Kitchen Hacks: ఈ ఇంటి చిట్కాలను ఉపయోగించి.. బొద్దింకలను బయటకు తరిమికొట్టండి!!

| Edited By: Ram Naramaneni

Sep 27, 2023 | 7:24 PM

మన ఇంట్లో తిరిగే కీటకాల్లో బొద్దింకలు కూడా ఒకటి. వీటిని చూడగానే చాలా మందికి అసహ్యం కలుగుతుంది. ముఖ్యంగా కిచెన్ లో ఇవి ఎక్కువగా కినిపిస్తూ ఉంటాయి. ఎక్కడ పడితే అక్కడ పాకుతూ ఉంటాయి. ఒక్కోసారి వంట పాత్రలపై కూడా కనిపిస్తాయి. దీంతో మహిళలకు ఎంతో చిరాకు వస్తూ ఉంటాయి. ఎంత బయటకు పంపించనా వస్తూనే ఉంటాయి. వీటి వల్ల అనారోగ్య సమస్యలు కూడా వస్తాయి. వీటి వల్ల అనేక బ్యాక్టీరియాలు, వైరస్ లు వ్యాపిస్తూ ఉంటాయి. దీంతో ఇంట్లోని వారు..

Kitchen Hacks: ఈ ఇంటి చిట్కాలను ఉపయోగించి.. బొద్దింకలను బయటకు తరిమికొట్టండి!!
Cockroaches
Follow us on

మన ఇంట్లో తిరిగే కీటకాల్లో బొద్దింకలు కూడా ఒకటి. వీటిని చూడగానే చాలా మందికి అసహ్యం కలుగుతుంది. ముఖ్యంగా కిచెన్ లో ఇవి ఎక్కువగా కినిపిస్తూ ఉంటాయి. ఎక్కడ పడితే అక్కడ పాకుతూ ఉంటాయి. ఒక్కోసారి వంట పాత్రలపై కూడా కనిపిస్తాయి. దీంతో మహిళలకు ఎంతో చిరాకు వస్తూ ఉంటాయి. ఎంత బయటకు పంపించనా వస్తూనే ఉంటాయి. వీటి వల్ల అనారోగ్య సమస్యలు కూడా వస్తాయి. వీటి వల్ల అనేక బ్యాక్టీరియాలు, వైరస్ లు వ్యాపిస్తూ ఉంటాయి. దీంతో ఇంట్లోని వారు జబ్బు పడుతూ ఉంటారు. అయితే ఇంట్లోనే చిన్న చిన్న చిట్కాలను ఉపయోగించుకుని వీడి బెడద నుంచి తప్పించుకోవచ్చు. అవి ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

బిర్యానీ ఆకులు:

బిర్యానీ ఆకులను ఉపయోగించి బొద్దింకలను బయటకు తరిమేయవచ్చు. బొద్దింకల నివారణకు బిర్యానీ ఆకులు బాగా హెల్ప్ చేస్తాయి. బొద్దింకలు ఎక్కువగా తిరిగే చోట బిర్యానీ ఆకులను ఉంచితే.. అవి పారిపోతాయి.

ఇవి కూడా చదవండి

కీరదోస:

కీర దోస వాసన అంటే బొద్దింకలకు నచ్చదు. బొద్దింకలు తిరిగే చోట కీరదోస ముక్కలను ఉంచితే బొద్దింకల సమస్య తగ్గుతుంది.

వెనిగర్:

నీటిలో కొద్దిగా వెనిగర్ కలిపి బొద్దింకలు తిరిగే చోట పెడితే.. ఆ స్పెల్ కు కూడా బొద్దిలు పారి పోతాయి.

దాల్చిన చెక్క:

దాల్చిన చెక్క నుంచి కూడా ఒక లాంటి ఘాటు వాసన ఉంటుంది. బొద్దింకలు తిరిగే చోట దాల్చిన చెక్క ముక్క పెట్టినా లేదా పొడి చల్లినా మంచి రిజల్ట్ కనిపిస్తుంది.

వెల్లుల్లి రెబ్బలు:

వెల్లుల్లి ఘాటు వాసనకు కూడా బొద్దింకలు వెళ్లిపోతాయి. కొన్ని వెల్లుల్లి రెబ్బలను పొట్టు ఒలిచి బొద్దింకలు తిరిగే చోట పెడితే.. వాటి సమస్య తగ్గుతుంది.

నిమ్మ రసం:

బొద్దింకలు తిరిగే చోట నిమ్మ రసాన్ని స్ప్రే చేయడం వల్ల.. ఆ స్మెల్ కు బొద్దింకలు నశిస్తాయి.

లావెండర్ – పుదీనా ఆయిల్:

కొద్దిగా నీటిలో లావెండర్, పుదీనా, ట్రీ ట్రీ ఆయిల్ చుక్కలను కలిపి.. బొద్దింకలు ఉన్న చోట స్ప్రే చేస్తే.. వాటి సమస్య తగ్గుతుంది.

ఇలా బొద్దింకల బెడద తగ్గించుకునేందుకు ఇంటి చిట్కాలను కూడా ఉపయోగించుకోవచ్చు.

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

గమనిక: ఇది నిపుణుల నుంచి సేకరించిన సమాచారం. దీన్ని ఫాలో అయ్యే ముందు ఒకసారి వైద్యుల్ని సంప్రదించడం మేలు.