Urad Dal Benefits: మినపప్పుతో అదిరిపోయే ఆరోగ్య ప్రయోజనాలు.. పురుషుల్లో ఆ సమస్యలు కూడా దూరం

|

Feb 03, 2023 | 8:56 PM

మినపప్పులో తగినంత మొత్తంలో ఇనుము లభిస్తుంది. ఇది శరీరంలో ఎనర్జీ లెవెల్ పెంచడానికి సహాయపడుతుంది. ఎర్ర రక్త కణాల ఏర్పాటులో ఇవి చాలా కీలకం.

Urad Dal Benefits: మినపప్పుతో అదిరిపోయే ఆరోగ్య ప్రయోజనాలు.. పురుషుల్లో ఆ సమస్యలు కూడా దూరం
Urad Dal
Follow us on

మినపప్పు (ఉరద్ దాల్) ప్రతి ఒక్కరి వంటగదిలో కచ్చితంగా ఉంటుంది. ఇది రుచికరమైనదిగా ఉండటమే కాకుండా, ఆరోగ్యానికి చాలా ఉపయోగకరం. అయితే ఈ మినపప్పును ప్రత్యేక సందర్భాలలో మాత్రమే వినియోగిస్తారు. ఎక్కువగా దోసెల్లో మాత్రమే ఉపయోగిస్తుంటారు. మినపప్పు లో విటమిన్స్, క్యాల్షియం, ప్రొటీన్లు సమృద్ధిగా ఉంటాయి. ఇవి ఆర్థరైటిస్, ఆస్తమా, పక్షవాతం వంటి సమస్యలు తొలగించడానికి సహాయపడతాయి. అలాగే మినపప్పు తీసుకోవడం వల్ల తల నొప్పి, జ్వరం, ఇంఫ్లమేషన్ వంటి సమస్యలు దూరమవుతాయి. అలాగే వీటిలో తగినంత మొత్తంలో ఇనుము లభిస్తుంది. ఇది శరీరంలో ఎనర్జీ లెవెల్ పెంచడానికి సహాయపడుతుంది. ఎర్ర రక్త కణాల ఏర్పాటులో ఇవి చాలా కీలకం. వీటిని తరచుగా సుకోవడం వల్ల శరీరంలో ఐరన్ లోపాన్ని అధిగమించవచ్చు. ఫైబర్ అధికంగా ఉండే ఆహారం డయాబెటిక్ రోగులకు ప్రయోజనకరంగా పరిగణించబడుతుంది. ఉరద్‌ దాల్‌లో ఫైబర్ తగినంత పరిమాణంలో లభిస్తుంది. ముఖ్యంగా రక్తంలో గ్లూకోజ్ స్థాయిని సమతుల్యం చేసేందుకు సహాయపడుతుంది.

ఇక ఎముకల ఆరోగ్యానికి మేలు చేసే కాల్షియం, పొటాషియం, ఐరన్ వంటి పోషకాలు మినపప్పులో ఉంటాయి. దీనిని తరచుగా తీసుకుంటే ఎముకలకు సంబంధించిన సమస్యలను దూరం చేసుకోవచ్చు.అలాగే మెగ్నీషియం, ఫైబర్, పొటాషియం, ఇతర పోషకాలు కూడా మెండుగా ఉంటాయి. ఇవి గుండె ఆరోగ్యానికి మేలు చేస్తాయి. కాయధాన్యాలు తీసుకోవడం వల్ల కొలెస్ట్రాల్ స్థాయిలు తగ్గుతాయి. ఇలా చేయడం వల్ల గుండె సంబంధిత వ్యాధులకు దూరంగా ఉండవచ్చు. పప్పులో ఉండే ఫైబర్ జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. ఇది ప్రేగు కదలికను సులభతరం చేస్తుంది. అలాగే ఇతర ఉదర సమస్యలను తగ్గించడంలో సహాయపడుతుంది. ఇక కొందరికి ఎక్కువ వేడి చేసిన లేదా చలవ చేసిన ముక్కు నుంచి రక్తం కారుతుంది. అటువంటి వాళ్లు మినపప్పుని మెత్తగా రుబ్బి దానిని రక్తం కారుతున్న ప్రదేశంలో పెడితే సమస్య పోతుంది. అలాగూ మినపప్పుని కొద్దిగా పాలల్లో వేసి మెత్తని పేస్టులాగ చేసి దానిలో కొద్దిగా నిమ్మరసం, తేనె వేసి ముఖానికి అప్లై చేసుకుంటే పింపుల్స్ సమస్య పోతుంది. ఇక పురుషుల ఆరోగ్యానికి కూడా మినప్పప్పు చాలా మంచిది.  ముఖ్యంగా లైంగిక సమస్యలను తొలగించడంలో బాగా సహాయపడుతుంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి..