
ఉప్పు శరీరానికి అవసరమైన లవణం.. మన శరీరానికి కావాల్సిన సోడియంలో 90 శాతం ఉప్పు నుంచే లభిస్తుంది. ఉప్పు సాంకేతిక నామం సోడియం క్లోరైడ్.. అయితే.. ఉప్పును రోజుకు ఒక టీ స్పూన్, అంటే 2300 మిల్లీ గ్రాములకు మించి తీసుకోకపోవడం మంచిదని నిపుణులు చెబుతారు.. అయితే.. అధిక ఉప్పు ఉన్న ఆహారాలను తీసుకోకుండా.. మితంగా ఉప్పును తీసుకోవడం వల్ల చాలా ఆరోగ్య సమస్యలను నివారించవచ్చని అనేక అధ్యయనాలు చెబుతున్నాయి.. అయితే.. సాధారణంగా చాలా మంది వీటిని పెద్దగా పట్టించుకోరు.. ఉప్పును పంచదారలా తీనెస్తుంటారు.. వాస్తవానికి మనం తినే ఆహార పదార్థాల్లో ఉప్పును వినియోగిస్తాం.. అయితే..దీని అధిక వినియోగం శరీరానికి హాని కలిగిస్తుంది.. మీ శరీరంలో ఉప్పు పరిమాణం పెరిగితే, అది మీ ఆరోగ్యానికి ప్రమాదకరం. ఉప్పు ఎక్కువగా తీసుకోవడం వల్ల అధిక రక్తపోటు, వాపు, బలహీనత వంటి అనేక వ్యాధులు వస్తాయి. ఈ లక్షణాలను విస్మరించడం సరైనది కాదు.. ఎందుకంటే అవి తీవ్రమైన వ్యాధుల సంకేతాలు కావచ్చు. అందువల్ల, శరీరంలో ఉప్పు పెరుగుదల లక్షణాలు ఏమిటి..? వాటిని ఎలా నివారించవచ్చు.. అనే తెలుసుకోవడం ముఖ్యం..
అధిక రక్తపోటు: మీ శరీరంలో ఉప్పు పరిమాణం పెరిగితే, అది మీ రక్తపోటుపై ప్రత్యక్ష ప్రభావాన్ని చూపుతుంది. ఉప్పు ఎక్కువగా తీసుకోవడం వల్ల రక్తపోటు పెరుగుతుంది.. దీనిని హైపర్‌టెన్షన్ అంటారు. అధిక రక్తపోటు గుండె జబ్బులకు కారణమవుతుంది. దీని లక్షణాలు తలనొప్పి, తల తిరగడం, వేగవంతమైన హృదయ స్పందన లాంటివి కనిపిస్తాయి.. మీరు ఈ లక్షణాలను అనుభవిస్తే, మీ శరీరంలో ఉప్పు ఎక్కువగా ఉందని.. లేదా ఎక్కువ అయిందని గ్రహించాలి.. అప్పుడు వెంటనే దానిని నియంత్రించాల్సిన అవసరం ఉందని వైద్య నిపుణులు చెబుతున్నారు.
శరీరంలో వాపు: మీరు ఉప్పు ఎక్కువగా తింటే, మీ శరీరంలో నీరు పేరుకుపోవచ్చు. ఇది చేతులు, పాదాలు, ముఖం, కడుపులో వాపుకు కారణమవుతుంది. ఈ వాపు మీ శరీరంలో ఉప్పు పరిమాణం పెరిగిందనడానికి సంకేతం, ఇది తగ్గించాల్సిన అవసరం ఉంది.
పదే పదే దాహంగా అనిపించడం: ఉప్పు ఎక్కువగా తింటే మళ్లీ మళ్లీ దాహం వేస్తుంది. అదనపు ఉప్పును తొలగించడానికి శరీరం ప్రయత్నించే మార్గం ఇది. అందువల్ల, ఎక్కువ ఉప్పు తినడం వల్ల దాహం పెరుగుతుంది, తద్వారా శరీరంలో ఉప్పు సమతుల్యత ఉంటుంది.
మూత్రంలో మార్పులు: ఉప్పు ఎక్కువగా తీసుకోవడం వల్ల మూత్రం ముదురు రంగులోకి మారడంతో పాటు దాని పరిమాణం కూడా తగ్గుతుంది. ఇది మూత్రపిండాలపై పెరుగుతున్న ఒత్తిడికి సంకేతం, దీని కారణంగా మూత్రపిండాలు ఎక్కువగా పని చేయాల్సి ఉంటుంది. కాబట్టి, ఉప్పు మొత్తాన్ని నియంత్రించడం చాలా ముఖ్యం.
అలసట – బలహీనత: అధిక ఉప్పు శరీరంలో బలహీనత, అలసటను కలిగిస్తుంది. ఎందుకంటే ఇది శరీర సమతుల్యతను దెబ్బతీస్తుంది. దీన్ని జాగ్రత్తగా చూసుకోవడం ముఖ్యం.
మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
(ఈ సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే.. ఫాలో అయ్యేముందు డైటీషియన్లను సంపద్రించండి)