Tomato Effects: టమోటాలు తినే అలవాటుందా..? ఈ సమస్యలుంటే ఇప్పటినుంచే మానేయడం మంచిది.. లేకపోతే..

|

Jan 30, 2023 | 8:24 AM

పుల్లగా ఉండే టమోటాలు ఆహారం రుచిని బాగా పెంచుతాయి. టమోటాలు సలాడ్లు లేదా కూరగాయలు అన్ని రకాల వంటలలో ఉపయోగిస్తారు.

Tomato Effects: టమోటాలు తినే అలవాటుందా..? ఈ సమస్యలుంటే ఇప్పటినుంచే మానేయడం మంచిది.. లేకపోతే..
Tomatoes
Follow us on

పుల్లగా ఉండే టమోటాలు ఆహారం రుచిని బాగా పెంచుతాయి. టమోటాలు సలాడ్లు లేదా కూరగాయలు అన్ని రకాల వంటలలో ఉపయోగిస్తారు. చట్నీల నుంచి ఎన్నో రకల వంటలను టామాటాలతో తయారు చేస్తారు. టొమాటోలో పోషకాలు పుష్కలంగా ఉన్నాయి. ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు, కాల్షియం, ఫాస్పరస్ మరియు ఆరోగ్యానికి మేలు చేసే అనేక విటమిన్లు ఉంటాయి. కానీ, ఈ టమోటాలు అనేక వ్యాధులకు కూడా కారణం కావచ్చు. టొమాటోలో ఉండే గుణాలు కొందరి ఆరోగ్యానికి హాని కలిగిస్తాయని ఆరోగ్య నిపుణులు పేర్కొంటున్నారు. టమోటాలు ఎవరు, ఎందుకు తినకూడదో ఇప్పుడు తెలుసుకుందాం.

  1. అజీర్ణం: టమోటాలలో ఉండే సాల్మొనెల్లా బ్యాక్టీరియా జీర్ణక్రియకు హానికరం. దీని వల్ల విరేచనాలు అవుతాయి. ఇది గ్యాస్, అసిడిటీకి కూడా కారణం కావచ్చు. ఇది కడుపు నొప్పికి కూడా కారణం అవుతుంది. అందుకే జీర్ణక్రియకు సంబంధించిన సమస్య ఉంటే టమోటాలు తినడం మానేయాలి.
  2. రాళ్లకు కారణం: టొమాటోలో ఆక్సలేట్ నాసికా పదార్థం రాళ్లను కలిగిస్తుంది. టమోటాలు ఎక్కువగా తినడం వల్ల కిడ్నీ సమస్యలు వస్తాయి. తక్కువ నీరు తాగే వారికి ఇలాంటి సమస్యలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. మీకు కిడ్నీలో రాళ్లు ఉంటే టమోటాలు తినడం మానుకోండి.
  3. చర్మానికి ప్రమాదకరం: టొమాటో చర్మ సమస్యలను దూరం చేయడానికి ఉపయోగిస్తారు. ఇది ముఖాన్ని మెరిసేలా చేస్తుంది. కానీ ఇందులో ఉండే లైకోపిన్ వల్ల చర్మం రంగు మారవచ్చు. ఇది చర్మ అలెర్జీలకు కూడా కారణం కావచ్చు. అందుకు అలెర్జీ సమస్యతో బాధపడుతున్న వారు వైద్యులను సంప్రదించాలని పేర్కొంటున్నారు.
  4. కీళ్ళ నొప్పి: టమోటాలు తినడం వల్ల కీళ్ల నొప్పులకు హాని కలుగుతుంది. ఇందులో సోలనిన్ ఉంటుంది. ఇది కీళ్ల నొప్పులు, వాపులను పెంచుతుంది. కీళ్ల నొప్పులు ఉంటే టమోటాలు తినడం మానేయాలి. లేకపోతే వైద్యులను సంప్రదించిన అనంతరం తినాలని సూచిస్తున్నారు.
  5. ఇవి కూడా చదవండి

మరిన్ని హెల్త్ వార్తల కోసం..