చలికాలంలో చాలా మందికి టాన్సిల్ సమస్యలు తీవ్రంగా వేధిస్తుంటాయి. దీంతో గొంతు, చెవిలో నొప్పి, తాగునీటి సమస్య, దవడలలో విపరీతమైన నొప్పి వంటి సమస్యలు మరింత బాధిస్తుంటాయి. టాన్సిల్స్ గొంతు దగ్గర రెండు వైపులా గ్రంథుల మాదిరిగా ఉంటాయి. కొన్నిసార్లు బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ కారణంగా.. మరికొన్ని సార్లు ఆహారం వలన.. జలుబు వలన కూడా ఈ సమస్య వచ్చే ప్రమాధముంది. గొంతు, చెవితోపాటు.. దవడలలో నొప్పి.. వాపు ఉంటుంది. దీంతో ఆహారం తీసుకోవడం కష్టంగా ఉంటుంది. ఈ టాన్సిల్స్ సమస్యను తగ్గించుకోడవడానికి అనేక చికిత్స తీసుకుంటుంటారు. అయినా ఈ సమస్య నుంచి ఉపశమనం లభించదు. ఈ టాన్సిల్స్ సమస్యను తగ్గించుకోవడానికి కొన్నిసార్లు ఇంటి నివారణలు కూడా ఉపయోగపడతాయి. ఇంటి నివారణలతో టాన్సిల్స్ సమస్యను తగ్గించుకోవచ్చు. అదేలాగో తెలుసుకుందామా.
☛ టాన్సిల్స్ సమస్య తీవ్రంగా వేధిస్తున్నప్పుడు ఉప్పు నీటిని పుకిలించాలి. ఇందుకోసం గ్లాసు వేడి నీటిలో ఒక టీస్పూన్ ఉప్పు వేసి పుకిలించాలి. ఇలా రోజుకు రెండు మూడు సార్లు ఉప్పు నీటితో పుకిలిస్తే కొద్ది రోజుల్లో టాన్సిల్స్ సమస్య.. వాపు నుంచి ఉపశమనం లభిస్తుంది.
☛ టాన్సిల్స్ నొప్పి, వాపు నుంచి ఉపశమనం పొందడానికి పాలు, తేనె కలిపి తీసుకోవాలి. రోజూ రాత్రి పడుకునే ముందు గొరువెచ్చని పాలలో తేనె కలిపి తాగాలి. ఇలా చేస్తే నొప్పి నుంచి త్వరగా ఉపశమనం లభిస్తుంది. అంతేకాకుండా గొంతు ఇన్ఫెక్షన్లను తగ్గిస్తుంది.
☛ టాన్సిల్స్ సమస్యను తగ్గించుకోవడానికి పసుపు, నల్ల మిరియాల పాలు కూడా ఉపయోగపడతాయి. ఇందుకోసం రాత్రి పడుకునే ముందు ఒక గ్లాసు పాలను వేడి చేసి అందులో కొద్దిగా పసుపు, ఎండుమిర్చి లేదా నల్ల మిరియాల పొడి వేసి తీసుకోవాలి. ఇలా చేయడం వలన టాన్సిల్స్ నొప్పి, వాపు సమస్య తగ్గుతుంది.
Year Ender 2021: ఈ ఏడాది దుమ్మురేపిన మాస్ మసాలా సాంగ్స్.. ఊ అంటావా అంటూ.. ప్రేక్షకులను ఊపేశాయి..