చల్లగా ఉన్నాయని తెగ తాగుతున్నారా..? ఆసుపత్రికి వెళతారు.. జాగ్రత్త..

వేసవికాలం వచ్చేసింది.. ఎండలు మండిపోతున్నాయి. రోజు రోజుకు పెరుగుతున్న ఉష్ణోగ్రతలతో ప్రజలు అల్లాడుతున్నారు. ప్రజలు ఎండాకాలం రాగానే సాధారణంగా వాటర్ బాటిళ్లను ఫ్రిజ్ లో ఉంచడం మొదలుపెడతారు. తద్వారా దాహం వేసినప్పుడల్లా.. ఫ్రిడ్జ్ లోని వాటర్‌ను బయటకు తీసి తాగడం ప్రారంభిస్తారు. అయితే ఫ్రిజ్‌లోని నీటిని నేరుగా తాగడం ఆరోగ్యానికి ప్రమాదకరమని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.

చల్లగా ఉన్నాయని తెగ తాగుతున్నారా..? ఆసుపత్రికి వెళతారు.. జాగ్రత్త..
Cold Water
Follow us

|

Updated on: Apr 04, 2024 | 12:38 PM

వేసవికాలం వచ్చేసింది.. ఎండలు మండిపోతున్నాయి. రోజు రోజుకు పెరుగుతున్న ఉష్ణోగ్రతలతో ప్రజలు అల్లాడుతున్నారు. ప్రజలు ఎండాకాలం రాగానే సాధారణంగా వాటర్ బాటిళ్లను ఫ్రిజ్ లో ఉంచడం మొదలుపెడతారు. తద్వారా దాహం వేసినప్పుడల్లా.. ఫ్రిడ్జ్ లోని వాటర్‌ను బయటకు తీసి తాగడం ప్రారంభిస్తారు. అయితే ఫ్రిజ్‌లోని నీటిని నేరుగా తాగడం ఆరోగ్యానికి ప్రమాదకరమని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. అంతేకాకుండా.. అసలు ఫ్రిడ్జ్ వాటర్ తాగకుండా ఉండటమే మేలని పేర్కొంటున్నారు.

ఆరోగ్యంపై ప్రభావం..

ఎండాకాలంలో రిఫ్రిజిరేటర్ నుంచి తీసిన చల్లటి నీటిని తాగడం వల్ల ఆరోగ్యంపై చెడు ప్రభావం చూపుతుందని.. మీకు కూడా అలాంటి అలవాటు ఉంటే ఈరోజే మార్చుకోవాలని సూచిస్తున్నారు. ఎందుకంటే కూల్ వాటర్ శరీరానికి ప్రమాదకరంగా మారవచ్చు. రిఫ్రిజిరేటర్‌లోని చల్లటి నీటిని తాగడం వల్ల ఊబకాయం పెరగడమే కాకుండా అనేక వ్యాధులు వచ్చే ప్రమాదం ఉంది.

గుండె ఆరోగ్యం దెబ్బతింటుంది

చల్లటి నీరు తాగడం వల్ల గుండెకు చాలా హాని కలుగుతుంది. దీని కారణంగా, రక్త నాళాలు కుంచించుకుపోతాయి. రక్త ప్రసరణ కూడా మందగిస్తుంది. చల్లటి నీరు తాగడం వల్ల రక్తనాళాలు చాలా గట్టిపడతాయి.. దీంతో గుండె సమస్యలు మొదలవుతాయి.

ఊబకాయాన్ని పెంచుతుంది

చల్లటి నీరు తాగడం వల్ల శరీరంలోని కొవ్వు నెమ్మదిగా పెరుగుతుంది.. స్థూలకాయాన్ని తగ్గించుకోవడంలోనూ, కొవ్వును కరిగించుకోవడంలోనూ చాలా కష్టాలు మొదలవుతాయి. మీరు బరువు తగ్గాలనుకుంటే చల్లటి నీరు అస్సలు తాగకండి. సాధారణ లేదా గోరువెచ్చని నీరు త్రాగాలి.

చల్లటి నీరు తాగడం వల్ల జీర్ణశక్తి దెబ్బతింటుంది

చల్లటి నీరు తాగడం వల్ల జీర్ణశక్తి పూర్తిగా పాడవుతుంది. అటువంటి పరిస్థితిలో, ఫ్రిజ్ లోని చల్లని నీరు త్రాగకుండా ప్రయత్నించండి. ఇది జీర్ణక్రియను దెబ్బతీసి మలబద్ధకం సమస్యను పెంచుతుంది.

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..