Yoga: ఈ ఆసనాలు చేస్తే మానసిక ప్రశాంతతతో పాటు.. ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు.. ఓ సారి ట్రై చేయండి..

| Edited By: Anil kumar poka

Dec 13, 2022 | 9:39 AM

మనస్సు ప్రశాంతత కోసం యోగసనాలు చేస్తూ ఉంటాం. అయితే కొన్ని రకాల ఆసనాలతో కొన్ని రకాల ప్రయోజనాలు ఉన్నాయి. చాలా మంది శారీరక ఆరోగ్యం కోసం వ్యాయమాలు చేస్తుంటారు. అయితే కొన్ని యోగసనాలతో మానసిక ప్రశాంతత..

Yoga: ఈ ఆసనాలు చేస్తే మానసిక ప్రశాంతతతో పాటు.. ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు.. ఓ సారి ట్రై చేయండి..
Uttanasana
Follow us on

మనస్సు ప్రశాంతత కోసం యోగసనాలు చేస్తూ ఉంటాం. అయితే కొన్ని రకాల ఆసనాలతో కొన్ని రకాల ప్రయోజనాలు ఉన్నాయి. చాలా మంది శారీరక ఆరోగ్యం కోసం వ్యాయమాలు చేస్తుంటారు. అయితే కొన్ని యోగసనాలతో మానసిక ప్రశాంతత కూడా లభిస్తోంది. చాలా మంది మానసిక ప్రశాంతత లేక కుంగిపోతూ ఉంటారు. ఆసమయంలో ఏం చేయాలో కూడా పాలుపోదు. వెంటనే మానసిక ప్రశాంతత కోసం ఈ ఆసనాలు చేస్తే వెంటనే రిలాక్స్ అయిపోవచ్చు అంటున్నారు యోగా నిపుణులు. శారీరక ఆరోగ్యం కోసం పలు రకాల వ్యాయామాలు ఉంటాయి కానీ.. మానసిక ఆరోగ్యం కోసం కూడా యోగా సరైన ఎంపిక. యోగా శారీరక, మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. ప్రస్తుత కాలంలో చాలా మంది మానసిక ఆరోగ్యంపై శ్రద్ధ తీసుకుంటున్నారు. నేటి ఆధునిక యుగంలో ప్రతి వ్యక్తి తీవ్ర ఒత్తిడికి గురవుతున్నారు. అది ఏరకంగా అయినా ప్రతి మనిషిని కొన్ని రకాల పరిస్థితులు ఒత్తిడిని పెంచేస్తున్నాయి. ఈదశలో యోగా మానసిక ఆరోగ్యానికి అపారమైన ప్రయోజనాలను అందిస్తుంది. మానసిక స్థితిని మెరుగుపరచడం, ఏకాగ్రతను కల్పించడం, ఒత్తిడి, ఆందోళన నుంచి ఉపశమనం పొందడం, నిరాశ, నిద్రలేమి లక్షణాలను మెరుగుపరచడం వంటి ప్రయోజనాలను అందిస్తుంది. అయితే మానసిక ఆరోగ్యానికి ఉపయోగపడే ఉత్తమమైన యోగాసనాలు గురించి తెలుసుకుందాం.

ఉత్తనాసనం

మనిషి మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో ఉత్తనాసనం బాగా ఉపయోగపడుతుంది. ఈఆసనం వెనుక కండరాలపై పనిచేస్తుంది. బలం, వశ్యతను మెరుగుపరుస్తుంది. ఈ భంగిమలో తల గుండెకు దిగువన ఉంటుంది. ఉత్తనాసనం మెదడుకు ఆక్సిజన్ అధికంగా ఉండే రక్త ప్రవాహాన్ని మెరుగుపరుస్తుంది. ఉత్తనాసనం రోజూ చేయడం వల్ల ఆందోళన, ఒత్తిడి తగ్గుతుంది. అంతేకాకుండా ఇది మనస్సును ప్రశాంతంగా ఉంచడంలో సహాయపడుతుంది.

విపరీత కరణి ఆసనం

ఈ ఆసనం ఎంతో సరళమైనది. ఈఆసనం చేయడం ద్వారా మనిషిలో ఆందోళన తగ్గుతుంది. ఇది మనస్సును ప్రశాంతతతో ఉంచడంలో సహాయపడుతుంది. నాడీ వ్యవస్థను ప్రేరేపిస్తుంది. విపరిత కరణి రక్త ప్రవాహాన్ని కూడా నియంత్రిస్తుంది. నిరాశ, నిద్రలేమికి ఈఆసనం ఉపయోగపడుతుంది.

ఇవి కూడా చదవండి

శవాసనం

ఈఆసనం మనిషికి ఎంతో ప్రశాంతతనిస్తుంది. కేవలం పడుకుంటే శవాసనం వేసినట్లు కాదు. ఈ ఆసనం వేయడానికి కొన్ని పద్ధతులు ఉన్నాయి. వాటిని పాటించి ఈ ఆసనం వేయాలి. మానసిక ఆరోగ్యాన్ని పెంచడం, శరీరానికి విశ్రాంతి ఇవ్వడానికి ఈఆసనం అద్భుతమైనది.

మరిన్ని హెల్త్ వార్తల కోసం చూడండి..