్స్ రెగ్యులేటర్ సబ్జెక్ట్ ఎక్స్‌పర్ట్ కమిటీ (SEC) పిల్లలలో అక్టోబర్‌లో అత్యవసర ఉపయోగం కోసం కోవాక్సిన్‌ని సిఫార్సు చేసింది. ఈ వ్యాక్సిన్‌కు ఇంకా డీజీసీఐ నుంచి అనుమతి రాలేదు. ఇది 2-18 సంవత్సరాల పిల్లలకు ఇచ్చేలా అనుమతి ఇవ్వవచ్చు అనుకుంటున్నారు.

పిల్లలకు టీకాలు వేయడానికి ప్రభుత్వం జయకోవ్-డిని కూడా ఆమోదించింది . జైకోవ్-డిని జైడస్ కాడిలా నిర్మించారు. డిజిసిఐ ఆగస్టులో కాడిలాను ఆమోదించింది. ఈ వ్యాక్సిన్‌కు 12 ఏళ్లు పైబడిన వారందరికీ ఎమర్జెన్సీ యూజ్ అథారిటీ (EUI) ఆమోదం లభించింది.

జైకోవ్-డి ఆగస్టులో ఆమోదం పొందింది.. ఇప్పటి వరకు ఎందుకు మార్కెట్లో లేదు?

  • మీడియా నివేదికల ప్రకారం, వ్యాక్సిన్ ధరను రూ.1900గా ఉంచాలని కంపెనీ కోరుతోంది. అదే సమయంలో, వ్యాక్సిన్ ధరను తగ్గించడానికి ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. ఇందుకోసం ప్రభుత్వం, కంపెనీ మధ్య చర్చలు కూడా జరగగా ఇప్పుడు ధర విషయంలో ఇద్దరి మధ్య ఒప్పందం కుదిరింది.
  • మూడవ దశ ట్రయల్‌లో వ్యాక్సిన్ సమర్థత 66%. మొదటి 2 ట్రయల్స్‌లో కూడా, ఎటువంటి దుష్ప్రభావాలు కనిపించలేదు. అయితే మూడవ దశ ట్రయల్స్ డేటాను కంపెనీ ఇంకా విడుదల చేయలేదు. వ్యాక్సిన్‌ ఇవ్వడంలో జాప్యానికి ఇది కూడా ఒక కారణం.
  • వ్యాక్సిన్ లభ్యత కూడా ఒక సమస్య. ప్రస్తుతం, కంపెనీ ప్రతి నెలా 10 మిలియన్ డోస్‌ల వ్యాక్సిన్‌ను అందించడం గురించి మాట్లాడుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో మొదట్లో డిమాండ్‌కు అనుగుణంగా సరఫరా చేయకపోవడం కూడా సవాలుగా మారింది.

ఇవి కూడా చదవండి: Zika Virus: పెరుగుతున్న జికా వైరస్ వ్యాప్తి.. గర్భిణీలు మరింత జాగ్రత్తగా ఉండాలి.. లేదంటే..

Health with Ghee: మన ఆరోగ్యానికి ఏ నెయ్యి మంచిది? పసుపు నెయ్యి.. తెల్లని నెయ్యి మధ్య తేడాలేంటి?

CBSE Exams: సీబీఎస్‌ఈ..ఐసీఎస్ఈ పరీక్షలు ఆన్‌లైన్ విధానంలో నిర్వహించాలి..సుప్రీంకోర్టులో పిటిషన్‌!